గ్రహాలు
1. గీకు భాషలో ప్లానెట్ అనే పదం దేన్ని సూచిస్తుంది?
ఎ) విశ్వంలో ఒక వస్తువు
బి) ఎల్లప్పుడూ తిరుగుతున్న వస్తువు
సి) స్వయం ప్రకాశకత్వం
డి) ఉపగ్రహాలను కలిగింది
- View Answer
- సమాధానం: బి
2. సూర్యుడు ఏ రకమైన నక్షత్రం?
ఎ) పెద్ద పరిమాణం ఉన్న నక్షత్రం
బి) చిన్న పరిమాణం ఉన్న నక్షత్రం
సి) మరుగుజ్జు నక్షత్రం
డి) మధ్యతరహా పరిమాణం ఉన్న నక్షత్రం
- View Answer
- సమాధానం: డి
3. సూర్యుడి తర్వాత దగ్గరగా ఉన్న నక్షత్రం?
ఎ) ప్రాక్సిమా సెంటారీ
బి) సీరియస్
సి) QBI-352
డి) మెఘాలినిక్ మేఘం
- View Answer
- సమాధానం: ఎ
4. సౌరకుటుంబం కలిగిన మన పాలపుంతకు భారతీయులు పెట్టిన పేరు?
ఎ) శివగంగ
బి) పాతాళగంగ
సి) ఆకాశగంగ
డి) హిమగంగ
- View Answer
- సమాధానం: సి
5. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
ఎ) కోపర్నికస్
బి) టాలమీ
సి) భాస్కరాచార్యుడు
డి) న్యూటన్
- View Answer
- సమాధానం: ఎ
6. సౌరకుటుంబాన్ని మొదట పరిశీలించినవారు?
ఎ) న్యూటన్
బి) గెలీలియో
సి) ఐన్‌స్టీన్
డి) పౌల్సన్
- View Answer
- సమాధానం: బి
7. భూమిపై ఉన్న ప్రతి వస్తువుపైనా గురుత్వ బలం సమానంగా ఉంటుందని నిరూపించిన వారు?
ఎ) కోపర్నికస్
బి) జిల్లెట్
సి) గెలీలియో
డి) డాప్లర్
- View Answer
- సమాధానం: సి
8. బిగ్‌బ్యాంగ్ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
ఎ) జార్జియస్ లెమైట్రీ
బి) హబుల్
సి) గెలీలియో
డి) న్యూటన్
- View Answer
- సమాధానం: ఎ
9. ప్రస్తుతం సౌరకుటుంబంలో గుర్తించిన గ్రహాల సంఖ్య?
ఎ) 7
బి) 8
సి) 9
డి) 10
- View Answer
- సమాధానం: బి
10. భూమికి దగ్గరగా ఉన్న ఖగోళ వస్తువు?
ఎ) సూర్యుడు
బి) అంగారకుడు
సి) చంద్రుడు
డి) బుధుడు
- View Answer
- సమాధానం: సి
11. సూర్యుడి నుంచి గ్రహాలకు మధ్య దూరాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం?
ఎ) కాంతి సంవత్సరం
బి) ఖగోళ ప్రమాణం
సి) పార్-సెక్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
12. సూర్యుడి చుట్టూ గ్రహాలు ఏ మార్గంలో పరిభ్రమిస్తున్నాయి?
ఎ) సరళరేఖ
బి) వృత్తాకార
సి) దీర్ఘవృత్తాకార
డి) వక్రమార్గం
- View Answer
- సమాధానం: సి
13. సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహం?
ఎ) శుక్రుడు
బి) బుధుడు
సి) భూమి
డి) శని
- View Answer
- సమాధానం: బి
14. ధ్రువ నక్షత్రం పేరు?
ఎ) జొడాయిక్
బి) ఎప్సిలాన్ అరిగా
సి) పాలారిస్
డి) ఆండ్రోమెడ్
- View Answer
- సమాధానం: సి
15. హేలీ తోకచుక్క ఎన్నేళ్లకు ఒకసారి కనిపిస్తుంది?
ఎ) 66
బి) 76
సి) 86
డి) 100
- View Answer
- సమాధానం: బి
16. కిందివాటిలో ఏ గ్రహం పగలు ఎక్కువ వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది?
ఎ) శుక్రుడు
బి) అంగారకుడు
సి) బృహస్పతి
డి) బుధుడు
- View Answer
- సమాధానం: డి
17. సౌరకుటుంబంలో పరిమాణంలో భూమి ఏ స్థానంలో ఉంది?
ఎ) 1
బి) 2
సి) 4
డి) 5
- View Answer
- సమాధానం: డి
18. సౌరకుటుంబంలోని గ్రహాల చలనాలను పరిశీలించిన దేశస్థులు?
ఎ) భారతీయులు
బి) చైనీయులు
సి) గ్రీకులు
డి) జపనీయులు
- View Answer
- సమాధానం: సి
19.రెండు గ్రహాల మధ్య దూరం రెండింతలు అయినప్పుడు వాటి మధ్య విశ్వగురుత్వాకర్షణ బలం?
ఎ) రెండు రెట్లు తగ్గుతుంది
బి) రెండు రెట్లు పెరుగుతుంది
సి) నాలుగు రెట్లు పెరుగుతుంది
డి) నాలుగు రెట్లు తగ్గుతుంది
- View Answer
- సమాధానం: డి
20. ఒక ఇనుపగోళం, అల్యూమినియం గోళాలను ఒకే ఎత్తు నుంచి శూన్యంలో ఒకేసారి జారవిడిచినప్పుడు ఏది ముందుగా కిందికి చేరుతుంది?
ఎ) ఇనుపగోళం
బి) అల్యూమినియం గోళం
సి) రెండూ ఒకేసారి కిందికు చేరుతాయి
డి) రెండూ పైకి వెళ్తాయి
- View Answer
- సమాధానం: సి
21. ఒక వస్తువు భారం ఎక్కడ ఎక్కువగా ఉంటుంది?
ఎ) భూమి కేంద్రం వద్ద
బి) భూమధ్యరేఖ వద్ద
సి) ధ్రువాల వద్ద
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
22. ప్రదేశాన్ని బట్టి ఒక వస్తువుకు చెందిన ఏ భౌతికరాశి మారుతుంది?
ఎ) ద్రవ్యరాశి
బి) ఘనపరిమాణం
సి) ఆకారం
డి) భారం
- View Answer
- సమాధానం: డి
23. చంద్రుడిపై గురుత్వ త్వరణం విలువ?
ఎ) 9.8 ms–2
బి) 9.8cms–2
సి) 1.67 cms–2
డి) 1.67 ms–2
- View Answer
- సమాధానం: డి
24. భూమిపై పలాయన వేగం?
ఎ) 11.2 kms–1
బి) 11.2 ms–1
సి) 11.2 cms–1
డి) 1.12 ms–1
- View Answer
- సమాధానం: ఎ
25. విశ్వగురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించినవారు?
ఎ) న్యూటన్
బి) గెలీలియో
సి) అరిస్టాటిల్
డి) కోపర్నికస్
- View Answer
- సమాధానం: ఎ
26. భూస్థిర ఉపగ్రహం ఆవర్తన కాలం?
ఎ) 24 సెకన్లు
బి) 24 నిమిషాలు
సి) 24 గంటలు
డి) 24 రోజులు
- View Answer
- సమాధానం: సి
27. ఇప్పటివరకు కనుగొన్న ఉపగ్రహాల్లో అతి పెద్దది?
ఎ) చంద్రుడు
బి) గనిమెడ
సి) యూరోపా
డి) ఫోబోస్
- View Answer
- సమాధానం: బి
28.భూమిని పోలిన ఉపగ్రహం?
ఎ) చంద్రుడు
బి) ఫోబోస్
సి) టైటాన్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: సి
29. శాస్త్రవేత్తలు ఇటీవల భూమిని పోలిన గ్రహాన్ని కనుగొన్నారు. దానిపేరు?
ఎ) సూపర్ నోవా
బి) సూపర్ ఎర్త్
సి) సుప్రీం ఎర్త్
డి) న్యూ ఎర్త్ గ్లోబ్
- View Answer
- సమాధానం: బి
30. ఫ్లూటో ఉపగ్రహం చరాన్ గురించి పరిశోధించడానికి ప్రయోగించిన అంతరిక్ష నౌక పేరు?
ఎ) న్యూహారిజాన్
బి) కేసిని
సి) హ్యూగన్స్
డి) స్వీట్జర్
- View Answer
- సమాధానం: ఎ
31. మరుగుజ్జు గ్రహం హోదా పొందిన గ్రహం?
ఎ) బుధుడు
బి) అంగారకుడు
సి) భూమి
డి) ఫ్లూటో
- View Answer
- సమాధానం: డి
32. భూమిపై సముద్రంలో ఆటుపోటులు ఏర్పడటానికి కారణం?
ఎ) భూమి, సూర్యుడికి మధ్య ఉన్న విశ్వగురుత్వార్షణ బలం
బి) భూమి, చంద్రుడికి మధ్య ఉన్న విశ్వగురుత్వాకర్షణ బలాలు
సి) సూర్యుడు, చంద్రుడికి మధ్య ఉన్న విశ్వగురుత్వాకర్షణ బలాలు
డి) భూమి, అంగారకుడి మధ్య ఉన్న విశ్వగురుత్వాకర్షణ బలాలు
- View Answer
- సమాధానం: సి
33. విశ్వం గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారు?
ఎ) కాస్మాలజీ
బి) ఆస్ట్రానమీ
సి) స్పేస్
డి) జియాలజీ
- View Answer
- సమాధానం: ఎ
34. భూమికి ఇతర వస్తువులను ఆకర్షించే గురుత్వాకర్షణ బలం ఉందని వివరించిన తొలి భారతీయ శాస్త్రవేత్త?
ఎ) ఆర్యభట్ట
బి) భాస్కరాచార్యుడు
సి) బ్రహ్మగుప్తుడు
డి) వరాహమిహిరుడు
- View Answer
- సమాధానం: సి
35. సూర్యుడిలో పొరలు ఏవి?
ఎ) ఫొటోస్ఫియర్
బి) క్రోమోస్ఫియర్
సి) కరోనా
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
36. ఏ గ్రహాన్ని ఉదయతార, సాయంత్రం తారగా పిలుస్తారు?
ఎ) అంగారకుడు
బి) శుక్రుడు
సి) శని
డి) యురేనస్
- View Answer
- సమాధానం: బి
37. అరుణ గ్రహం అని దేన్ని పిలుస్తారు?
ఎ) శని
బి) భూమి
సి) అంగారకుడు
డి) బృహస్పతి
- View Answer
- సమాధానం: సి
38. భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న కృత్రిమ ఉపగ్రహం స్థానాన్ని కింది కక్ష్య నుంచి పై కక్ష్యవరకు పెంచినప్పుడు దాని కక్ష్యావేగం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) రెండు రెట్లు పెరుగుతుంది
- View Answer
- సమాధానం: బి
39. బృహస్పతి ఉపగ్రహం పేరు?
ఎ) గనిమెడ
బి) యూరోపా
సి) కెలిస్టో
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
40. సౌరకుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం?
ఎ) భూమి
బి) శని
సి) బృహస్పతి
డి) బుధుడు
- View Answer
- సమాధానం: ఎ
41. సంవత్సర కాలవ్యవధి తక్కువగా ఉన్న గ్రహం?
ఎ) భూమి
బి) బుధుడు
సి) యురేనస్
డి) శని
- View Answer
- సమాధానం: బి
42. భూస్థిర ఉపగ్రహాలను భూమి కేంద్రం నుంచి ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెడతారు?
ఎ) 3,600 కి.మీ.
బి) 36,000 కి.మీ.
సి) 42,400 కి.మీ.
డి) 56,500 కి.మీ.
- View Answer
- సమాధానం: సి
43. మన పాలపుంత వ్యాసం సుమారు ఎన్ని కాంతి సంవత్సరాలు?
ఎ) 102
బి) 103
సి) 104
డి) 105
- View Answer
- సమాధానం: డి
44. కాస్మిక్ సంవత్సరం దేని ప్రమాణం?
ఎ) దూరం
బి) కాలం
సి) ద్రవ్యరాశి
డి) పరిమాణం
- View Answer
- సమాధానం: బి
45. భూ కేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
ఎ) టాలమీ
బి) కోపర్నికస్
సి) గెలీలియో
డి) న్యూటన్
- View Answer
- సమాధానం: ఎ
46. గ్రహం ఏ భౌతికరాశిపై పలాయనవేగం ఆధారపడి ఉంటుంది?
ఎ) ద్రవ్యరాశి
బి) వ్యాసార్ధం
సి) గురుత్వ త్వరణ విలువ
డి) ఆకారం
- View Answer
- సమాధానం: డి
47. చంద్రుడిపై పలాయన వేగం?
ఎ) 2.42 ms–1
బి) 2.42 kms–1
సి) 2.42 cms–1
డి) 11.2 kms–1
- View Answer
- సమాధానం: బి
48. సౌరకుటుంబంలో సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తున్న గ్రహాలకు కావలసిన అభికేంద్రక బలాన్ని అందించేవి?
ఎ) విద్యుత్ బలాలు
బి) విశ్వగురుత్వాకర్షణ బలాలు
సి) అయస్కాంత బలాలు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
49.సంవత్సర కాలవ్యవధి గరిష్టంగా ఉన్న గ్రహం?
ఎ) శని
బి) బృహస్పతి
సి) నెఫ్ట్యూన్
డి) శుక్రుడు
- View Answer
- సమాధానం: సి
50. భూమికి అతిచేరువలో పరిభ్రమిస్తోన్న కృత్రిమ ఉపగ్రహ ఆవర్తన కాలం (సుమారుగా)?
ఎ) 24 గంటలు
బి) 10 గంటలు
సి) 500 సెకన్లు
డి) 5000 సెకన్లు
- View Answer
- సమాధానం: డి