TS 10th Class Fail Students 2024 : టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో చాన్స్.. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్, మీ ఆన్సర్ షీట్ కోసం..
అలాగే ఇందులో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేదని విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. 3927 పాఠశాలలు 100శాతం ఉత్తీర్ణత సాధించాయని తెలిపారు.
☛ ఒకే ఒక క్లిక్‌తో టీఎస్ టెన్త్ ఫలితాలు 2024 కోసం క్లిక్ చేయండి
బాలికలదే పైచేయి..
ఈ ఏడాది ఫలితాల్లో బాలికలదే పైచేయి అని ఎడ్యుకేషన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో మొత్తం 91.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాంత ఉత్తీర్ణత సాధించారని పేర్కొన్నారు.
పస్ట్.. లాస్ట్ జిల్లాలు ఇవే..
టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో.. నిర్మల్ జిల్లా 99.05 శాతంతో మొదటి స్థానం నిలిచింది. అలాగే వికారాబాద్ జిల్లా 65.10 శాతం చివరి స్థానంలో నిలిచింది. 4 లక్షల 94 వేల 207 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, ఇందులో 4,51, 272 మంది ఉత్తీర్ణత సాధించారు.
టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు..
టెన్త్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు.. జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. అలాగే రీకౌంటింగ్‌కు 15 రోజులు వరకు అవకాశం ఉంటుంది. ప్రతి సజ్జెక్ట్‌కు రూ.500 చొప్పున చెల్లించాలన్నారు. అలాగే మీ ఆన్సర్ షీట్ ఫోటో కాపీ కోసం సబ్జెక్ట్‌కు రూ.1000 చొప్పున చెల్లించాలన్నారు. అలాగే రూ.1000 రుసుముతో రీవెరిఫికేషన్‌కు చేసుకోవచ్చు.