TS NPDCL : ఎన్పీడీసీఎల్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు.. ఇలాంటి కథనాలను నమ్మవద్దు..
ఈ మేరకు ఈయన జనవరి 3వ తేదీన ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లు, కొన్ని పత్రికల్లో 157 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ప్రకటనలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ఇలాంటి కథనాలను నమ్మవద్దని, నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్‌కు చెందిన వెబ్‌సైట్‌లో చూసుకుని వాస్తవాలు నిర్ధారించుకోవాలని గోపాల్‌రావు సూచించారు.
సంస్థ ఉద్యోగాల భర్తీ చేపడితే అధికారికంగా పత్రికలు, చానళ్లలో నోటిఫికేషన్ ఇస్తుందన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని నమ్మవద్దని కోరారు. చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు 157 యూనిట్లను ఆడిట్ చేయాలని ఎన్పీడీసీఎల్ వెబ్‌సైట్‌లో పొందుపరిస్తే.. దీన్ని కొన్ని వెబ్‌సైట్లు, పత్రికలు 157 పోస్టులుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయని, నిరుద్యోగులు దీన్ని గమనించాలని సూచించారు.
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్