బాలలు.. కరాటే వీరులు

మెదక్‌ మున్సిపాలిటీ: ప్రస్తుత సమాజంలో విద్యార్థులు, మహిళలు స్వీయ రక్షణ పొందడానికి కరాటే (మార్షల్‌ ఆర్ట్స్‌) మనోధైర్యాన్ని పెంచుతుంది.

దీంతో వారంతా యుద్ధ విద్యపై మక్కువ చూపుతున్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లలకు కరాటే నేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మగవారితో ధీటుగా ఆడపిల్లలను కరాటేలో తీర్చిదిద్దుతున్నారు.

చదవండి: Schools And Colleges Reopen In Bangladesh: నెల రోజుల తర్వాత తెరుచుకున్న విద్యసంస్థలు.. ఎందుకంటే!

పాఠశాలలు, కళాశాలల్లో అమ్మాయిలపై జరుగుతున్న ఆకృత్యాలను తిప్పి కొట్టేందుకు కరాటే వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది. మెదక్‌ జిల్లా కేంద్రంలో వందలాది మంది విద్యార్థినిలు కరాటేలో శిక్షణ పొందుతున్నారు. అలాగే గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ప్రభుత్వం 3 నెలల పాటు శిక్షణ ఇప్పిస్తుంది.

#Tags