Skip to main content

ఐకార్ నెట్ (2)-2018

అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (ఏఎస్‌ఆర్‌బీ).. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐకార్)-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్ 2)కు నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలో ప్రతిభ చూపడం ద్వారా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, ఇతర అగ్రికల్చరల్ వర్సిటీల్లో లెక్చరర్/అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హత లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఐకార్ నెట్ (2) నోటిఫికేషన్ వివరాలు...
అర్హత: 2018, డిసెంబర్ 31 నాటికి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన అర్హత.
వయసు: 2018, జూలై 1 నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం :
ఐకార్ నెట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రంలో అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉండే ప్రశ్నపత్రంలో ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు.

కనీస అర్హత మార్కులు :
ఐకార్ నెట్ (2)-2018లో కేటగిరీల వారీగా సాధించాల్సిన మార్కుల వివరాలు..

కేటగిరీ

మార్కులు

జనరల్

75 (50 శాతం)

ఓబీసీ నాన్ క్రీమిలేయర్

67.5 (45 శాతం)

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు

60 (40 శాతం)


స్పెషలైజేషన్లు..
ఐకార్ నెట్‌ను మొత్తం 57 స్పెషలైజేషన్లలో నిర్వహిస్తున్నారు. వాటి వివరాలు... అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనిటిక్ రిసోర్సెస్, జెనిటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్, ఫ్రూట్ సైన్స్; స్పైసెస్, ప్లాంటేషన్ అండ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్; వెజిటేబుల్ సైన్స్, యానిమల్ బయోకెమిస్ట్రీ, యానిమల్ బయోటెక్నాలజీ, యానిమల్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, యానిమల్ న్యూట్రిషన్, యానిమల్ ఫిజియాలజీ, యానిమల్ రీప్రొడక్షన్ అండ్ గైనకాలజీ, డెయిరీ కెమిస్ట్రీ, డెయిరీ మైక్రోబయాలజీ, డెయిరీ టెక్నాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్ట్ టెక్నాలజీ, లైవ్‌స్టాక్ ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ మెడిసిన్, వెటర్నరీ మైక్రోబయాలజీ, వెటర్నరీ పారసిటాలజీ, వెటర్నరీ పాథాలజీ, వెటర్నరీ ఫార్మకాలజీ, వెటర్నరీ పబ్లిక్ హెల్త్, వెటర్నరీ సర్జరీ, ఆక్వాకల్చర్, ఫిషరీస్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, ఫిష్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, ఫిష్ న్యూట్రిషన్, ఫిష్ హెల్త్, ఫిష్ జెనిటిక్స్ అండ్ బ్రీడింగ్, అగ్రికల్చరల్ కెమికల్స్, అగ్రికల్చరల్ మెటియోరాలజీ, ఆగ్రోఫారెస్ట్రీ, ఆగ్రోనమీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, సాయిల్ సెన్సైస్, అగ్రికల్చరల్ బిజినెస్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, హోమ్ సైన్స్, ఫామ్ మెషినరీ అండ్ పవర్, కంప్యూటర్ అప్లికేషన్ అండ్ ఐటీ, ల్యాండ్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇంజనీరింగ్, బయోఇన్ఫర్మాటిక్స్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చరల్ స్ట్రక్చర్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్, వెటర్నరీ అనాటమీ!!

ముఖ్య సమాచారం :
ఐకార్ నెట్-2 నిర్వహణ:
డిసెంబర్ 27-31, 2018.
దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 29, 2018.
ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ: నవంబర్ 29, 2018.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఫీజు: దరఖాస్తు రుసుం జనరల్ అభ్యర్థులకు రూ.1000. ఓబీసీలకు రూ.500; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలకు రూ.250. ఫీజును డెబిట్, క్రెడిట్ కార్డులు, నెఫ్ట్ ద్వారా చెల్లించొచ్చు.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.asrb.org.in
Published date : 14 Nov 2018 06:15PM

Photo Stories