విద్యుత్ - 1
Sakshi Education
- స్థిర విద్యుత్‌ను ఎవరు కనుగొన్నారు?
థేల్స్ ఆఫ్ మిలిటస్ - విద్యుత్‌ను కనుగొన్నవారు?
విలియం బర్డ్స్ - విద్యుత్‌కు ధన, రుణ అవేశాలు ఉంటాయని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
బెంజిమన్ ఫ్రాంక్లిన్ (అమెరికా) - చనిపోయిన కప్ప కాళ్లకు రెండు లోహపు పలకలను తాకించినప్పుడు అది ఎగిరిపోవడంతో జంతు దేహంలోనూ విద్యుత్ ఉంటుందని భావించిన శాస్త్రవేత్త ఎవరు?
లూయీ గాల్వనీ (ఇటలీ) - విద్యుత్.. అయస్కాంతంగా పనిచేస్తుందని కనుగొన్నవారెవరు?
హన్స్ అయిర్‌స్టడ్ (డేనిష్) - విద్యుత్ మోటారు, జనరేటర్లను కనుగొన్న శాస్త్రవేత్త?
మైకేల్ ఫారడే - ప్రయోగాత్మకంగా మొదటి విద్యుత్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
ఇంగ్లండ్‌లోని గోడల్మింగ్ - అమెరికాలోని మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఎవరు స్థాపించారు?
థామస్ అల్వా ఎడిసన్ - విద్యుత్ బల్బును కనుగొన్న శాస్త్రవేత్త?
థామస్ అల్వా ఎడిసన్
(ఎడిసన్ సుమారు 1,000కి పైగా నూతన ఆవిష్కరణలు చేశారు) - టార్చలైట్ ఘటం ఏ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చుతుంది?
రసాయనశక్తి - ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్త రూపంలో తెలపడానికి ఉపయోగపడేవి?
సంకేతాలు - ఘటాలను ఏ సంధానం చేయడం ద్వారా బ్యాటరీ తయారవుతుంది?
శ్రేణి సంధానం - విద్యుత్ అలంకరణ దీపాలను ఏ విధంగా సంధానం చేస్తారు?
శ్రేణి సంధానం - ఇంటిలోని వివిధ విద్యుత్ పరికరాలను ఏ విధంగా సంధానం చేస్తారు?
సమాంతర సంధానం
నోట్ 1: శ్రేణి సంధానంలో వివిధ విద్యుత్ పరికరాలను(బల్బులను) కలిపినప్పుడు అందులో ఏదైనా ఒక పరికరం పనిచేయకపోతే మిగిలినవి కూడా పనిచేయవు.
నోట్ 2: సమాంతర సంధానంలో వివిధ విద్యుత్ పరికరాలను(బల్బ్‌లను) కలిపినప్పుడు అందులో ఏదైనా ఒక పరికరం పనిచేయకపోయినప్పటికీ మిగిలినవి పనిచేస్తాయి. - ఎలక్ట్రిక్ కుక్కర్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఇస్త్రీ పెట్టెలలో ఫిలమెంట్‌గా ఉపయోగించే పదార్థం ఏది?
నిక్రోమ్ - ఫిలమెంట్ విడుదల చేసే ఉష్ణం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
1) పదార్థ స్వభావం
2) తీగ పొడవు
3) మందం - వలయంలో ఎక్కువ పరిమాణంలో విద్యుత్ ప్రయాణించినప్పుడు వస్తువులు కాలిపోకుండా ఉండేందుకు రక్షణగా ఉపయోగపడే పదార్థం ఏది?
ఫ్యూజ్ - ఫ్యూజ్‌కు బదులుగా విస్తృతంగా దేన్ని ఉపయోగిస్తున్నారు?
మినియేచర్ సర్య్కూట్ బ్రేకర్
(MCB అనేది రక్షిత పరిధిని దాటి విద్యుత్ ప్రవహించినప్పుడు తనంతట తానుగా స్విచ్ ఆఫ్ అవుతుంది) - ఘట సంకేతంలో పొడవు గీత ఏ ధ్రువాన్ని సూచిస్తుంది?
ధన ధ్రువాన్ని - ఘట సంకేతంలో చిన్నగీత ఏ ధ్రువాన్ని సూచిస్తుంది?
రుణ ధ్రువాన్ని - LEDని విస్తరించండి?
Light-Emitting Diode
(LEDని మొబైల్ ఫోన్, టి.వి. ట్రాన్స్ ఫార్మర్ లాంటి పరికరాలు పనిచేస్తున్నాయా? లేదా తెలుసుకోవడానికి సూచిక (లేదా) టెస్టర్‌గా వాడుతారు) - స్వేదన జలం (స్వచ్ఛమైన నీరు) విద్యుత్ పరంగా ఎటువంటి పదార్థం?
విద్యుత్ బంధకం - మొదటిసారిగా విద్యుత్ ఘటాన్ని ఎవరు తయారుచేశారు?
వోల్టా - ఇనుము వంటి లోహాలు తుప్పుపట్టకుండా ఉండేందుకు వాటిపై పూతపూసే లోహాలు ఏవి?
నికెల్ లేదా క్రోమియం - యంత్రాల భాగాలు తుప్పుపట్టకుండా ఉండటానికి, మెరవడానికి తరచుగా దేన్ని పూతపూస్తారు?
క్రోమియం - సాధారణంగా తినుబండారాలను నిల్వ ఉంచడానికి దేనితో పూతపూసిన ఇనుప డబ్బాలను వాడుతారు?
తగరం (Tin) - వెంట్రుకలు దుస్తులను ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు.. ఈ రెండూ ఒకే దృగ్విషయం అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు?
బెంజిమన్ ఫ్రాంక్లిన్ - వస్తువు ఆవేశం కలిగి ఉందో లేదో తెలుసుకోవాడానికి ఉపయోగించే పరికరం ఏది?
విద్యుద్దర్శిని - వస్తువుపై ఉన్న ఆవేశాలు భూమికి బదిలీ అయ్యే పద్ధతిని ఏమంటారు?
ఎర్త్ చేయడం - ఒక ఆవేశపూరిత మేఘానికి దగ్గరగా మరో మేఘం వచ్చినప్పుడు అది రెండో మేఘంపై ఏ ఆవేశాన్ని ప్రేరేపిస్తుంది?
వ్యతిరేక ఆవేశం - బ్యాటరీ నుంచి బల్బ్‌కు శక్తిని సరఫరా చేసే పదార్థాన్ని ఏమంటారు?
వాహకం - ధనాత్మక అయాన్ల అమరికను ఏమంటారు?
లాటిస్ - విద్యుత్ ప్రవాహం అనగానేమి?
ఆవేశాల క్రమవిచలనం - విద్యుత్ ప్రవాహానికి ప్రమాణం ఏమిటి?
ఆంపియర్ - విద్యుదావేశానికి ప్రమాణం ఏమిటి?
కూలుంబ్ - వాహకంలోని ఏకాంక ఘనపరిమాణంలో ఉన్న ఆవేశాల సంఖ్యను ఏమంటారు?
ఆవేశ సాంద్రత - వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని కొలవ డానికి సాధారణంగా దేన్ని ఉపయోగిస్తారు?
అమ్మీటర్ - అమ్మీటర్‌ను వలయంలో ఏ విధంగా సంధానం చేస్తారు?
శ్రేణి సంధానం - పొటెన్షియల్ భేదాన్ని ఏమని పిలుస్తారు?
వోల్టేజ్ - పొటెన్షియల్ భేదానికి ఎస్.ఐ. ప్రమాణం ఏమిటి?
వోల్ట్ - ద్రవాల్లో విద్యుత్ ప్రవాహం ఏ ఆవేశాల వల్ల జరుగుతుంది?
ధన, రుణ ఆవేశాల చలనం - లోహ ఘనపదార్థ రూప వాహకంలో విద్యుత్ ప్రవాహం వేటివల్ల జరుగుతుంది?
ఎలక్ట్రాన్ చలనం - ధనావేశపూరిత లోహ పలకను ఏమంటారు?
ఆనోడ్ - రుణావేశపూరిత లోహ పలకను ఏమంటారు?
కాథోడ్
Published date : 06 Feb 2016 05:09PM