ఇంజనీరింగ్‌లో ఈ కొత్త కోర్సు చేస్తే.. రూ.8లక్షల వార్షిక వేతనం పొందొచ్చు..
Sakshi Education
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ వినియోగం తప్పనిసరిగా మారింది. ప్రభుత్వ/ప్రైవేట్, వ్యాపార సంస్థలు సహా ప్రతీ రంగంలో లావాదేవీలన్నీ ఇంటర్నెట్ ఆధారంగానే జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఆయా లావాదేవీలు, సంబంధిత సమాచార భద్రత అనేది చాలా క్లిష్టంగా మారింది. ఇటువంటి విలువైన సమాచారాన్ని భద్రపరచడానికి రక్షణ కవచంగా వచ్చిందే..సైబర్ సెక్యూరిటీ.
- కోర్సు స్వరూపం: ఇంజనీరింగ్‌కు సంబంధించి సైబర్ సెక్యూరిటీ నాలుగేళ్ల కోర్సు. డేటా స్ట్రక్చర్, డిజిటల్ ప్రిన్సిపుల్స్, సిస్టమ్ డిజైన్, జావా ప్రోగ్రామింగ్, సిస్టమ్ సాఫ్ట్‌వేర్, అల్గారిథంలను రూపొందించడం వంటివి ఈ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు.
- జాబ్ ప్రోఫైల్: ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు సెక్యూరిటీ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ డెవలపర్, క్రిప్టానలిస్ట్, సెక్యూరిటీ ఇంజనీర్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే టీసీఎస్, ఇన్ఫోసిస్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్, వంటి సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందే వీలుంటుంది.
- వేతనాలు : సంస్థను బట్టి సైబర్ సెక్యూరిటీ నిపుణులకు వార్షిక వేతనం రూ.8 లక్షల వరకు లభిస్తుంది.
Published date : 17 Nov 2020 04:43PM