క్లాట్ ఎంట్రన్స్ మిస్ అయినవారికి.. మరో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష ఏఐఎల్‌ఈటీ..
Sakshi Education
ఆలిండియా లా ఎంట్రన్స్ టెస్ట్(ఏఐఎల్‌ఈటీ).. జాతీయ స్థాయిలో మరో లా ఎంట్రెన్స్ ఇది. ఈ పరీక్ష ద్వారా ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీలో ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, ఏడాది వ్యవధిలోని ఎల్‌ఎల్‌ఎం, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమానం; ఎల్‌ఎల్‌ఎం కోర్సుకు ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానం; పీహెచ్‌డీ కోర్సుకు ఎల్‌ఎల్‌ఎం లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఏఐఎల్‌ఈటీ ప్రశ్నపత్రంలో 150 ఎంసీక్యూ ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి గంటన్నర.
ఏఐఎల్‌ఈటీ-2021 ముఖ్య సమాచారం..
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరితేదీ: మే 20, 2021
- ఏఐఎల్‌ఈటీ నిర్వహణ తేది: జూన్ 20, 2021
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nludelhi.ac.in/home.aspx
ఇంకా చదవండి: part 3: తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా లా ఎంట్రన్స్ టెస్ట్.. వివరాలు ఇవే..
Published date : 03 Feb 2021 06:55PM