SSC Exam 2024 Revised Calendar: పరీక్షల తేదీల్లో కీలక మార్పులు చేసిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి స్టాప్‌ సెలక్షన్‌ కమిషన్‌ పలు పరీక్షల తేదీల్లో కీలక మార్పులను చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కొత్త పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. దీంతో పాటు సీహెచ్ఎస్‌ఎల్‌కు సంబంధించి కొత్త పరీక్షల తేదీలను వెల్లడించింది.

జూన్‌ 4,5,6 తేదీల్లో జరగాల్సిన జూనియర్‌ ఇంజనీర్‌ పరీక్షలను జూన్‌ 5,6,7 తేదీల్లో నిర్వహించనున్నారు. మే 9,10,13 తేదీల్లో జరగాల్సిన (ఎస్ఐ, సీఏపీఎఫ్) పరీక్షలను జూన్‌ 27,28,29 తేదీలకు వాయిదా వేశారు. ఇక సీహెచ్‌ఎస్‌ ఎల్‌ పరీక్షలను జులై 1-12వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 

కొత్తగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం..

  • జూన్‌ 4, 5, 6 తేదీల్లో నిర్వహించాల్సిన జూనియర్ ఇంజినీర్ పేపర్-1 పరీక్షను జూన్ 5, 6 7 తేదీల్లో నిర్వహించనున్నారు.
  • మే 6, 7, 8 తేదీల్లో నిర్వహించాల్సిన సెలక్షన్ పోస్టుల పరీక్ష (ఫేజ్ – XII) పేపర్-1 పరీక్షను జూన్ 24, 25, 26 తేదీల్లో నిర్వహించనున్నారు. 
  • మే 9, 10, 13ల్లో జరగాల్సిన ఢిల్లీ పోలీస్ (ఎస్ఐ, సీఏపీఎఫ్) పేపర్-1 పరీక్షను జూన్ 27, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. 
  • కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ (CHSL)-2024 పేపర్-1 పరీక్షను జులై 1 - 5 వరకు, జులై 8 - 12 వరకు నిర్వహించనున్నారు.

#Tags