క్లాట్- 2020 సిలబస్, నూతన పరీక్ష విధానం, ప్రిపరేషన్ గెడైన్స్..
Sakshi Education
ప్రతిష్టాత్మక నేషనల్ లా యూనివర్సిటీల్లో ప్రవేశానికి నిర్వహించే క్లాట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది. దాంతోపాటే క్లాట్ కొత్త పరీక్ష విధానంపై స్పష్టత వచ్చింది. ప్రశ్న పత్రంలో 150 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు ఉంటాయని నిర్వహణ సంస్థ నేషనల్ లా యూనివర్సిటీల(ఎన్‌ఎల్‌యూ) కన్సార్టియం పేర్కొంది. క్లాట్ 2020 ఆఫ్‌లైన్ విధానంలో (పెన్-పేపర్) జరుగనుంది. 12వ తరగతి స్థాయిలో ప్రశ్న పత్రం ఉంటుంది. క్వాంటిటేటివ్ అనాలసిస్ విభాగం మాత్రం పదోతరగతి మ్యాథమెటిక్స్ స్థాయిలో ఉండనుంది. అదేవిధంగా క్లాట్ పీజీలో తొలిసారిగా కటాఫ్ మార్కుల విధానం ప్రవేశం పెట్టారు. ఈ నేపథ్యంలో.. క్లాట్ 2020 నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, పరీక్ష నూతన విధానం, సిలబస్ విశ్లేషణ, ప్రిపరేషన్ టిప్స్...
మారిన క్లాట్ :
అర్హతలు..
క్లాట్ యూజీ: 10+2/ఇంటర్మీడియెట్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. విద్యార్హత ఫైనల్ పరీక్షలు మార్చి/ఏప్రిల్ 2020లో రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
క్లాట్ పీజీ: అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీని కనీసం 55 శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకోవాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.
ప్రవేశం ఇలా..
21 ఇన్‌స్టిట్యూట్‌లు... 2500 సీట్లు :
ప్రవేశం కల్పించే 21 నేషనల్ లా యూనివర్సిటీలు ఇవే:
యూజీ సిలబస్ :
పీజీ సిలబస్ :
క్లాట్ పీజీ సిలబస్‌లో... కాన్స్‌టిట్యూషనల్ లాతోపాటు ఇతర లా సబ్జెక్టులైన కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఐపీఆర్, జురిస్ ప్రుడెన్స్‌తదితర అంశాలు ఉంటాయి.
ప్రిపరేషన్ టిప్స్..
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.3500.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జనవరి 1, 2020
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2020
క్లాట్ 2020 పరీక్ష తేది: మే 10, 2020
ఫలితాల వెల్లడి: మే 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in
మారిన క్లాట్ :
- గతేడాది వరకూ క్లాట్ యూజీ పరీక్ష 200 ప్రశ్నలు-200 మార్కులకు జరిగేది.
- క్లాట్ 2020 మాత్రం 150 ప్రశ్నలు-150 మార్కులకు నిర్వహించనున్నారు.
- పరీక్ష సమయం రెండు గంటలు. ప్రశ్న పత్రం మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటుంది.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్, కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, లీగల్ రీజనింగ్, క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు అడగనున్నారు.
- పరీక్ష ప్రశ్న పత్రం కాంప్రెహెన్షన్ ఆధారితంగా ఉంటుంది. పరీక్షలో సిలబస్‌లోని అన్ని విభాగాల నుంచి కాంప్రెహెన్షన్ ఆధారిత ప్రశ్నలు ఎదురవుతాయి.
- ప్రశ్న పత్రం 12వ తరగతి స్థాయిలో ఉంటుంది. అయితే క్వాంటిటేటివ్ అనాలసిస్ విభాగం మాత్రం పదో తరగతి మ్యాథ్స్ స్థాయిలో ఉంటుంది.
- క్లాట్ పీజీలో... ఆబ్జెక్టివ్ (100 ప్రశ్నలు), సబ్జెక్టివ్ (2ప్రశ్నలు- 50 మార్కులు).. ఇలా రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు- 100 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల కోత విధిస్తారు. సబ్జెక్టివ్ పేపర్‌లో.. ఎస్సే తరహా ప్రశ్నలు రెండు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 25 మార్కుల చొప్పున మొత్తం 50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.
- క్లాట్ పీజీ ఆబ్జెక్టివ్ తరహా పరీక్షలో జనరల్ అభ్యర్థులు కనీసం 45(ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 35 శాతం మార్కులు) శాతం మార్కులు సాధించాలి. దీంతో ఇప్పుడు కటాఫ్ మార్కులు సాధించడం కీలకంగా మారింది.
అర్హతలు..
క్లాట్ యూజీ: 10+2/ఇంటర్మీడియెట్‌లో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. విద్యార్హత ఫైనల్ పరీక్షలు మార్చి/ఏప్రిల్ 2020లో రాసే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
క్లాట్ పీజీ: అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీని కనీసం 55 శాతం మార్కులతో పూర్తి చేయాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులు తెచ్చుకోవాలి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి గరిష్ట వయోపరిమితి నిబంధనలేదు.
ప్రవేశం ఇలా..
- నేషనల్ లా యూనివర్సిటీలు క్లాట్ యూజీ, పీజీ టెస్ట్‌ల్లో సాధించిన స్కోర్‌తోపాటు అభ్యర్థి ఇచ్చిన ఆఫ్షన్ల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి సంబంధిత కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
- క్లాట్ యూజీ, పీజీ పరీక్షలో స్కోర్ ఆధారంగా ఆయా నేషనల్ లా యూనివర్సిటీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకామ్ ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యూ ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో అడ్మిషన్ లభిస్తుంది.
21 ఇన్‌స్టిట్యూట్‌లు... 2500 సీట్లు :
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా (ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్), రాంచీ... క్లాట్ 2020ను ఆఫ్‌లైన్ విధానంలో (పెన్-పేపర్) నిర్వహించనుంది. క్లాట్ యూజీ, పీజీ పరీక్షల స్కోర్ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న 21 నేషనల్ లా యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌యూ)ల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిల్లో దాదాపు 2500 అండర్‌గ్రాడ్యుయేట్(యూజీ) సీట్లు, 720 పోస్ట్‌గ్రాడ్యుయేట్(పీజీ) సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్లాట్ స్కోర్ ఆధారంగా ఎన్‌ఎల్‌యూలతోపాటు పలు ప్రైవేట్ లా విద్యాసంస్థలు సైతం ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
ప్రవేశం కల్పించే 21 నేషనల్ లా యూనివర్సిటీలు ఇవే:
- ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ, బెంగళూరు
- నల్సార్, హైదరాబాద్
- ఎన్‌ఎల్‌ఐయూ, భోపాల్
- డబ్ల్యూబీఎన్‌యూజేఎస్, కోల్‌కతా
- ఎన్‌ఎల్‌యూ, జోధ్‌పూర్
- హెచ్‌ఎన్‌ఎల్‌యూ, రాయ్‌పూర్
- జీఎన్‌ఎల్‌యూ, గాంధీనగర్ బ
- ఆర్‌ఎంఎల్‌ఎన్‌ఎల్‌యూ, లక్నో
- ఆర్‌జీఎన్‌యూఎల్, పంజాబ్
- సీఎన్‌ఎల్‌యూ, పాట్నా
- ఎన్‌యూఏఎల్‌ఎస్, కోచి
- ఎన్‌ఎల్‌యూవో, ఒడిసా
- ఎన్‌యూఎస్‌ఆర్‌ఎల్, రాంచి
- ఎన్‌ఎల్‌యూజేఏ, అస్సాం
- డీఎస్‌ఎన్‌ఎల్‌యూ, విశాఖపట్నం
- ఎమ్‌ఎన్‌ఎల్‌యూ, ముంబయి
- ఎంఎన్‌ఎల్‌యూ, నాగ్‌పూర్
- ఎంఎన్‌ఎల్‌యూ, ఔరంగాబాద్
- హెచ్‌పీఎన్‌ఎల్‌యూ, షిమ్లా
- డీఎన్‌ఎల్‌యూ, జబల్‌పూర్
- డీబీఆర్‌ఏఎన్‌ఎల్‌యూ, హర్యానా.
యూజీ సిలబస్ :
- ఇంగ్లిష్ విభాగంలో కాంప్రెహెన్షన్ ప్యాసేజ్‌లు, గ్రామర్ అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
- మ్యాథమెటిక్స్‌లో.. పదోతరగతి స్థాయిలోని ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి.
- జనరల్ నాలెడ్జ్ విభాగంలో.. స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ పై ప్రశ్నలు అడిగే వీలుంది.
- కరెంట్ అఫైర్స్‌లో జాతీయ, అంతర్జాతీయ వార్తలు, తాజా పరిణామాలపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది.
- లాజికల్ రీజనింగ్ అంశం నుంచి అభ్యర్థి లాజికల్, అనలిటికల్ సామర్థ్యాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు.
- లీగల్ ఆప్టిట్యూడ్‌లో.. స్టడీ ఆఫ్ లా, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీతోపాటు హైపోథెటికల్ సిట్యూవేషన్స్‌పైన ప్రశ్నలు ఎదురవుతాయి.
పీజీ సిలబస్ :
క్లాట్ పీజీ సిలబస్‌లో... కాన్స్‌టిట్యూషనల్ లాతోపాటు ఇతర లా సబ్జెక్టులైన కాంట్రాక్ట్, టార్ట్స్, క్రిమినల్ లా, ఇంటర్నేషనల్ లా, ఐపీఆర్, జురిస్ ప్రుడెన్స్‌తదితర అంశాలు ఉంటాయి.
ప్రిపరేషన్ టిప్స్..
- ఏటేటా క్లాట్‌కు పోటీ పెరుగుతున్న దృష్ట్యా సాధ్యమైనంత త్వరగా ప్రిపరేషన్ ప్రారంభించాలి. ఫలితంగా సిలబస్‌లోని అన్ని టాపిక్స్‌ను సమగ్రంగా అధ్యయనం చేయడంతోపాటు రివిజన్‌కు సమయం లభిస్తుంది.
- మొదట సిలబస్ అంశాలను విశ్లేషించి.. తన బలాలు, బలహీనతలను గుర్తించి..అందుకు అనుగణంగా పటిష్ట ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకోవాలి.
- ప్రిపరేషన్‌కు ప్రామాణిక పుస్తకాలను ఎంచుకోవడం మేలు చేస్తుంది. ఆయా పుస్తకాల భాష సైతం సరళంగా ఉండేలా చూసుకోవాలి.
- సిలబస్ మొత్తం ఒకసారి చదవడం పూర్తిచేశాక.. గత ప్రశ్న పత్రాలను, మోడల్ పేపర్లను తరచూ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది.
- పరీక్షకు నెల రోజుల ముందు నుంచి మాక్ టెస్టులకు హాజరుకావచ్చు. అంతేకాకుండా రివిజన్‌కు ఎక్కువ సమయం కేటాయించడం సక్సెస్‌కు దోహదం చేస్తుంది.
ముఖ్య సమాచారం :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ.4000; ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.3500.
దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: జనవరి 1, 2020
దరఖాస్తులకు చివరి తేది: మార్చి 31, 2020
క్లాట్ 2020 పరీక్ష తేది: మే 10, 2020
ఫలితాల వెల్లడి: మే 24, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in
Published date : 26 Dec 2019 12:30PM