Skip to main content

ఐఎస్‌ఐ-2019

నేటి ఇన్ఫర్మేషన్, ఈ-కామర్స్ యుగంలో డేటా అమూల్యంగా మారుతోంది.
టెరాబైట్ల కొద్దీ డేటాను సేకరించడంతోపాటు సదరు డేటాను తులనాత్మకంగా విశ్లేషించే సామర్థ్యం స్టాటిస్టికల్ సైన్స్ ద్వారా లభిస్తుంది. స్టాటిస్టిక్స్‌కు సంబంధించిన కోర్సులను అందించడంలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)కు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఐఎస్‌ఐలో వివిధ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు.. ఉజ్వల కెరీర్ సొంతం చేసుకుంటున్నారు. తాజాగా, ఐఎస్‌ఐ-2019 ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఐఎస్‌ఐ అందిస్తున్న కోర్సులు, అర్హతలు తదితరాల గురించి తెలుసుకుందాం...

ఐఎస్‌ఐ కోర్సులు-ప్రయోజనాలు..
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ) ప్రఖ్యాత ఆర్థికవేత్త పి.సి.మహాలనొబిస్ ఆధ్వర్యంలో 1935లో కోల్‌కతా కేంద్రంగా ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగు క్యాంపస్‌లు, హైదరాబాద్ సహా పలు కేంద్రాలను కలిగి ఉంది. జాతీయ ప్రాముఖ్య విద్యాసంస్థగా కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొంది.. స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ సైన్స్, క్వాంటిటేటివ్ ఎకనామిక్స్ సంబంధిత డిగ్రీ, పీజీ, డిప్లొమా స్థాయి కోర్సులను అందిస్తోంది. ప్రతి ఏటా రాత పరీక్ష ద్వారా ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఐఎస్‌ఐలో కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ప్రముఖ ఐటీ కంపెనీలు, బ్యాంకులు, బీమా సంస్థలు, తయారీ కంపెనీలు, పరిశోధన సంస్థల్లో అవకాశాలు పుష్కలం. దాదాపు 30 శాతం మంది ఐఎస్‌ఐ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తున్నారు. దేశంలోనూ స్టాటిస్టిక్స్ నిపుణులకు మంచి డిమాండ్ నెలకొంది. వివిధ సబ్జెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్‌ఎఫ్) పొందే అవకాశం కూడా ఐఎస్‌ఐ కల్పిస్తోంది.

కోర్సులు.. అర్హతలు :
1. బి.స్టాట్. (బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్)

వ్యవధి: మూడేళ్లు.
అర్హత: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కోల్‌కతా క్యాంపస్‌లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.3000 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది.
నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలిపింయాడ్(ఐఎన్‌ఎమ్‌ఓ) విజేతలకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సదరు అభ్యర్థులను డెరైక్ట్‌గా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

2. బి.మ్యాథ్ (బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్)
వ్యవధి: మూడేళ్లు.
అర్హత: మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. కోల్‌కతా క్యాంపస్‌లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.3000 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది.
నేషనల్ బోర్డ్ ఆఫ్ హయ్యర్ మ్యాథమెటిక్స్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా నిర్వహించే ఇండియన్ నేషనల్ ఒలిపింయాడ్(ఐఎన్‌ఎమ్‌ఓ) విజేతలకు రాత పరీక్ష నుంచి మినహాయింపు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న సదరు అభ్యర్థులను డెరైక్ట్‌గా ఇంటర్వ్యూకి ఆహ్వానిస్తారు.

3. మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్(ఎం.స్టాట్.)
వ్యవధి: 2 ఏళ్లు.
అర్హత: మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బీఈ/బీటెక్ డిగ్రీ లేదా ఐఎస్‌ఐ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ లేదా పీజీ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ కోర్సును ఢిల్లీ, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.

4. మాస్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (ఎం. మ్యాథ్.)
వ్యవధి: రెండేళ్లు.
అర్హత: బీఎస్సీ మ్యాథ్స్ లేదా ఐఎస్‌ఐ నుంచి బీఎస్సీ స్టాటిస్టిక్స్ లేదా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్‌గా లభిస్తుంది. కోల్‌కతా క్యాంపస్‌లో ఆఫర్‌చేస్తున్నారు.

5. ఎంఎస్ ఇన్ క్వాంటిటేటివ్ ఎకనామిక్స్
వ్యవధి: రెండేళ్లు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ఇంటర్‌లో తప్పనిసరిగా మ్యాథ్స్‌ను చదివుండాలి. ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5000 స్టైపెండ్‌గా అందుతుంది. కోల్‌కతా, ఢిల్లీ క్యాంపస్‌ల్లో ఈ కోర్సును అందిస్తున్నారు.

6. ఎంఎస్ ఇన్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సైన్స్
వ్యవధి: రెండేళ్లు.
అర్హత: మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా మూడేళ్ల బ్యాచిలర్ డిగ్రీ లేదా ఏదైనా స్పెషలైజేషన్‌తో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5000 స్టైపెండ్ అందుతుంది. బెంగళూరు, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో ఈ కోర్సును అందిస్తున్నారు.

7. ఎంఎస్ ఇన్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ. ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.5000 స్టైపెండ్‌గా లభిస్తుంది. బెంగళూరు క్యాంపస్‌లో ఆఫర్‌చేస్తున్నారు.

8. ఎంటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్
వ్యవధి: రెండేళ్లు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/ఎలక్ట్రానిక్ సైన్స్/కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్/ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ లేదా బీఈ/బీటెక్ లేదా తత్సమాన అర్హత (ఏఎంఐఈ లేదా డీఓఈఏసీసీ ‘బి’ లెవల్ తదితరం). ప్రవేశం పొందిన వారికి నెలకు రూ. 8000 స్టైపెండ్‌గా లభిస్తుంది. కోల్‌కతా క్యాంపస్‌లో కోర్సును అందిస్తున్నారు. గేట్ స్కోర్ ఉండి.. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను డెరైక్ట్‌గా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ విషయంలో సెలక్షన్ కమిటీదే తుది నిర్ణయం.

ఇతర కోర్సులు..
కోర్సు: ఎంటెక్ క్రిప్టోలజీ అండ్ సెక్యూరిటీ.
వ్యవధి: రెండేళ్లు.

కోర్సు: ఎంటెక్ ఇన్ క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ ఆపరేషన్స్ రీసెర్చ్.
వ్యవధి: రెండేళ్లు.

కోర్సు:
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ అనలిటిక్స్.
వ్యవధి: ఒక సంవత్సరం.

కోర్సు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్.
వ్యవధి: ఒక సంవత్సరం.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్)కు అర్హతలు..
స్టాటిస్టిక్స్: ఐఎస్‌ఐ నుంచి మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ లేదా స్టాటిస్టిక్స్‌లో ఎంఏ/ఎంఎస్సీ లేదా తత్సమాన అర్హత. కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.
మ్యాథమెటిక్స్: ఐఎస్‌ఐ నుంచి మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/మాస్టర్ ఆఫ్ మ్యాథ్స్ లేదా ఎంఏ/ఎంఎస్సీ లేదా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా తత్సమాన అర్హత లేదా ఎంఈ/ఎంటెక్ లేదా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా తత్సమాన అర్హత. కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై క్యాంపస్‌లలో అందిస్తున్నారు.
క్వాంటిటేటివ్ ఎకనామిక్స్: ఏదైనా మాస్టర్ డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ లేదా గ్రాడ్యుయేషన్‌లో ఎకనామిక్స్/మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్‌ను చదివుండాలి. కోల్‌కతా,ఢిల్లీ క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.
కంప్యూటర్ సైన్స్: ఎంఈ/ఎంటెక్ లేదా ఎలక్ట్రానిక్స్/టెలీకమ్యూనికేషన్/రేడియో ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/మైక్రోవేవ్ కమ్యూనికేషన్/ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ /బయోఇన్‌ఫర్మాటిక్స్ సబ్జెక్టుల్లో తత్సమాన అర్హత, డిగ్రీ, పీజీలో మ్యాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి లేదా మాస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్/ఎంఎస్సీ/ఎంసీఏ/ఎంఏ లేదా మ్యాథ్స్‌ను డిగ్రీ/పీజీలో మ్యాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండి, ఫిజిక్స్/మ్యాథ్స్/అప్లయిడ్ మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/ఎలక్ట్రానిక్ సెన్సైస్/అట్మాస్పియరిక్ సెన్సైస్/ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ/బయోఇన్‌ఫర్మాటిక్స్/బయోటెక్నాలజీ సబ్జెక్టుల్లో తత్సమాన అర్హత ఉండాలి. కోల్‌కతా, బెంగళూరు, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.

క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ రీసెర్చ్: క్వాలిటీ/రిలయబిలిటీ/ఆపరేషన్ రీసెర్చ్‌ల్లో ఎంటెక్/ఎంఈ/ఎంఎస్/ఎంఫిల్ లేదా డిగ్రీ లేదా మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్/ఫిజిక్స్‌ల్లో తత్సమాన అర్హతతోపాటు పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌లో మ్యాథ్స్‌ను ఒక సబ్జెక్టుగా చదివుండాలి. కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై క్యాంపస్‌ల్లో అందిస్తున్నారు.
బయలాజికల్ సైన్స్: ఎంఎస్సీ ఇన్ బయాలజీ/బయోఫిజిక్స్/మాలిక్యులర్ బయాలజీ/జెనిటిక్స్/జువాలజీ/న్యూరోసెన్సైస్/బయోటెక్నాలజీ. కోల్‌కతా క్యాంపస్‌లో అందిస్తున్నారు.
లైబ్రరీ ఇన్‌ఫర్మేషన్ సైన్స్: ఐఎస్‌ఐ నుంచి ఎంఎస్(లైబ్రరీ సైన్స్) లేదా ఐఎస్‌ఐ/ఎన్‌ఐఎస్‌సీఏఐఆర్/ఐఎన్‌ఎస్‌డీఓసీ నుంచి అసోసియేట్‌షిప్ ఇన్ డాక్యుమెంటేషన్ అండ్ ఇన్‌పర్మేషన్ సైన్స్ లేదా ఎంఎస్ లైబ్రరీ సైన్స్‌కు తత్సమాన అర్హత. బెంగళూరు క్యాంపస్‌లో అందిస్తున్నారు.
ఎంఈ/ఎంటెక్ తత్సమాన కోర్సుల వారికి నెలకు రూ.28,000; ఇతర కోర్సుల వారికి నెలకు రూ.25,000 చొప్పున ఫెలోషిప్ లభిస్తుంది.

ముఖ్య తేదీలు..
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ:
మార్చి 12
ఐఎస్‌ఐ అడ్మిషన్ టెస్ట్: మే 12, 2019.
తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.isical.ac.in
Published date : 13 Feb 2019 01:54PM

Photo Stories