Skip to main content

కొలువుల కల్పనలో ముందున్న పర్యాటకం.. రూ.40వేల వరకు ప్రారంభ వేతనంతో ఉద్యోగాలు..!

పలు సంస్థల అంచనా ప్రకారం-2024 నాటికి టూరిజం రంగం మూడు మిలియన్ల ఉద్యోగాలకు వేదికగా నిలవనుంది.

గతేడాది కరోనా పరిస్థితుల కారణంగా నియామకాలు కొంతమేర తగ్గాయి. మరికొద్ది నెలల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. దాంతో టూరిజం అండ్ ట్రావెల్ రంగం రికవరీ బాట పట్టి.. నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ నెపథ్యంలో కోర్సులందించే ఇన్‌స్టిట్యూట్స్, జాబ్ ప్రొఫైల్స్గురించి తెలుసుకోండిలా..

కోర్సులందించే ఇన్‌స్టిట్యూట్స్..

  1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ అండ్ టూరిజం మేనేజ్‌మెంట్
  2. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్
  3. సెంటర్ ఫర్ టూరిజం స్టడీస్ - పుదుచ్చేరి యూనివర్సిటీ
  4. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం)
  5. ఇందిరా గాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీఐజీఎన్‌టీయూ)
  6. నేషనల్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్
  7. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, నెల్లూరు. వీటితోపాటు రాష్ట్రస్థాయిలో పలు యూనివర్సిటీల్లోనూ ఎంబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ప్రముఖ ఇన్‌స్టిట్యూట్స్ బీబీఏ, బీబీఎంలో టూరిజం ఎలక్టివ్ కోర్సును అందిస్తున్నాయి.


జాబ్ ప్రొఫైల్స్..
టూరిజం కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు పలు రకాల ఉద్యోగావకాశాలు అందుబాటులో ఉన్నాయి.

  1. టిప్ అడ్వైజర్: పర్యాటక ప్రాంతాలకు విహార యాత్రలకు వెళ్లాలనుకునే వారికి నిర్దిష్ట బడ్జెట్ పరిమితులు ఉండటం పరిపాటి. పర్యాటకుల బడ్జెట్, వ్యవధి ఆధారంగా వారు ఎంచుకున్న ప్రాంతాలకు సదరు టూర్‌ను సమర్థంగా షెడ్యూల్ చేయడం ట్రిప్ అడ్వైజర్స్ విధుల్లో ప్రధానమైంది. వీరికి నెలకు రూ.30 వేల నుంచి రూ.40వేల వరకు వేతనం అందుతుంది.
  2. టూర్ మేనేజర్/గ్రూప్ టూర్ మేనేజర్: నిర్దిష్ట టూర్, పర్యాటకులకు సంబంధించి టికెట్ రిజర్వేషన్ మొదలు..ఆయా ప్రాంతాల్లో వసతి, పర్యాటక ప్రాంతాల సందర్శన వంటి విషయాల్లో సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చే వారే టూర్ మేనేజర్/గ్రూప్ టూర్ మేనేజర్. వీరికి వేతనం రూ.40వేలకు పైగానే ఉంటుంది.
  3. టూరిస్ట్ గైడ్: ఏదైనా ఒక ప్రదేశానికి వచ్చిన పర్యాటకులకు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ప్రత్యేకతలను వివరించడం వీరి ప్రధాన విధి. వీరికి మాతృభాషతో పాటు కనీసం రెండు ఇతర భాషలు తెలిసుండాలని సంస్థలు పేర్కొం టున్నాయి. టూరిస్ట్ గైడ్‌లకు నెలకు రూ.20వేల వరకు వేతనం లభిస్తుంది.
  4. ట్రావెల్ కౌన్సిలర్: మీరు ఏదైనా ఒక ఒక పర్యాటక ప్రాంతానికి వెళ్లాలనుకున్నారు. కానీ ఎక్కడికి వెళ్లాలో అవగాహన లేదు. అలాంటి పరిస్థితుల్లో మీ వ్యక్తిగత అభిరుచి, ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటూ.. అనువైన పర్యాటక ప్రాంతాలను సూచించే వారే ట్రావెల్ కౌన్సెలర్స్. వీరికి నెలకు రూ.20 వేల వరకు వేతనం అందుతోంది.
  5. రైటర్స్: ఆయా ప్రాంతాలకు సంబంధించిన వివ రాలను పర్యాటకులను ఆకట్టుకునే రీతిలో వర్ణిస్తూ రాయడం వీరి జాబ్ ప్రొఫైల్‌గా ఉంటోంది.


Cంకా చదవండి: part 3: పర్యాటక కోర్సులు చేస్తే ఉపాధి అందించే వేదికలు ఇవే..

Published date : 24 Feb 2021 02:42PM

Photo Stories