Junagari Vasantha: మూత‘బడి’ని తెరిపించి.. ఇంటింటికి వెళ్లి విద్యార్థులను బడిలో చేర్పించారు

దండేపల్లి: సాధారణ ఉపాధ్యాయ బదిలీల్లో భాగంగా 2018లో జునగరి వసంత మండలంలోని లింగాపూర్‌ జీపీ పరిధి దుబ్బగూడ ప్రాథమిక పాఠశాలకు వచ్చారు.

అయితే విద్యార్థులు లేరని ఆ పాఠశాలను మూసేశారు. దీంతో మండల విద్యాశాఖ అధికారులు ఆమెను మరో పాఠశాలకు డెప్యూటేషన్‌ ఇచ్చారు.

ఇందుకు ఒప్పుకోని వసంత మూతపడిన పాఠశాలను తెరిపిస్తానని చెప్పి, ఇంటింటికి వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. వారిని ఒప్పించి 11 మందిని బడిలో చేర్పించారు. విద్యార్థులకు చక్కటి విద్యాబోధన చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉపాధ్యాయురాలిపై నమ్మకం పెరిగింది.

చదవండి: Book of Stories: ఉపాధ్యాయుడి ప్రోత్సాహంతో కథల పుస్తకం

దీంతో గ్రామంలోని పిల్ల లందరిని ప్రైవేటుకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తున్నారు. ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 18కి చేరింది. కాగా ఉపాధ్యాయురాలు పేద విద్యార్థులకు సొంత ఖర్చులతో నోట్‌బుక్కులు, పెన్నులు సైతం అందిస్తున్నారు.

#Tags