TS Inter Results 2024 Link: టీఎస్ ఇంట‌ర్ ఫ‌లితాలు 2024 విడుద‌ల.. ఒకే ఒక్క క్లిక్‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల. తెలంగాణ‌ ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్ ఫ‌లితాల‌ను ఒకే సారి విడుద‌ల చేసారు.

అలాగే ఈ ఫ‌లితాలు ఏప్రిల్ 24వ తేదీన విడుద‌ల చేయ‌నున్నారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సారి తెలంగాణ‌ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్-2024 ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో అంద‌రి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

చదవండి: Best Career Options After 10th Class: పది తర్వాత.. కోర్సులు, కెరీర్‌ ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి! 

ఫ‌లితాల కోసం 9 ల‌క్ష‌ల మందికి పైగా విద్యార్థులు ఎదురుచూపు..

మార్చి 6వ తేదీ నుంచే మూల్యాంకన ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. తెలంగాణ ఇంటర్ పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. 4,78,527 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,43,993 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇటీవ‌లే ఏపీలో ఇంట‌ర్ ఫ‌లితాలు 2024 విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.

#Tags