Tenth Class Paper Evaluation and Result Date : పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్.. అలాగే రిజల్డ్స్ ఎప్పుడంటే...?

ఈ పరీక్షలు ఏప్రిల్ 4వ తేదీన వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలు పూరైన వెంటనే పేపర్ల మూల్యాంకనం చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లలను చేస్తుంది.
5,09,403 మంది విద్యార్థులు పరీక్షలను..
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పదో తరగతి పరీక్షలకి 2650 పరీక్షా కేంద్రాల్లో... 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలను రాస్తున్నారు. పదో పరీక్షల నిర్వహణలో భాగంగా 2,650 మంది సీఎస్‌లు, డీవోలను, 28,100 మంది ఇన్విజిలేటర్ల పాల్గొన్నారు.
ఏప్రిల్ 7వ తేదీ నుంచే..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 19 వాల్యుయేషన్ కేంద్రాల్లో ఏప్రిల్ 7వ తేదీన నుంచి ఏప్రిల్ 15వ తేదీ వరకు సమాధాన పత్రాల స్పాట్ వాల్యుయేషన్ జరపనున్నారు. దీని కోసం సిబ్బందిని ఇప్పటికే విద్యాశాఖ నియమించింది.
ఫలితాలు విడుదల ఎప్పుడంటే..?
ఏప్రిల్ చివరి వారంలోనే.. టెన్త్ పబ్లిక్ పరీక్షల ఫలితాలను ఇవ్వాలని ఎస్ఎస్‌సీ బోర్డు భావిస్తోంది. అనివార్య కారణాల వల్ల ఆలస్యం అయితే... ఎట్టి పరిస్థితుల్లో మే మొదటి వారంలోపే ఫలితాలను విడుదల చేయనున్నారు.