ద్వీపకల్ప భారతదేశం - నైసర్గిక స్వరూపం
1. ద్వీపకల్ప భారతదేశంలో ఎత్తయిన పర్వత శిఖరం?
ఎ) వావుల్మాలా
బి) అనైముడి
సి) మహేంద్రగిరి
డి) హరిశ్చంద్ర
- View Answer
- సమాధానం: బి
2. దొడ్డబెట్ట కింది ఏ పర్వతశ్రేణుల్లో ఎత్తయిన శిఖరం?
ఎ) తూర్పు కనుమలు
బి) పళని కొండలు
సి) నీలగిరి కొండలు
డి) అన్నామలై కొండలు
- View Answer
- సమాధానం: సి
3. రాంచీ పీఠభూమి ఏ నైసర్గిక స్వరూపంలో భాగం?
ఎ) మైకాల పీఠభూమి
బి) మాళ్వా పీఠభూమి
సి) బుందేల్ఖండ్ పీఠభూమి
డి) ఛోటానాగపూర్ పీఠభూమి
- View Answer
- సమాధానం: డి
4. ఆరావళి పర్వతశ్రేణులు ఏయే నదీ లోయలను వేరు చేస్తున్నాయి?
ఎ) గంగా-సింధు
బి) గంగా-యమున
సి) గంగా-చంబల్
డి) గంగా-సట్లెజ్
- View Answer
- సమాధానం: ఎ
5. దక్కన్ నాపల ప్రాంతం ఏ తరగతికి చెందిన శిలలతో ఉంది?
ఎ) గ్రానైట్
బి) సున్నపురాయి
సి) బసాల్ట్
డి) ఇసుకరాయి
- View Answer
- సమాధానం: సి
6. పచ్మాడి వేసవి విడిది కేంద్రం ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
ఎ) సాత్పురా
బి) మహాదేవ
సి) వింధ్య
డి) బాలాఘాట్
- View Answer
- సమాధానం: డి
7. గోదావరి, కృష్ణా నదులు ఏ పర్వతాల్లో ఉద్భవిస్తున్నాయి?
ఎ) తూర్పు కనుమలు
బి) అజంతా కొండలు
సి) నీలగిరి కొండలు
డి) సహ్యాద్రి కొండలు
- View Answer
- సమాధానం: డి
8. దక్కన్ పీఠభూమి ఏ దిశ వైపు వాలి ఉంది?
ఎ) తూర్పు-ఆగ్నేయ
బి) ఉత్తర
సి) ఈశాన్య
డి) తూర్పు-ఈశాన్య
- View Answer
- సమాధానం: ఎ
9. కింది ఏ పర్వతశ్రేణులు భారతదేశాన్ని ఉత్తర దక్షిణాలుగా విభజిస్తాయి?
ఎ) వింధ్య పర్వతాలు
బి) సాత్పురా పర్వతాలు
సి) మైకాల
డి) అజంతా కొండలు
- View Answer
- సమాధానం: ఎ
10. బస్తర్ పీఠభూమి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది?
ఎ) ఒడిశా
బి) మధ్యప్రదేశ్
సి) ఛత్తీస్గఢ్
డి) కర్ణాటక
- View Answer
- సమాధానం: సి
11. ద్వీపకల్ప భారతదేశంలోని ఏ ప్రాంతంలో బ్యాడ్ ల్యాండ్ భూ దృశ్యం ఏర్పడింది?
ఎ) మాళ్వా పీఠభూమి
బి) బీగల్ ఖండ్ పీఠభూమి
సి) చంబల్ లోయ
డి) సోన్ లోయ
- View Answer
- సమాధానం: సి
12. ద్వీపకల్ప భారతదేశంలో తీవ్ర స్థాయిలో భూకంపాలు సంభవించే ప్రాంతం?
ఎ) మరఠ్వాడ
బి) విదర్భా
సి) బుందేల్ ఖండ్
డి) కచ్
- View Answer
- సమాధానం: డి
13. దక్కన్ నాపలు సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి?
ఎ) 100 బిలియన్ సంవత్సరాలు
బి) 150 బిలియన్ సంవత్సరాలు
సి) 200 బిలియన్ సంవత్సరాలు
డి) 250 బిలియన్ సంవత్సరాలు
- View Answer
- సమాధానం: ఎ
14. షేన్ కొట్టా కనుమ ఏ పర్వత శ్రేణుల్లో ఉంది?
ఎ) తూర్పు కనుమలు
బి) పశ్చిమ కనుమలు
సి) బాలాఘాట్ పర్వత శ్రేణులు
డి) అజంతా కొండలు
- View Answer
- సమాధానం: బి
15. ద్వీపకల్ప భారతదేశంలోకెల్లా నిట్రవాలులు కలిగిన పీఠభూమి?
ఎ) కర్ణాటక
బి) మహారాష్ర్ట
సి) తెలంగాణ
డి) అమరఖంఠక్
- View Answer
- సమాధానం: ఎ
16. ఆంధ్రప్రదేశ్లో సుప్రసిద్ధ శ్రీశైలం పుణ్య క్షేత్రం ఏ కొండల్లో ఉంది?
ఎ) ఎర్రమలై
బి) నల్లమలై
సి) శేషాచలం
డి) వెలిగొండ
- View Answer
- సమాధానం: బి
17. గురు శిఖర్ ఏ పర్వత శ్రేణుల్లో ఎత్తయిన శిఖరం?
ఎ) వింధ్య
బి) సాత్పూరా
సి) ఆరావళి
డి) తూర్పు కనుమలు
- View Answer
- సమాధానం: సి
18. భారతదేశంలోని ఏ ప్రాంతంలో అతి పురాతన శిలలు లభ్యమవుతున్నాయి?
ఎ) హిమాలయూలు
బి) పూర్వాంచల్ కొండలు
సి) గంగా మైదానం
డి) ద్వీపకల్ప పీఠభూమి
- View Answer
- సమాధానం: డి
19. మాళ్వా పీఠభూమి ఏ దిశ గా వాలి ఉంది?
ఎ) ఉత్తర
బి) దక్షిణ
సి) తూర్పు
డి) పడమర
- View Answer
- సమాధానం: ఎ
20. పెండ్రా పీఠభూముల్లో ఏ నది ఉద్భవిస్తోంది?
ఎ) చంబల్
బి) సోన్
సి) దామోదర
డి) తపతి
- View Answer
- సమాధానం: బి
21. సహ్యాద్రి కొండల్లో ఎత్తయిన పర్వత శిఖరం?
ఎ) అనైముడి
బి) త్రయంబక్
సి) వావుల్ మలై
డి) హరిశ్చంద్ర
- View Answer
- సమాధానం: సి
22. రాజమహల్ కొండలు ఏ పీఠభూమిలో భాగం?
ఎ) కర్ణాటక
బి) దక్కన్
సి) షిల్లాంగ్
డి) బస్తర్
- View Answer
- సమాధానం: ఎ