Skip to main content

జీమ్యాట్‌ పరీక్ష ద్యారా అభ్యర్థుల్లో పరీక్షించే నైపుణ్యాల గురించి తెలుసుకోండిలా..

జీమ్యాట్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘అనలిటికల్‌ రైటింగ్‌ అనాలసిస్‌’ మొదట కొంత కఠినంగా అనిపించొచ్చు.

 కాని ఇచ్చిన టాపిక్‌ను సరిగా అంచనా వేయగలిగి.. సమాధానం రాస్తే గరిష్ట స్కోరు సొంతం చేసుకోవచ్చు.

  • అభ్యర్థులు ఇప్పటికే వివిధ పత్రికల్లో వచ్చే ఎన్నో ఎడిటోరియల్స్‌ చదువుతూ ఉంటారు. ఇలాంటి వ్యాసాల్లో ఎంచుకున్న అంశాన్ని లోతుగా పరిశీలించడంతో పాటు దానివల్ల కలిగే మంచి చెడులను విశ్లేషణాత్మంగా వివరిస్తారు. అనలిటికల్‌ రైటింగ్‌ అనాలసిస్‌ కూడా అలాంటిదే.
  • పరీక్షలో ఈ విభాగానికి ఉన్నది 30 నిమిషాలు మాత్రమే. ఈ సమయంలో అభ్యర్థి రాసే వ్యాసం మార్కుల కోసం కాకుండా.. తన విశ్లేషణా శక్తిని ప్రతిబింబించేలా ఉండాలి. ఈ విభాగానికి 0 నుంచి 6 స్కేల్‌ గ్రేడ్‌ కేటాయించారు.
  • అనలిటికల్‌ రైటింగ్‌ అనాలసిస్‌ అనేది అభ్యర్థి విశ్లేషణా త్మక రచనా నైపుణ్యాలను అంచనా వేయడానికి ఉద్దేశించింది. ఇచ్చిన టాపిక్‌పై వ్యతిరేకంగా లేదా అనుకూలంగా రాసినప్పటికీ..అందులో అభ్యర్థి విశ్లేషణను, ఆలోచనా విధానాన్ని మాత్రమే పరిశీలిస్తారు.

సామర్థ్యాల అంచనా..
అనలిటికల్‌ రైటింగ్‌ అనాలసిస్‌లో అభ్యర్థుల సామర్థ్యాలను నాలుగు రకాలుగా అంచనా వేస్తారు. అవి..

  • క్వాలిటీ ఆఫ్‌ ఐడియాస్‌
  • ఆర్గనైజేషన్‌
  • రైటింగ్‌ స్టైల్
  • గ్రామర్‌ అండ్‌ యూసేజ్‌.. వీటిæ ఆధారంగా పాయింట్‌ ఇంక్రిమెంట్లలో 0 నుంచి 6 వరకు స్కోరును కేటాయిస్తారు. ఈ నాలుగు అంశాలలో అభ్యర్థి రాసిన వ్యాసం.. ఏ స్థాయిలో ఉందో అంచనా వేస్తారు. ఈ విషయం అభ్యర్థుల ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ‘ఏడబ్ల్యూఏ’ విభాగంలో.. ఎంత స్కోరు చేస్తారనేది అభ్యర్థుల ఆలోచనా దృక్పథంపై ఆధారపడి ఉంటుంది. ఇచ్చిన ప్రశ్నను అర్థం చేసుకోవడం ద్వారా మంచి మార్కులు స్కోరు చేసేయవచ్చు.
  • ఇచ్చిన ప్రశ్నలు అన్నింటినీ పూర్తిగా అర్థం చేసుకోవడమేగాక, విశ్లేషించుకోవాలి. దేనిపై సమగ్ర అవగాహన ఉందో దాన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఎంచుకున్న టాపిక్‌ను మూస ధోరణితో కాకుండా.. వివరణాత్మకంగా, పేరాగ్రాఫ్‌లుగా విభజించి విభిన్నమైన ప్రజెంటేషన్‌ ఇవ్వాలి. అందుకోసం పరీక్షకు ముందే రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం లాభిస్తుంది.
  • పరీక్షలో ఏదైనా టాపిక్‌ ఇచ్చి.. దాన్ని జడ్జ్‌ చేయమనే అవకాశం ఉంటుంది. అలాంటి వ్యాసం రాయాల్సి వస్తే.. ఏదో వాదనకు పరిమితం కాకుండా.. అన్ని కోణాలను విశ్లేషించాలి. వ్యాసాన్ని పేరాలుగా విభజించి.. ఒక్కో పేరాలో ఒక్కో విశ్లేషణ ఉండేలా చూడాలి. అంశాన్ని స్థూలంగా, లోతుగా రాయాలి. వివాదాల జోలికి అస్సలు వెళ్లొద్దు. వ్యాసం ముగింపు సూక్ష్మంగా ఉండేలా చూడాలి. అభ్యర్థి పరీక్షలో చివరి ఐదు నిమిషాలు.. రాసిన వ్యాసంలో లోటుపాట్లను సవరించుకునేందుకు వినియోగించుకోవాలి.

ఇంకా చదవండి: part 3: జీమ్యాట్‌ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే దీనిపై దృష్టి పెట్టాల్సిందే..

Published date : 25 Feb 2021 05:58PM

Photo Stories