హెచ్‌ఎస్‌ఈఈ–2021 పరీక్ష విధానం.. దరఖాస్తుకు చివరి తేది ఇదే..
Sakshi Education
ఐఐటీ మద్రాస్‌లో ప్రవేశానికి ఉద్దేశించిన హెచ్‌ఎస్‌ఈఈకి పోటీ ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి ఇందులో విజయం సాధించాలంటే.. ముందు పరీక్ష విధానం తెలుసుకోవాలి. తద్వారా అధిక మార్కులు స్కోరు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.
- హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్–2021ను రెండు విభాగాలు (పార్ట్–1 అండ్ 2)గా నిర్వహిస్తారు. పార్ట్–1లో మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనిని 150 నిమిషాల్లో(2.30 గంటలు) పూర్తి చేయాలి. పార్ట్–2లో జనరల్ ఎస్సేను 30 నిమిషాల్లో రాయాల్సి ఉంటుంది. పార్ట్–1 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 144 మార్కులకు ఉంటే.. పార్ట్–2 ఎస్సే రైటింగ్‌కు 30 మార్కులు కేటాయించారు. గతేడాది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు ఒక మార్కు చొప్పున ఇవ్వగా.. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధించారు.
పార్ట్ 1 సిలబస్ ఇలా..
- ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్(25 శాతం)లో ప్రశ్నలు రీడింగ్ స్కిల్స్, గ్రామర్, వొక్యాబులరీపై ఉంటాయి.
- అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ (25 శాతం) లో ప్రశ్నలు నంబర్స్, ఆల్జీబ్రా, హైయీస్ట్ కామన్ ఫ్యాక్టర్ (హెచ్‌సీఎఫ్), లోయీస్ట్ కామన్ ఫ్యాక్టర్ (ఎల్‌సీఎఫ్), కేలండర్, బేసిక్ స్టాటిస్టిక్స్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రస్ట్, వర్క్ అండ్ టైమ్, డిస్కౌంట్, ఏజ్ సమ్స్, ఎలిమెంటరీ ట్రిగనోమెట్రీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, అనలైటికల్ రీజనింగ్ వంటి అంశాల నుంచి వస్తాయి.
- జనరల్ స్టడీస్‌లో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్, వరల్డ్ అఫైర్స్, ఎన్విరాన్‌మెంటల్ అండ్ ఎకాలజీ (50 శాతం)పై ప్రశ్నలు ఉంటాయి.
- పార్ట్–2లో నాలుగు ఎస్సే ప్రశ్నల నుంచి ఒకదానికి సమాధానం రాయాల్సి ఉంటుంది. ఇందులో కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జి పైన ప్రశ్నలు ఉంటాయి.
ముఖ్యమైన సమాచారం..
- ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: మార్చి 15, 2021
- ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహణ తేది: 2021 జూన్ 13
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://hsee.iitm.ac.in
ఇంకా చదవండి: part 1: ఇంటర్‌తో ఐఐటీలో హ్యుమానిటీస్ చదవాలనుకునే వారికి అవకాశం.. హెచ్‌ఎస్‌ఈఈ–2021 నోటిఫికేషన్ విడుదల..
Published date : 02 Mar 2021 02:23PM