AP EAPCET 2023: ర్యాంక్ రాని వారు వెంటనే డిక్లరేషన్ ఫారమ్ నింపండి!
AP EAPCET-2023లో అర్హత సాధించి, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, AP EAPCET-2023లో ర్యాంక్ రాని అభ్యర్థులు 12/7/2023న లేదా అంతకు ముందు డిక్లరేషన్ ఫారమ్‌ను నింపి సమర్పించాలి.
Check College Predictor - 2023 TS EAMCET | AP EAPCET
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్–2023 ఫలితాల్లో అత్యధిక శాతం అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించారు.
అత్యధికంగా ఈ బ్రాంచ్ సీట్లపైనే..
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ సీట్లకు డిమాండ్ పెరగడంతో అంగట్లో సరుకుగా అమ్ముడుపోతున్నాయి. రోజురోజుకూ ఫీజుల మోత మోగుతోంది. సివిల్, మెకానికల్ వంటి ఇంజినీరింగ్ కోర్సులు కాకుండా సీఎస్‌ఈ బ్రాంచ్ వైపే మొగ్గు చూపిస్తుండటంతో ఒకేసారి డిమాండ్ పెరిగినట్లయింది. దీంతో ఇంజినీరింగ్ కళాశాలలు సీఎస్‌ఈ బ్రాంచ్‌కి ఫీజులు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
Best Branches for EAMCET Counselling: బీటెక్‌లో బ్రాంచ్, కాలేజ్ ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
సీఎస్‌ఈ కోర్సుపై ఆసక్తి ఉన్నవారు కౌన్సెలింగ్ కన్వీనర్ కోటాతో సంబంధం లేకుండా బి కేటగిరీలో సీట్లు దక్కించుకునేందుకు పేరొందిన ఇంజినీరింగ్ కాలేజీలకు క్యూ కడుతున్నారు. ఫలితంగా సీఎస్‌ఈ నాలుగేళ్ల కోర్సు కలిపి ప్రస్తుతం రూ.16.లక్షల నుంచి రూ. 30 లక్షల వరకు ఫీజు పలుకుతోంది. మరోవైపు వసతి ఫీజు అదనంగా ఏడాదికి రూ.1.50 లక్షలు వసూలు చేయడం సర్వసాధారణంగా తయారైంది.
అలాగే ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలతో పాటు ఇష్టానుసారం బాదేస్తుండగా.. స్వయం ప్రతిపత్తి కళాశాలలు ఏకంగా డొనేషన్ల పేరిట వసూళ్లకు దిగుతున్నాయి. మరోవైపు ఏటా కొంత మొత్తం చెల్లించాలన్న షరతు పెట్టడం మరింత విస్మయానికి గురి చేస్తోంది.
ఇన్‌స్టిట్యూట్ ఎంపిక
విద్యార్థులు బ్రాంచ్‌తోపాటు ఇన్‌స్టిట్యూట్ ఎంపిక కూడా కీలకమని గుర్తించాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంజనీరింగ్ సీట్లను పరిగణనలోకి తీసుకుంటే.. దాదాపు అందరికీ సీట్లు లభిస్తాయి. అందుకే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో సీటు కోసం విద్యార్థులు ఉత్తమ ర్యాంకు సాధించాలని ప్రయత్నిస్తుంటారు. కాలేజీ ఎంపికలో ఆయా ఇన్‌స్టిట్యూట్‌లో నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు ఉన్నాయా అనే విషయాన్ని పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కళాశాలలో ఫ్యాకల్టీ నుంచి ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ వరకూ.. వివిధ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలంటున్నారు.
Top 20 Engineering Colleges 2023 Andhra Pradesh | Telangana