అతి తక్కువ ఫీజుతో డిగ్రీ, పీజీ చదివే అవకాశం.. ఇగ్నో 2021 నోటిఫికేషన్ విడుదల..
ఈ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేషన్, డిప్లొమా, సర్టిఫికెట్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్టు గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పీహెచ్‌డీ స్థాయిలో మొత్తం 277 కోర్సులను దూరవిద్య విధానంలో అందిస్తోంది. ఈ ఓపెన్ యూనివర్సిటీ అందించే కోర్సులకు దేశ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఇగ్నో అందించే కోర్సులు ఇవే..
ఈ కోర్సులకు డిమాండ్..
మాస్టర్స్ కోర్సుల్లో ఎంఏ-ఫిలాసఫీ/ ఎకనామిక్స్/ ఇంగ్లిష్/ హిందీ/ పొలిటికల్ సైన్స్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ సోషియాలజీ/ టూరిజం మేనేజ్‌మెంట్/ ఎంబీఏ/ ఎంసీఏ/ ఎంకామ్/ ఎంకామ్-బిజినెస్ పాలసీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్/ ఫైనాన్స్ అండ్ ట్యాక్సేషన్/ ఎంఎల్‌ఐఎస్/ ఎంఎస్‌డబ్ల్యు/ ఎంఎస్సీ-కంప్యూటర్ సైన్స్ వంటి కోర్సుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. వీటితో పాటు ఎమ్మెస్సీ డెటైటిక్స్ అండ్ ఫుడ్ సర్వీస్ మేనేజ్‌మెంట్/ ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్/ ఎమ్మెస్సీ కౌన్సెలింగ్ అండ్ ఫ్యామిలీ థెరఫీ/ మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్/ ఎంఏ సోషల్‌వర్క్/ ఎంఏ సోషల్‌వర్క్ కౌన్సెలింగ్/ ఎంఏ ఎడ్యుకేషన్/ ఎంఏ సైకాలజీ/ ఎంఏ డెవలప్‌మెంట్ స్టడీస్ వంటి కోర్సులకు డిమాండ్ ఉంది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు కనీస అర్హత డిగ్రీ. సైన్స్ కోర్సుల్లో ప్రవేశాలకు బీఎస్సీ డిగ్రీ ఉండాలి.
యూజీ కోర్సులు..
ఇగ్నో జనరల్ బీఏ/ బీకామ్/ బీఎస్సీ డిగ్రీలతో పాటు బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ (బీఎస్‌ఐఎస్), బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ (బీఎస్‌డబ్ల్యు), బీఏ టూరిజం స్టడీస్, బీఎస్సీ నర్సింగ్, బీఈడీ, బీసీఏ, బీబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తోంది. వీటితో పాటు పలు విభాగాల్లో హానర్స్ డిగ్రీ కోర్సులను సైతం అందిస్తోంది. ఆయా కోర్సుల్లో మొదటి సంవత్సరం పూర్తి చేస్తే డిప్లొమా; రెండో ఏడాది కోర్సు పూర్తిచేస్తే అడ్వాన్స్‌డ్ డిప్లొమా; మూడో ఏడాది పూర్తి చేస్తే డిగ్రీ పట్టా అందిస్తారు. ఆయా కోర్సులకు ఇంటర్మీడియెట్/ 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి.
అందుబాటులో ఫీజులు..
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అందిస్తున్న కోర్సులకు ఫీజులు అందుబాటులోనే ఉంటాయి. యూజీ కోర్సులకు రూ.6 వేల నుంచి గరిష్టంగా రూ.14వేల వరకు ఫీజు ఉంది. నర్సింగ్ కోర్సుకు రూ.40 వేలు, బీఈడీ రూ.50 వేలతో పూర్తి చేయవచ్చు. పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు సైతం రెగ్యులర్ ఫీజులతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. చాలా వరకు పీజీ కోర్సుల ఫీజు రూ.10,800 నుంచి రూ.16 వేల వరకూ ఉన్నాయి. సోషల్ వర్క్, ఎంసీఎస్సీ ఫీజులు మాత్రం రూ.32వేల వరకు ఉంటాయి.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://ignou.ac.in
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్: https://ignouadmission.samarth.edu.in
ఇంకా చదవండి: part 1: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు ఇగ్నో-2021 ఫిబ్రవరి నోటిఫికేషన్ విడుదల.. విభిన్న కోర్సుల గురించి తెలుసుకోండిలా..