Skip to main content

ఐఐటీల్లో ప్రారంభించిన కొత్త కోర్సుల్లో ప్రవేశం పొదండిలా..!

ఐఐటీలు అందించనున్న బీటెక్‌ స్థాయి కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్, బీఎస్‌+ఎంఎస్‌ కోర్సుల్లో జేఈఈ–అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంటెక్‌ ప్రోగ్రామ్‌లకు గేట్‌ స్కోర్‌ ప్రామాణికం.

ఆన్‌లైన్‌ కోర్సులకు సంబంధించి అధిక శాతం ఇన్‌స్టిట్యూట్‌లు వర్కింగ్‌ ఎగ్జిక్యూటివ్స్‌నే అర్హులుగా పేర్కొంటున్నాయి. 

 

ఐఐఎంలు సైతం..

దేశంలోని ప్రతిష్టాత్మక బీస్కూల్స్‌.. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌(ఐఐఎం)లు సైతం ఆధునిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు ఇండస్ట్రీ నైపుణ్యాలను అందించేలా కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నాయి. 

  • ఇండస్ట్రీ వర్గాలు, అంతర్జాతీయ ఇన్‌స్టిట్యూట్స్‌తో ఒప్పందాల ద్వారా విభిన్న ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి. 
  • ఐఐఎంలలో అందుబాటులోకి వచ్చిన కొత్త కోర్సులు... 
  • ఐఐఎం–బెంగళూరులో.. ఎగ్జిక్యూటివ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో రిజిగ్నేషన్‌ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌. 
  • ఐఐఎం–కోల్‌కతలో.. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ అనలిటిక్స్, ఎగ్జిక్యూటివ్‌ లీడర్‌షిప్‌ ప్రోగ్రామ్‌.
  • ఐఐఎం–లక్నోలో.. ఇంటర్నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఫర్‌ ఎగ్జిక్యూటివ్స్‌. 
  • ఐఐఎం–కాశీపూర్‌లో.. ఎగ్జిక్యూటివ్‌ ఫెలో ప్రోగ్రామ్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌. 
  • ఐఐఎం–రోహ్‌తక్‌లో.. ఇంటరాక్టివ్‌ ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ విధానంలో ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌ ఇన్‌ పీజీడీఎం(ఈపీజీడీఎం). 
  • ఐఐఎం–అమృత్‌సర్‌లో.. నాన్‌–రెసిడెన్షియల్‌ విధానంలో రెండేళ్ల ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌.
  • దాదాపు అన్ని ఐఐఎంలు.. ఆన్‌లైన్‌ విధానంలో బిజినెస్‌ డేటా,డేటా అనాలిసిస్‌ విభాగాల్లో షార్ట్‌ టర్మ్‌ సర్టిఫికేషన్‌ కోర్సులు అందిస్తున్నాయి.
  • ఐఐఎంల్లో రెగ్యులర్‌ ఎంబీఏ ప్రోగ్రామ్‌లను బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతతో నిర్వహించే క్యాట్‌ ఉత్తీర్ణత ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌లకు సంబంధించి పని అనుభవం ఉన్న వారినే అర్హులుగా పేర్కొంటున్నారు. ఎగ్జిక్యూటివ్‌ కోర్సుల అభ్యర్థులు సైతం క్యాట్‌లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

ఇంకా చదవండి : part 3: ఐఐటీల్లో పెరగనున్న సీట్లు.. నైపుణ్యాలు పెంచడమే లక్ష్యంగా..

Published date : 24 Jun 2021 01:42PM

Photo Stories