ధ్వని - 2
1. కింద పేర్కొన్న ఏ యానకంలో ధ్వని వేగం అధికంగా ఉంటుంది?
ఎ) గాలి
బి) నీరు
సి) పాదరసం
డి) ప్లాస్టిక్
- View Answer
- సమాధానం: సి
2. కింది వాటిలో ఏది పరశ్రవ్య ధ్వని?
ఎ) 18 Hz
బి) 180 Hz
సి) 1800 Hz
డి) 18000 Hz
- View Answer
- సమాధానం: ఎ
3. సైనికులు కవాతు చేస్తున్నప్పుడు చిన్న బ్రిడ్జి రాగానే కవాతు ఆపి, సాధారణంగా నడుస్తారు. దీనికి ప్రధాన కారణం?
ఎ) ధ్వని వక్రీభవనం
బి) ధ్వని వివర్తనం
సి) అనునాదం
డి) ధ్వని రుజువర్తనం
- View Answer
- సమాధానం: సి
4. కింది వాటిలో అతిధ్వనుల ఉపయోగం కానిది ఏది?
1. పాల నుంచి కొవ్వును వేరుచేయడం
2. పాత్రల్లోని పగుళ్లను గుర్తించడం
3. సోనోగ్రఫీలో వాడటం
4. దృఢ లోహాలకు రంధ్రాలు చేయడం
ఎ) 1, 2
బి) 1, 2, 3
సి) 1, 4
డి) 1, 2, 3, 4
- View Answer
- సమాధానం: సి
5. ధ్వనిని స్పష్టంగా వినాలంటే పరావర్తన తలం నుంచి పరిశీలకుడు ఉండాల్సిన కనీస దూరం?
ఎ) 16 మీ.
బి) 17 మీ.
సి) 18 మీ.
డి) 19 మీ.
- View Answer
- సమాధానం: బి
6. ఆడవాళ్ల గొంతు మగవాళ్ల కంటే ‘కీచు’గా ఉంటుంది. కారణం ఏమిటి?
ఎ) తక్కువ పౌనఃపున్యం
బి) తక్కువ తరచుదనం
సి) ఎక్కువ పౌనఃపున్యం
డి) ఎక్కువ తరచుదనం
- View Answer
- సమాధానం: సి
7. ఏ రకమైన ధ్వనులు వినగలగడం వల్ల గబ్బిలాలు చీకట్లో దేన్నీ తగలకుండా సులభంగా ఎగురుతాయి?
ఎ) పరశ్రవ్యాలు
బి) శ్రవ్య ధ్వనులు
సి) అతిధ్వనులు
డి) చీకటిలో చూసే దృష్టి అభివృద్ధి చెందడం
- View Answer
- సమాధానం: సి
8.ధ్వని స్థాయిత్వం (Pitch) కింది వాటిలో దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) ధ్వని పౌనఃపున్యం
బి) కంపన పరిమితి
సి) తరంగదైర్ఘ్యం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: ఎ
9. సాధారణంగా ఆడవారి కంఠ స్వరం స్థాయిత్వం (Pitch) -
ఎ) మగవారి కంటే ఎక్కువ
బి) మగవారి కంటే బాగా తక్కువ
సి) మగవారి కంటే కొంచెం తక్కువ
డి) మగవారితో సమానం
- View Answer
- సమాధానం: ఎ
10. మునిగిపోయిన వస్తువులను కనుగొనేందుకు తోడ్పడే పరికరం -
ఎ) కెలిడియోస్కోప్
బి) సోనార్
సి) రాడార్
డి) పెరిస్కోప్
- View Answer
- సమాధానం: బి
11. సినిమా హాళ్ల గోడలు, పైకప్పును రంపపు పొట్టుతో (Fibrous Material) కప్పడానికి కారణం-
ఎ) హాల్‌కు మరింత సౌందర్యం ఇవ్వడం
బి) అనునాద నివారణ
సి) ప్రతిధ్వని నివారణ
డి) అధిక పౌనఃపున్యం ఉన్న ధ్వనిని శోషించడం
- View Answer
- సమాధానం: డి
12. ధ్వని తరంగాలు దేని ద్వారా ప్రయాణించవు?
1. ఘన పదార్థం
2. ద్రవ పదార్థం
3. వాయు పదార్థం
4. శూన్యం
ఎ) 1 మాత్రమే
బి) 4 మాత్రమే
సి) 3, 4
డి) 2, 4
- View Answer
- సమాధానం: బి
13. జతపరచండి.
గ్రూప్-ఎ | గ్రూప్-బి |
1. సోనార్ | i. క్రిస్టియన్ డాప్లర్ |
2. డాప్లర్ ప్రభావం | ii. వాట్సన్ వాట్ |
3. రాడార్ | iii. నిక్సన్ |
4. ధ్వని రికార్డ, పునరుత్పత్తి | iv. పౌల్సన్ |
1 | 2 | 3 | 4 | |
ఎ) | i | ii | iii | iv |
బి) | ii | i | iv | iii |
సి) | iii | i | ii | iv |
డి) | iv | i | iii | ii |
- View Answer
- సమాధానం: సి
14. కింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి.
1. కుక్కలు 50,000 Hz, గబ్బిలాలు లక్ష Hz వరకు ధ్వనిని వినగలుగుతాయి.
2. డాల్ఫిన్లు లక్ష Hz పౌనఃపున్యం ఉన్న ధ్వనిని ఉత్పత్తి చేస్తాయి, గుర్తిస్తాయి.
ఎ) పై రెండూ సరైనవే
బి) 1 సరైంది, 2 తప్పు
సి) రెండూ తప్పు
డి) 2 సరైంది, 1 తప్పు
- View Answer
- సమాధానం: ఎ
15. పిల్లనగ్రోవి, విజిల్, రేడియో పనిచేసే ధర్మం?
ఎ) ప్రతిధ్వని
బి) అనునాదం
సి) డాప్లర్ ప్రభావం
డి) సోనార్
16. కింది వాటిలో ఏ సందర్భంలో ధ్వని వేగం ఎక్కువగా ఉంటుంది?
ఎ) 0°Cల వద్ద పొడి రోజు
బి) 30°Cల వద్ద పొడి రోజు
సి) 0°Cల వద్ద తడి రోజు
డి) 30°Cల వద్ద తడి రోజు
- View Answer
- సమాధానం: డి
17. కింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని జనించదు, ప్రయాణించలేదు?
ఎ) గాలి
బి) రబ్బరు
సి) హైడ్రోజన్ వాయువు
డి) ఉప్పు నీరు
- View Answer
- సమాధానం: బి
18. కింది వాటిలో ఏ పదార్థంలో ధ్వని వేగం ఎక్కువ?
ఎ) హైడ్రోజన్ వాయువు
బి) నీరు
సి) రబ్బరు
డి) గాలి
- View Answer
- సమాధానం: బి
1. గుసగుసలు | i) 60 dB |
2. టెలిఫోన్ | ii) 20-30 dB |
3. జెట్ విమానం | iii) 80-90 dB |
4. ట్రాఫిక్ | iv) 100-200 dB |
1 | 2 | 3 | 4 | |
ఎ) | i | ii | iii | iv |
బి) | ii | i | iv | iii |
సి) | iii | i | iv | ii |
డి) | iv | ii | i | iii |
- View Answer
- సమాధానం: బి
20. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1. సముద్ర అంతర్భాగంలో ఉండే సబ్‌మెరైన్ (జలాంతర్గామి) ఉనికి, లోతు, వేగం, కదిలే దిశను కనుక్కోవడానికి తోడ్పడే SONAR (Sound Navigation And Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
2. ఆకాశంలో ఎగురుతున్న ఎయిర్‌క్రాఫ్ట్స్ (విమానాలు), రాకెట్స్, క్షిపణుల ఉనికి తెలుసుకునే రాడార్ RADAR (Radio Detection And Ranging) డాప్లర్ ఫలితం ఆధారంగా పనిచేస్తుంది.
ఎ) 1 సరైంది, 2 తప్పు
బి) 1 సరికాదు, 2 సరైంది
సి) రెండూ సరైనవే
డి) రెండూ సరికాదు
- View Answer
- సమాధానం: సి
21. డాప్లర్ ఫలితం అనువర్తనం కానిది?
ఎ) వాహనాల వేగాన్ని లెక్కించే 'Speed Gun' అనే పరికరం పనిచేయడం
బి) తుఫాన్ల ఉనికిని ముందుగాతెలుసుకోవడం
సి) సూర్యుడి ఆత్మభ్రమణ దిశ, శని గ్రహం చుట్టూ ఉన్న రంగుల వలయాలను తెలుసుకోవడం
డి) శరీరంలోని ఎముకలను పరిశీలించడం
- View Answer
- సమాధానం: డి
22. గాలి సాంద్రత తగ్గితే దానిలో ధ్వని వేగం?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) ఏ మార్పూ ఉండదు
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
23. ‘ధ్వని బహుళ పరావర్తనం’ అనే ధర్మం ఆధారంగా పనిచేసే పరికరం?
ఎ) ఈసీజీ
బి) రాడార్
సి) స్టెతస్కోప్
డి) ఆల్ట్రాసోనోగ్రఫీ
- View Answer
- సమాధానం: సి
24.కింది వాటిలో ఎత్తై పర్వతాలు, భవనాల మధ్య దూరం; లోయలు, గనుల లోతును కనుగొనడానికి ఉపయోగపడేది?
ఎ) అతిధ్వనులు
బి) ప్రతిధ్వని
సి) సోనార్
డి) అనునాదం
- View Answer
- సమాధానం: బి
25. కింది వాటిలో రాడార్ ఉపయోగం ఏది?
ఎ) సౌర వికిరణాన్ని శోధించడం
బి) విమానాలు, క్షిపణుల ఉనికి, వాటి గమనాన్ని శోధించడం
సి) గ్రహాలను పరిశీలించడం
డి) భూకంపాల తీవ్రతలు కొలవడం
- View Answer
- సమాధానం: బి
26. మాక్ నంబర్ దేనికి సంబంధించింది?
ఎ) ధ్వని
బి) విద్యుత్
సి) అయస్కాంతం
డి) కాంతి
- View Answer
- సమాధానం: ఎ
27. ధ్వని తరంగాలను విద్యుత్ తరంగాలుగా మార్చే పరికరం ఏది?
ఎ) టెలిఫోన్
బి) హైడ్రోఫోన్
సి) మైక్రోఫోన్
డి) రేడియో
- View Answer
- సమాధానం: సి
28. ధ్వనిని రికార్డు చేయడాన్ని ఏమంటారు?
ఎ) వీడియోగ్రఫీ
బి) ఆడియోగ్రఫీ
సి) ఫొటోగ్రఫీ
డి) రేడియోగ్రఫీ
- View Answer
- సమాధానం: బి
29.కింది వాటిలో ధ్వని అత్యధిక వేగంతో ప్రయాణించే పదార్థం -
ఎ) నీరు
బి) గాలి
సి) ఉక్కు
డి) శూన్యం
- View Answer
- సమాధానం: సి
30. భూకంపాలు సంభవించినప్పుడు, అగ్ని పర్వతాలు విస్ఫోటం చెందినప్పుడు ఉత్పత్తయ్యే తరంగాలేవి?
ఎ) శ్రావ్య ధ్వనులు
బి) పరశ్రావ్య ధ్వనులు
సి) అతిధ్వనులు
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
31. అతి ధ్వనులను వినగలిగే జీవి -
ఎ) డాల్ఫిన్
బి) కుక్క
సి) గబ్బిలం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
32. మెరుపు కనిపించిన తర్వాత ఉరుము వినిపిస్తుంది. దీనికి కారణం -
ఎ) ధ్వని వేగం కాంతి వేగం కంటే తక్కువ
బి) ధ్వని వేగం కాంతి వేగం కంటే ఎక్కువ
సి) అది ప్రకృతి సహజం
డి) ఏదీకాదు
- View Answer
- సమాధానం: ఎ
33. లోహ పలకల్లో ఉన్న పగుళ్లను గుర్తించడానికి ఉపయోగించే తరంగాలు -
ఎ) అతిధ్వనులు
బి) పరశ్రవ్యాలు
సి) సాధారణ ధ్వని తరంగాలు
డి) కాంతి కిరణాలు
- View Answer
- సమాధానం: ఎ
34. కాంతితో పోల్చినప్పుడు ధ్వని ప్రదర్శించని ధర్మం -
ఎ) పరావర్తనం
బి) వ్యతికరణం
సి) ధ్రువణం
డి) వక్రీభవనం
- View Answer
- సమాధానం: సి
35. మన దేశంలో ప్రతిధ్వని వినిపించే స్థలం (Echopoint) ఎక్కడ ఉంది?
ఎ) ఆంధ్రప్రదేశ్
బి) కేరళ
సి) తమిళనాడు
డి) మహారాష్ట్ర
- View Answer
- సమాధానం: బి
36. ధ్వని బంధక గదుల నిర్మాణంలో ఉపయోగించే పదార్థం -
ఎ) స్వచ్ఛమైన ప్లాస్టిక్
బి) రబ్బర్
సి) థర్మోకోల్
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
37. గాలిలో ధ్వని వేగం దేనిపై ఆధారపడదు?
ఎ) ఉష్ణోగ్రత
బి) ఆర్ధ్రత
సి) వాయు పీడనం
డి) గాలి వేగం
- View Answer
- సమాధానం: సి
38. రెండు ధ్వనుల మధ్య తేడాను గుర్తించడానికి కావలసిన కనీస సమయం-
ఎ) 1 సెకను
బి) 1/10 సెకను
సి) 1 నిమిషం
డి) 1/10 నిమిషం
- View Answer
- సమాధానం: బి
39. ధ్వని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ఎ) ఫోటోమెట్రీ
బి) సెలినాలజీ
సి) కెలోరిమెట్రీ
డి) ఎకోస్టిక్స్
- View Answer
- సమాధానం: డి
40. ధ్వని ఏ ధర్మం వల్ల ప్రతిధ్వని వినిపిస్తుంది?
ఎ) వక్రీభవనం
బి) పరావర్తనం
సి) వివర్తనం
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: బి
41. గర్భస్థ శిశువుకు సంబంధించిన పరీక్షకు ఉపయోగించే తరంగాలేవి?
ఎ) అతిధ్వనులు
బి) అతినీలలోహిత కిరణాలు
సి) పరశ్రావ్యాలు
డి) ఎక్స్-కిరణాలు
- View Answer
- సమాధానం: ఎ
42. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏది?
ఎ) హెర్ట్ జ్
బి) ల్యూమెన్
సి) డెసిబెల్
డి) న్యూటన్
- View Answer
- సమాధానం: సి
43.ఒక వస్తువు సహజ పౌనఃపున్యం దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) స్థితిస్థాపకత
బి) వస్తువు ఆకారం, పరిమాణం
సి) కంపనరీతి
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
44. భవన ధ్వని శాస్త్రానికి పునాది వేసిన శాస్త్రవేత్త?
ఎ) డబ్ల్యు.సి.సబైన్
బి) న్యూమాన్
సి) కార్క మాక్స్వెల్
డి) యుకవా
- View Answer
- సమాధానం:ఎ
45. వాయువు ఉష్ణోగ్రత పెరిగితే ధ్వని వేగం?
ఎ) మారదు
బి) శూన్యం అవుతుంది
సి) మొదట తగ్గి తర్వాత పెరుగుతుంది
డి) పెరుగుతుంది
- View Answer
- సమాధానం: డి
46. గాలిలో తేమ శాతం పెరిగితే ధ్వని వేగం ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది
బి) తగ్గుతుంది
సి) మారదు
డి) ప్రభావం ఉండదు
- View Answer
- సమాధానం: ఎ
47. యాంత్రిక తరంగాలు ప్రసరింపజేసే యానకాలు కలిగి ఉండేవి?
ఎ) స్థితిస్థాపకత
బి) జడత్వం
సి) స్థితిస్థాపకత, జడత్వం
డి) జడత్వభ్రామకం
- View Answer
- సమాధానం: సి