జవహర్లాల్ నెహ్రూ 1927లో ఎక్కడ జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యాడు?
1. జవహర్లాల్ నెహ్రూ 1927లో ఎక్కడ జరిగిన అణగారిన వర్గాల సమావేశానికి హాజరయ్యాడు?
1) నైరోబీ
2) బెర్న
3) బ్రస్సెల్స్
4) బాండుంగ్
- View Answer
- సమాధానం: 3
2. ‘భారత్ చోడో’ నినాదం ఎవరిచ్చారు?
1) మహమ్మద్ అలీ జిన్నా
2) మహాత్మా గాంధీ
3) నేతాజీ సుభాష్ చంద్రబోస్
4) సూర్యసేన్
- View Answer
- సమాధానం: 2
3. కింది వాటిలో సరికాని జత ఏది?
1) విష్ణుశాస్త్రి చిప్లూంకర్ - కన్నడ
2) భరతేందు హరిశ్చంద్ర - హిందీ
3) సుబ్రమణ్య భారతి - తమిళం
4) ఫకీర్ మోహన్ సేనాపతి - ఒరియా
- View Answer
- సమాధానం: 1
4. 1925లో నవజవాన్ భారత్ సభను భగత్ సింగ్ ఎక్కడ స్థాపించాడు?
1) అమృత్సర్
2) లాహోర్
3) లక్నో
4) ఢిల్లీ
- View Answer
- సమాధానం: 2
5. కింది వాటిలో బాల గంగాధర తిలక్‌కు సంబంధించనిది ఏది?
1) లోకమాన్య బిరుదు
2) గీతా రహస్య గ్రంథం
3) దేశ భక్తుల్లో రాజు బిరుదు
4) బార్డోలీ సత్యాగ్రహం
- View Answer
- సమాధానం: 4
6. కింది వాటిలో విద్యా సంస్కరణల కోసం నియమించిన కమిటీ ఏది?
1) థామస్ రాబర్ట్సన్ కమిషన్
2) రిచర్డ్స స్ట్రాచీ కమిషన్
3) హంటర్ కమిషన్
4) ప్రెజర్ కమిటీ
- View Answer
- సమాధానం: 3
7. ‘అఖిల భారత అణగారిన వర్గాల సమాఖ్య’ స్థాపకుడు ఎవరు?
1) మహాత్మా గాంధీ
2) జ్యోతిబా పూలే
3) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
4) నారాయణ గురు
- View Answer
- సమాధానం: 3
8. 1920 ఆగస్టు 1న మరణించిన ప్రముఖుడు?
1) గోపాలకృష ్ణగోఖలే
2) బాల గంగాధర తిలక్
3) దాదాభాయ్ నౌరోజీ
4) పి. ఆనందా చార్యులు
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
పత్రిక
a) కీర్తి
b) బహిష్కృత్ భారత్
c) ఆల్ హిలాల్
d) భాగ్యనగర్
e) హరిజన్
ప్రముఖుడు
i) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
ii) మౌలానా అబుల్ కలాం ఆజాద్
iii) మహాత్మా గాంధీ
iv) భాగ్యరెడ్డి వర్మ
v) భగత్ సింగ్
1) a-i, b-iii, c-ii, d-iv, e-v
2) a-v, b-iii, c-ii, d-iv, e-i
3) a-v, b-i, c-ii, d-iv, e-iii
4) a-ii, b-iii, c-i, d-iv, e-v
- View Answer
- సమాధానం: 3
10. స్వాతంత్రోద్యమ కాలంలో ‘బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి’ అన్నదెవరు?
1) బాల గంగాధర తిలక్
2) నేతాజీ బోస్
3) లాలా లజపతిరాయ్
4) అరవింద్ ఘోష్
- View Answer
- సమాధానం: 1
11. 1932లో ‘అఖిల భారత హరిజన సంఘం’ను స్థాపించిన వారెవరు?
1) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
2) మహాత్మా గాంధీ
3) భాగ్యరెడ్డి వర్మ
4) ఇ.వి. రామస్వామి నాయకర్
- View Answer
- సమాధానం: 2
12. కింది వాటిలో సరైన జత ఏది?
1) గేట్ వే ఆఫ్ ఇండియా - ముంబై
2) ఎర్రకోట - ఢిల్లీ
3) సబర్మతి ఆశ్రమం - అహ్మదాబాద్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
13. నాసిక్ కుట్ర కేసు ఏ సంవత్సరంలో సంచలనం సృష్టించింది?
1) 1907
2) 1909
3) 1911
4) 1913
- View Answer
- సమాధానం: 2
14. జలియన్ వాలాబాగ్ దురంతంపై నిజ నిర్ధారణకు నియమించిన కమిషన్?
1) సర్ థామస్ ర్యాలీ కమిషన్
2) రిచర్డ్స స్ట్రాచీ కమిషన్
3) హంటర్ కమిషన్
4) హార్టోగ్ కమిషన్
- View Answer
- సమాధానం: 3
15. డబ్ల్యూ.సి. బెనర్జీ భారత జాతీయ కాంగ్రెస్‌కు ఎన్ని సార్లు అధ్యక్షుడిగా వ్యవహరించారు?
1) 4
2) 3
3) 2
4) 1
- View Answer
- సమాధానం: 3
16. దివ్య జ్ఞాన సమాజం ప్రధాన శాఖను భారత్‌లో ఎక్కడ నెలకొల్పారు?
1) మహాబలిపురం
2) అడయార్
3) తంజావూర్
4) చెన్నై
- View Answer
- సమాధానం: 2
17. ఈస్టిండియా కంపెనీ వర్తక గుత్తాధిపత్యం ఎప్పుడు రద్దయింది?
1) 1813
2) 1816
3) 1818
4) 1823
- View Answer
- సమాధానం: 1
18. కింది వాటిలో కాలక్రమంగా ముందుగా జరిగిన సంఘటన ఏది?
1) చంపారన్ సత్యాగ్రహం
2) సబర్మతి ఆశ్రమం స్థాపన
3) సత్యశోధక్ సమాజ్ స్థాపన
4) గదర్ పార్టీ స్థాపన
- View Answer
- సమాధానం: 3
19. ‘శాసనోల్లంఘన ఉద్యమ రాణి’ అని ఎవరిని అంటారు?
1) గైడిన్లూ
2) సరోజినీ నాయుడు
3) అరుణా అసఫ్ అలీ
4) కాదింబినీ గంగూలీ
- View Answer
- సమాధానం: 2
20.‘స్వదేశీ’ అనే పదాన్ని ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తొలిసారిగా ఉపయోగించారు?
1) 1886 కలకత్తా ఐఎన్‌సీ
2) 1906 కలకత్తా ఐఎన్‌సీ
3) 1924 బెల్గాం ఐఎన్‌సీ
4) 1925 కాన్పూర్ ఐఎన్‌సీ
- View Answer
- సమాధానం: 2
21. జలియన్ వాలాబాగ్ ప్రాంతం ఎక్కడ ఉంది?
1) లక్నో
2) అమృత్సర్
3) గోరఖ్‌పూర్
4) కాన్పూర్
- View Answer
- సమాధానం: 2
22.జతపరచండి.
గేయకర్త
a) నర్సింహా మెహతా
b) రవీంద్రనాథ్ ఠాగూర్
c) మహమ్మద్ ఇక్బాల్
ఛీ) రాయప్రోలు సుబ్బారావు
e) శ్యాంలాల్ పర్షాద్ గుప్తా
గేయం
i) అమర్ సోనార్ బంగ్లా...
ii) ఏ దేశమేగినా ఎందుకాలిడినా...
iii) ఝాండా ఊంచారహే...
iv) వైష్ణవ్ జన్తో...
v) సారే జహాంసే అచ్చా
1) a-i, b-iii, c-ii, d-iv, e-v
2) a-iv, b-i, c-v, d-ii, e-iii
3) a-v, b-i, c-ii, d-iv, e-iii
4) a-ii, b-iii, c-i, d-iv, e-v
- View Answer
- సమాధానం: 2
23. కింది వాటిలో హోంరూల్ ఉద్యమం జరిగిన సంవత్సరం ఏది?
1) 1916
2) 1918
3) 1919
4) 1921
- View Answer
- సమాధానం: 1
24. కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయుడిని హత్య చేసిన స్వాతంత్య్ర సమర యోధుడు ?
1) సూర్యసేన్
2) సచిన్ సన్యాల్
3) భటుకేశ్వర్ దత్
4) మదన్‌లాల్ ధింగ్రా
- View Answer
- సమాధానం: 4
25. ‘బందీ జీవన్’ గ్రంథ కర్త ఎవరు?
1) భగత్ సింగ్
2) సచీంద్రనాథ్ సన్యాల్
3) సూర్యసేన్
4) వి.డి. సావర్కర్
- View Answer
- సమాధానం: 2
26. ‘ది ఇండియన్ సోషియాలజిస్ట్’ పత్రిక సా్థపకుడెవరు?
1) శ్యాంజీ కృష్ణవర్మ
2) మౌలానా అబుల్ కలాం ఆజాద్
3) భగత్ సింగ్
4) అరవింద ఘోష్
- View Answer
- సమాధానం: 1
27. జతపరచండి.
ప్రదేశాలు
a) కటక్
b) పోర్ బందర్
c) టంకారా
d) హైదరాబాద్
e) రత్నగిరి
ప్రముఖుల జననం
i) బాల గంగాధర తిలక్
ii) సరోజినీ నాయుడు
iii) మహాత్మా గాంధీ
iv) నేతాజీ బోస్
v) దయానంద సరస్వతి
1) a-iv, b-iii, c-v, d-ii, e-i
2) a-v, b-iii, c-ii, d-iv, e-i
3) a-v, b-i, c-ii, d-iv, e-iii
4) a-ii, b-iii, c-i, d-iv, e-v
- View Answer
- సమాధానం: 1
28. గాంధీజీ ఎవరిని ‘క్విట్ ఇండియా ఉద్యమ రాణి’ అన్నాడు?
1) సరోజినీ నాయుడు
2) అరుణా అసఫ్ అలీ
3) ఉషా మెహతా
4) రాజ్ కుమారీ అమృత్ కౌర్
- View Answer
- సమాధానం: 2
29.భారత్-చైనాల మధ్య మెక్‌మోహన్ రేఖను (సరిహద్దురేఖ) ఎప్పుడు ఆమోదించారు?
1) 1914
2) 1916
3) 1918
4) 1922
- View Answer
- సమాధానం: 1
30.వందేమాతరం గేయాన్ని మొదటి ఏ భాషలో రాశారు?
1) ఇంగ్లిష్
2) సంస్కృతం
3) హిందీ
4) పంజాబీ
- View Answer
- సమాధానం: 2
31. గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించారు?
1) పోర్బందర్
2) పూనా
3) వార్థా
4) దండి
- View Answer
- సమాధానం: 3
32. 1857 సిపాయిల తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో మొగల్ సైన్యాలకు సైన్యాధ్యక్షుడు ఎవరు?
1) భక్త్‌ఖాన్
2) ఖాన్ బహదూర్ ఖాన్
3) సేవారామ్
4) షేర్ ఆఫ్ఘన్
- View Answer
- సమాధానం: 1
33. ‘వేదభాష్య భూమిక’ గ్రంథ కర్త ఎవరు?
1) ఆత్మారాం పాండురంగ
2) దయానంద సరస్వతి
3) ఆర్.జి. భండార్కర్
4) కేశవ చంద్రసేన్
- View Answer
- సమాధానం: 2
34. క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ ఏమని పేర్కొన్నాడు?
1) దివాలాతీసే బ్యాంకులపై ముందస్తు తేది వేసి ఇచ్చిన చెక్కులు
2) బొమ్మ అడిగితే ప్రతిమ ఇచ్చారు
3) పగిలిన అద్దాన్ని పార్శిల్ చేసి పంపారు
4) నవ్వుతూ చేసిన మోసం
- View Answer
- సమాధానం: 1
35. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైన సంవత్సరం?
1) 1934
2) 1936
3) 1938
4) 1941
- View Answer
- సమాధానం: 1
36. హోంరూల్ ఉద్యమానికి ప్రేరణ ఇచ్చిన ‘సిన్‌ఫిన్ ఉద్యమం’ ఏ దేశంలో జరిగింది?
1) జర్మనీ
2) రష్యా
3) ఫ్రాన్స
4) ఐర్లాండ్
- View Answer
- సమాధానం: 4
37. భారత్‌లో బానిసత్వం రద్దు చేసిన సంవత్సరం?
1) 1813
2) 1823
3) 1833
4) 1843
- View Answer
- సమాధానం: 3
38. సిస్టర్ నివేదిత అనే వివేకానందుని శిష్యురాలు అసలు పేరు?
1) మేడం కామా
2) మార్గరేట్ నోబుల్
3) కేట్విన్ స్లేడ్
4) ఎడ్వినా
- View Answer
- సమాధానం: 2
39. ఇంగ్లండ్‌లో కంపెనీ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడానికి ‘హైలీ బరి కాలేజీ’ని ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు?
1) 1773 రెగ్యులేటింగ్ చట్టం
2) 1793 చార్టర్ చట్టం
3) 1813 చార్టర్ చట్టం
4) 1833 చార్టర్ చట్టం
- View Answer
- సమాధానం: 3
40. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణను ఆపివేస్తున్నట్టుగా ఏ చట్టంలో ఆంగ్లేయులు పేర్కొన్నారు?
1) 1858 భారత ప్రభుత్వ చట్టం
2) 1861 శాసన సభల చట్టం
3) 1892 శాసన సభల చట్టం
4) 1919 మింటో - మార్లే సంస్కరణల చట్టం
- View Answer
- సమాధానం: 1
-
41.‘సర్వెంట్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ’లో గాంధీజీ చేరడానికి అభ్యంతరం తెలిపిందెవరు?
1) శ్రీనివాస శాస్త్రి
2) అంబాలాల్ సారాబాయి
3) సి. విజయరాఘవాచారి
4) డాక్టర్ అన్సారీ
- View Answer
- సమాధానం: 1
42. 1930 లో లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన మొత్తం ప్రతినిధుల సంఖ్య?
1) 69
2) 79
3) 89
4) 99
- View Answer
- సమాధానం: 3
43.భారత హోంరూల్ సంఘాన్ని శ్యాంజీ కృష్ణ వర్మ ఎక్కడ స్థాపించారు?
1) మాస్కో
2) కైరో
3) బీజింగ్
4) లండన్
- View Answer
- సమాధానం: 4
44. ‘ఇండియన్ యూనియన్’ ఏర్పడినట్టుగా ప్రకటించింది ఎవరు?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) డాక్టర్ బాబూరాజేంద్ర ప్రసాద్
3) మహాత్మా గాంధీ
4) డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 2
45. కింది వాటిలో సరైన జత ఏది?
1) అష్పకుల్లాఖాన్ - స్వాతంత్య్రోమంలో వీరమరణం పొందిన తొలి ముస్లిం
2) ఆచార్య వినోభా భావే - తొలి వ్యక్తిగత సత్యాగ్రహి
3) ఆంధ్రా గాంధీ - వావికొలను సుబ్బారావు
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
46. మహదేవ గోవింద రనడే పశ్చిమ భారతదేశంలో ప్రారంభించిన ఉద్యమం?
1) శుద్ధి ఉద్యమం
2) పరిశుద్ధి ఉద్యమం
3) చౌదర్ చెరువు ఉద్యమం
4) ఆత్మ గౌరవ ఉద్యమం
- View Answer
- సమాధానం: 2
47. 1885లో ఐఎన్‌సీ సమావేశం ఎక్కడ జరిగింది?
1) సర్ తేజ్‌పాల్ సంస్కృత కళాశాల
2) ఎల్ఫిన్స్టన్ కళాశాల
3) బెనారస్ హిందూ కళాశాల
4) పిఠాపురం రాజావారి కళాశాల
- View Answer
- సమాధానం: 1
48. ప్రముఖ జాతీయ నాయకుడు, దేశభక్తుడు ముకుందదాస్ ఏ భాషలో రచనలు చేశాడు?
1) పంజాబీ
2) గుజరాతీ
3) బెంగాలీ
4) ఒరియా
- View Answer
- సమాధానం: 3
49. కింది వాటిలో సరైన జత ఏది?
1) గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ - పండిట్ నెహ్రూ
2) రైతుల పాఠశాల - ఎన్.జి. రంగా
3) హైదరాబాద్ అంబేడ్కర్ - బి.ఎస్. వెంకట్రావ్
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
50. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి బ్రిటన్ ప్రధాని?
1) విన్స్టన్ చర్చిల్
2) క్లెమెంట్ అట్లీ
3) పాలిమర్ స్టోన్
4) లాయిడ్ జార్జి
- View Answer
- సమాధానం: 2
1) రాబర్ట్ క్లైవ్
2) రాయ్దుర్లబ్
3) నందకుమార్
4) జగత్ సేఠ్
- View Answer
- సమాధానం: 3