Skip to main content

ఇంటర్‌తోనే ఆర్మీలో లెఫ్టినెంట్‌ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది ఇదే..

దేశ రక్షణలో భాగస్వామి అవడం, సైన్యంలో చేరి మాతృ భూమికి సేవ చేసే అవకాశం.. ఉన్నత స్థాయి హోదాతోపాటు ఉన్నత విద్య..ఇవన్నీ పైసా ఖర్చు లేకుండా పొందే అవకాశం వస్తే..! ఎగిరి గంతేస్తాం. చిన్న వయసులోనే ఇంటర్‌తోనే చక్కటి అవకాశాన్ని కల్పిస్తోంది..

ఇండియన్‌ ఆర్మీ!! అందుకోసం ప్రతి ఏటా 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌(టెస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేస్తోంది. దీనిద్వారా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి.. ఉన్నత స్థాయి విద్య, శిక్షణ ఇచ్చి ఆర్మీలోని ఉన్నత స్థాయి ఉద్యోగాలలో పనిచేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

తాజాగా ఇండియన్‌ ఆర్మీ 10+2 ఎంట్రీ స్కీమ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసిన నేపథ్యంలో.. అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, అందించే విద్యా, ఉద్యోగం, వేతనాలు, కెరీర్‌పై సమగ్ర సమాచారం..

  1.  కోర్సు: 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌
  2.  కోర్సు ప్రారంభం: జనవరి 2021
  3.  మొత్తం పోస్టుల సంఖ్య : 90

అర్హతలు..

  1.  ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ఇంటర్మీడియెట్‌ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

వయసు..

  1.  జూలై 2, 2001 నుంచి జూలై 1, 2004 మధ్య జన్మించి ఉండాలి. అభ్యర్థి 16 1/2 ఏళ్ల నుంచి 19 1/2 మధ్య వయసు కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ..

ఇంటర్‌ లేదా తత్సమాన విద్యలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఎంపికైన వారికి ఐదు రోజుల పాటు అలహాబాద్, భోపాల్, బెంగళూర్, కపుర్తలా.. ఇలా అభ్యర్థులకు కేటాయించిన ఏదో ఒక ప్రాంతంలో సైకలాజికల్‌ టెస్ట్, గ్రూప్‌ టెస్ట్, సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ఇందులోనూ ప్రతిభ చూపించిన అభ్యర్థులను చివరిగా మెడికల్‌ టెస్ట్‌లు చేస్తారు.

పర్మనెంట్‌ కమిషన్‌..

ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌కు అర్హత సాధించిన అభ్యర్థులు కోర్సును విజయవంతంగా పూర్తిచేసినట్లయితే.. వారిని పర్మినెంట్‌ కమిషన్‌ కింద ఆర్మీలో లెఫ్టినెంట్‌ ర్యాంకును కల్పిస్తారు.

శిక్షణ..

  1. ఇండియన్‌ ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌లో ఎంపికైన అభ్యర్థులకు మొత్తం ఐదేళ్ల పాటు శిక్షణ ఉంటుంది. ఇందులో బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్, టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఉంటాయి.
  2.  బేసిక్‌ మిలిటరీ ట్రైయినింగ్‌ : బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ ఒక ఏడాది పాటు ఉంటుది. బిహార్‌ రాష్ట్రంలోని గయలోని ఆఫీసర్‌ ట్రెనింగ్‌ అకాడమీలో ఈ శిక్షణను అందిస్తారు.
  3.  టెక్నికల్‌ ట్రెయినింగ్‌ : బేసిక్‌ మిలిటరీ ట్రైనింగ్‌ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు రెండు దశల్లో టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. ఫేజ్‌ –1 కింద మూడేళ్ల పాటు ప్రీ కమిషన్‌ శిక్షణ అందిస్తారు. ఆ తర్వాత ఫేజ్‌–2 కింద ఏడాదిపాటు పోస్ట్‌ కమిషన్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. రెండు ఫేజ్‌ల్లో అందించే శిక్షణను సీఎంఈ పూణే, ఎంసీటీఈ మావ్, ఎంసీఈఎంఈ సికింద్రాబాద్‌ల్లో నిర్వహిస్తారు.

శిక్షణ అనంతరం..

ఎంపికైన అభ్యర్థులకు ఫైనల్‌ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాక ఇంజనీరింగ్‌ డిగ్రీ పట్టా ఇస్తారు. జేఎన్‌యూ ఈ డిగ్రీ పట్టాను అందిస్తుంది. డిగ్రీ పట్టాను పొందిన అభ్యర్థులను లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకొని పర్మినెంట్‌ ఉద్యోగులుగా పరిగణిస్తారు.

స్టైపెండ్‌ రూ.56,000..

మూడేళ్ల ట్రైనింగ్‌ అనంతరం అభ్యర్థులకు నెలకు రూ.56,100 చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. నాలుగేళ్ల ట్రెయినింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులకు పూర్తి వేతనం అమలవుతుంది.

కెరీర్‌ స్కోప్‌..

సైన్యంలో కెరీర్‌కు ఎటువంటి డోకా లేదు. అది హోదా విషయంలో కానీ వేతనాల విషయంలో కానీ ఉజ్వల కెరీర్‌ సొంతమవుతుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో కెరీర్‌ ప్రారంభించిన రెండేళ్లకు(కెప్టెన్‌), ఆరేళ్లకు (మేజర్‌), పదమూడేళ్లకు(లెఫ్టినెంట్‌ కల్నల్‌), ఇరవై అరేళ్లకు (కల్నల్‌).. ఇలా వివిధ హోదాల్లో పదోన్నతులు పొందుతారు. భవిష్యత్తులో పనితీరు ఆధారంగా విభాగానికి అధిపతి అయ్యే కూడా అవకాశం దక్కించుకోవచ్చు.

దరఖాస్తు విధానం..

ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు ఉంటే ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ముగిసే వరకు ఎడిట్‌ ఆప్షన్‌ ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూరైన తర్వాత దరఖాస్తుకు సంబంధించిన రెండు కాపీల ప్రింట్‌ అవుట్‌ తీసుకోవాలి. రెండు దశల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో దరఖాస్తు కాపీలను కూడా తీసుకవెళ్లాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు..

ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీమ్‌ కోర్సుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు..

  1.  దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 10.08. 2020
  2.  దరఖాస్తులకు చివరి తేది: 09.09.2020
  3.  పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌ : www.joinindianarmy.nic.in

వేతానాలు

ర్యాంకు లెవల్‌ వేతనం(రూపాయల్లో)
లెఫ్టినెంట్‌ 10 56,100–1,77,500
కెప్టెన్‌ 10బి 61,300–1,93,900
మేజర్‌ 11 69,400–2,07,200
లెఫ్టినెంట్‌కల్నల్‌ 12ఏ 1,21,200–2,12,400
కల్నల్‌ 13 1,30,600–2,15,900
బ్రిగేడియర్‌ 13ఏ 1,39,600–2,17,000
మేజర్‌ జనరల్‌ 14 1,44,200–2,18,200
లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఏజీ స్కేల్‌ 15 1,82,200–2,24,100
లెఫ్టినెంట్‌ జనరల్‌ హెచ్‌ఏజీ +స్కేల్‌ 16 2,05,400–2,24,400
వీసీఓఏఎస్‌/ఆర్మీ కేడర్‌ / లెఫ్టినెంట్‌ జనరల్‌ (ఎన్‌ఎఫ్‌ఎస్‌జీ) 17 2,25,000–(ఫిక్స్‌డ్‌)
సీఓఏఎస్‌ 18 2,50,000 (ఫిక్స్‌డ్‌)
Published date : 20 Aug 2020 08:50PM

Photo Stories