Collector Kumar Deepak: పదో తరగతి విద్యార్థులకు టీచర్ గా కలెక్టర్!

భీమారం: విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అర్థమయ్యే విధంగా విద్యాబోధన చేయాలని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఉపాధ్యాయులను ఆదేశించారు.

ఆగ‌స్టు 20న‌ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో మాట్లాడుతూ విద్యార్థులపై ఒత్తిడి లేకుండా బోధిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

ప్రైవేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పి స్తోందని అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమి టీల ద్వారా వివిధ పనులు చేపట్టినట్లు తెలిపా రు. పాఠ్యాంశాల బోధనలో కార్యాచరణ ప్రకా రంగా తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.

చదవండి: Integrated Gurukulas In Telangana: రాష్ట్రంలో రూ.5 వేల కోట్లతో సమీకృత గురుకులాల నిర్మాణం.. స్పష్టం చేసిన మంత్రి

తరగతిలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యే క దృష్టి సారించాలని తెలిపారు. పదో తరగతి వార్షిక ఫలితాల్లో ఉన్నతమైన ఫలితాల సాధన కు కృషి చేయాలని అన్నారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యపరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించి అవసరమైతే వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

అనంతరం పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి బోర్డుపై జవాబులు రాయించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించి సమయపాలన పాటించాలని టీచర్లను ఆదేశించారు.

#Tags