Police Constable Training 2024- రెండు దశల్లో కానిస్టేబుల్‌ శిక్షణ, మొత్తం ఎంతమంది అంటే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎస్‌ఎల్పీఆర్బీ) ద్వారా ఇటీవల ఎంపికైన కానిస్టేబుల్‌ కేడెట్లకు రెండు దశల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు ట్రైనింగ్‌ అడిషనల్‌ డీజీ అభిలాష బిస్త్‌ తెలిపారు.

పోలీస్‌ శాఖలోని సివిల్, ఏఆర్, టీఎస్‌ఎస్పీ, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఐటీ, పీటీవో విభాగాల్లో కలిపి తుది ఎంపిక జాబితా టీఎస్‌ఎల్పీఆర్బీ నుంచి ఈ నెల 10న పోలీస్‌ శాఖకు అందినట్టు తెలిపారు.

వీరిలో మొదటి దశలో 9,333 మంది సివిల్, ఏఆర్, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్, ఐటీ, పీటీవో కానిస్టేబుల్‌ కేడెట్ల శిక్షణను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు శిక్షణ కేంద్రాల్లో బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. 2వ దశలో 4,725 మంది టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ కేడెట్లకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు.    

#Tags