అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు.. సమాచారం ఇదిగో..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)... సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్(అసిస్టెంట్ కమాం డెంట్)ఎగ్జామినేషన్–2020 నోటిఫికేషన్‌ను వెలువరించింది. ఇందులో ఉత్తీర్ణులైన వారికి కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ హోదాతో కొలు వులు లభిస్తాయి.
ఈ నేపథ్యంలో.. అభ్యర్థులకు ఉప యోగపడేలా సీఏపీఎఫ్ నోటిఫికేషన్ సమాచారం, ఎంపిక ప్రక్రియ, పరీక్ష తీరుతెన్నులు, సిలబస్ విశ్లేషణ...
- పోస్టు పేరు: అసిస్టెంట్ కమాండెంట్
- మొత్తం పోస్టుల సంఖ్య : 209
- పోస్టుల వివరాలు: బీఎస్‌ఎఫ్: 78, సీఆర్‌పీఎఫ్: 13, సీఐఎస్‌ఎఫ్: 69, ఐటీబీపీ: 27; ఎస్‌ఎస్‌బీ: 22.
- అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత. ఎ¯Œన్‌సీసీ బి, సి సర్టిఫికెట్లు ఉన్న అభ్యర్థులకు ఇంటర్వూ/పర్సనాలిటీ టెస్టుల్లో ప్రాధాన్యత ఉంటుంది.
- వయసు: ఆగస్టు 1, 2020 నాటికి 20–25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం..
- రాత పరీక్షతోపాటు ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, ఇంటర్వూ/పర్సనాలిటీ టెస్టులు నిర్వహిస్తారు.
రాత పరీక్ష..
- ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్ 1 మల్టిపుల్ ఛాయిస్, పేపర్ 2 డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. పేపర్ 1 జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్‌పై 250 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్‌పై 200 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1 పరీక్ష వ్యవధి రెండు గంటలు.. కాగా, పేపర్ 2 పరీక్ష వ్యవధి మూడు గంటలు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని ఫిజికల్, మెడికల్ టెస్టులకు ఎంపిక చేస్తారు.
ఇంటర్వూ..
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులో ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ టెస్టులు నిర్వహించి ఇంటర్వూకి ఎంపిక చేస్తారు. ఇంటర్వూ 150 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వూల్లో పొందిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
సిలబస్ ఇలా..
- పేపర్ 1: జనరల్ ఎబిలిటీ, ఇంటెలిజె¯Œన్స్. ఇందులో..
- జనరల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
- న్యూమరికల్ ఎబిలిటీ
- డేటా ఇంటర్‌ప్రిటేషన్, జనరల్ సై¯Œన్స్
- జనరల్ అవేర్‌నెస్
- శాస్త్రీయ కోణం
- దైనందిన అంశాలపై అవగాహన
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
- బయోటెక్నాలజీ
- ఎన్విరామ్‌మెంటల్ సై¯Œన్స్, సంస్కృతి, సంగీతం, కళలు, సాహిత్యం, క్రీడలు, పరిపాలన
- సామాజిక, అభివృద్ధి అంశాలు
- ఇండియా, వరల్డ్ జాగ్రఫీ
- ఇండియన్ పాలిటీ, ఎకానమీ, హిస్టరీ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.
పేపర్ 2: జనరల్ స్టడీస్, ఎస్సే అండ్ కాంప్రహెన్షన్: ఈ పేపర్‌లో పార్ట్ ఏ, ప్టార్ బీ ఉంటాయి.
- పార్ట్ ఏ: 80 మార్కులకు ఉంటుంది. ఇందులో భారతదేశ చరిత్రలోని స్వాతంత్య్ర సంగ్రామం, జాగ్రఫీ, పాలిటీ అండ్ ఎకానమీ, భద్రత, మానవహక్కుల సమస్యలపై అవగాహన, అనలిటికల్ ఎబిలిటీపై ప్రశ్నలు వస్తాయి.
- పార్ట్ బీ: 120 మార్కులకు ఉంటుంది. ఇందులో కాంప్రహెన్షన్, ప్రిసైస్ రైటింగ్, కమ్యూనికేషన్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్‌పై ప్రశ్నలు వస్తాయి. దీనికోసం అభ్యర్థులు కాంప్రహె న్షన్ ప్యాసేజెస్, ప్రిసైజ్ రైటింగ్, డెవలపింగ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, సింపుల్ గ్రామర్ తదితరాలను ప్రిపేరవ్వాల్సి ఉంటుంది.
ప్రిపరేషన్..
- హిస్టరీ,పాలిటీ,ఎకానమీ, జాగ్రఫీకి తదితర అంశా లకు సంబంధించి ఆరో తరగతి నుంచి 12 వ తరగతి ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అనుసరించొచ్చు.
- వ్యాసరూప ప్రశ్నల కోసం అభ్యర్థులు రైటింగ్ ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. వీటికి సంబంధించి ఎక్కువగా సమకాలీన పరిణామాల నుంచే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు వీటిల్లో రాణించేందుకు దినపత్రికల్లో వ్యాసాలు, రాజ్యసభ టీవీ వంటి వాటిల్లో జరిగే చర్చా కార్యాక్రమాలను అనుసరించాలి.
ముఖ్యసమాచారం..
- దరఖాస్తు : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబరు 7, 2020
- దరఖాస్తు ఫీజు: రూ.200, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
- పరీక్ష తేదీ: డిసెంబరు 20, 2020.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 05 Sep 2020 12:47PM