Skip to main content

APBIE: ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే..

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 13 సాయంత్రం విడుదలయ్యాయి.
APBIE
ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే..

తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీకి 2,51,653 మంది జనరల్‌ అభ్యర్థులు, ఒకేషనల్‌ కోర్సులకు 26,735 మంది, మరో 38,666 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరైనట్టు వివరించారు. మొదటి సంవత్సరం 1,69,347 మంది బెటర్‌మెంట్‌ రాశారన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి, మే నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 84.35 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు దశల్లోను 4,16,639 మంది పరీక్షకు హాజరు కాగా మార్చిలో 2,66,326 మంది, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 56,767 (77.54 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు.

చదవండి: ఏపీ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | ప్రివియస్‌ పేపర్స్ | న్యూస్ | టిఎస్ ఇంటర్

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీకి 3,73,341 మంది హాజరవగా,  మార్చిలో 2,72,001, సప్లిమెంటరీలో 42,931 (84.35 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు జూన్‌ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరం బెటర్‌మెంట్‌కు హాజరైన 1,69,347 మందిలో 1,41,733 (83.69 శాతం) మంది ఇంప్రూవ్‌మెంట్‌ సాధించారు. మార్చిలో ఫెయిలైన 1,50,313 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాగా 56,767 మంది (37.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 

  • మార్చిలో ద్వితీయ సంవత్సరం ఫెయిలైన 1,01,340 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి హాజరవగా 42,931 (42.36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థులు 38,666 మందిలో 14,395 (37.22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ద్వితీయ ఇంటర్‌లో బాలికలు 86.46 శాతం, బాలురు 81.99 శాతం ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు 80.56 శాతం, బాలురు 74.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
  • జిల్లాల వారీగా మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా (88.38 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (63.32 శాతం) చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పశ్చిమ గోదావరి (97.32 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (75.95 శాతం) చివరి స్థానంలో ఉన్నాయి. 
  • ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 78.53 శాతం, ద్వితీయ సంవత్సరంలో 84.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 
  • ఫలితాలను  www.bie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని శేషగిరిబాబు తెలిపారు. 
Published date : 14 Jun 2023 03:42PM

Photo Stories