హెచ్‌ఎస్‌ఈఈ-2020పరీక్ష విధానం ఇలా..
Sakshi Education
ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులను అందించడంలో పేరుగాంచిన.. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్ (ఐఐటీఎం).. సోషల్ స్టడీస్‌లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను కూడా అందిస్తుంది. ఏటా హెచ్‌ఎస్‌ఈఈ(హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్) ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది.
ఇటీవల హెచ్‌ఎస్‌ఈఈ-2020 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో.. పరీక్షకు సంబంధించిన సమగ్ర సమాచారం...
ప్రపంచ వ్యాప్తంగా హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ కోర్సులు చదివిన వారికి ప్రస్తుతం డిమాండ్ పెరుగుతోంది. కాని అందుకు తగ్గ నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభించడంలేదు. దాంతో ఐఐటీ మద్రాస్ ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులను ప్రారంభించింది. ఏటా దేశవ్యాప్తంగా హెచ్‌ఎస్‌ఈఈ పరీక్ష నిర్వహించి.. అర్హత సాధించిన వారికి ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇన్ ఇంగ్లిష్ స్టడీస్‌లో ప్రవేశం కల్పిస్తోంది. వీటి కాల వ్యవధి ఐదేళ్లు. ఈ కోర్సుల్లో భాగంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచడానికి థింకింగ్, రీసెర్చ్, ఐడియాస్, పీపుల్, సొసైటీ, ఎన్విరాన్‌మెంట్, హ్యూమన్ కండిషన్ తదితర కోణాల్లో బోధన, శిక్షణ ఉంటుంది. ఐఐటీ మద్రాస్ అందిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆయా రంగాల్లో అవకాశాలు అందుకునే వీలుంది.
కోర్సులు :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 60 శాతం.. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ :
హెచ్‌ఎస్‌ఈఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఐఐటీ మద్రాస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
పరీక్ష విధానం :
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ముగింపు తేదీ: జనవరి 22, 2020
అడ్మిట్ కార్డు: మార్చి 18, 2020
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19, 2020
ఫలితాలు: మే 15, 2020
ఆఫర్ లెటర్: మే 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://hsee.iitm.ac.in/

- ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇన్ డెవలప్‌మెంట్ స్టడీస్
- ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఇన్ ఇంగ్లిష్ స్టడీస్
- మొత్తం సీట్లు: 52
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సుల్లో జనరల్, ఓబీసీ విద్యార్థులు 60 శాతం.. ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
ఎంపిక ప్రక్రియ :
హెచ్‌ఎస్‌ఈఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థుల కటాఫ్ మార్కులను పరిగణనలోకి తీసుకొని తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఐఐటీ మద్రాస్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
పరీక్ష విధానం :
- హెచ్‌ఎస్‌ఈఈ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ). ఈ పరీక్ష రెండు పార్ట్‌లుగా ఉంటుంది. పార్ట్-1లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పార్ట్-2లో ఎస్సే రైటింగ్ నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు. ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది.
- పార్ట్-1 సిలబస్: పార్ట్-1 పరీక్ష సమయం 2.30 గంటలు. ఇందులో ఇంగ్లిష్ అండ్ కాంప్రహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ అండ్ క్వాంటిటేటివ్ ఎబిలిటి, జనరల్ స్టడీస్, ఎన్విరాన్‌మెంట్ అండ్ ఎకాలజీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. జనరల్ స్టడీలో ఇండియన్ ఎకానమీ, ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్, వరల్డ్ అఫైర్స్‌పై ప్రశ్నలుంటాయి.
- పార్ట్-2 ఎస్సేలో.. ప్రస్తుతం కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశముంది.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 2400; ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.1200. బ్యాంక్ చార్జీలకు అదనంగా రూ.40 చెల్లించాల్సి ఉంటుంది.
- ఆన్‌లైన్, నెట్ బ్యాకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ముగింపు తేదీ: జనవరి 22, 2020
అడ్మిట్ కార్డు: మార్చి 18, 2020
పరీక్ష తేదీ: ఏప్రిల్ 19, 2020
ఫలితాలు: మే 15, 2020
ఆఫర్ లెటర్: మే 16, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://hsee.iitm.ac.in/
Published date : 16 Dec 2019 06:43PM