SSC Jobs Application Date Extended 2024 : 8,326 ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడిగింపు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : కేంద్ర మంత్రిత్వ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులను స్వీక‌రిస్తుంది.

అయితే ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు గ‌డువును పొడిగించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగ‌స్టు 3వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ ఆగ‌స్టు 04. దరఖాస్తు సవరణను ఆగ‌స్టు 16, 17వ తేదీల్లో చేసుకోవ‌చ్చును.

అర్హతలు ఇవే..
పదో తరగతి/మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి : 
01-08-2024 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 
ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ప‌రీక్షావిధానం :
సెషన్-I : 
న్యూమరికల్ అండ్‌ మ్యాథమెటికల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు/ 60 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్ సాల్వింగ్ (20 ప్రశ్నలు/ 60 మార్కులు). ప్రతి సెషన్ 45 నిమిషాలు.

సెషన్-II : 
జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు). ప్రతి సెషన్ 45 నిమిషాలు.

దరఖాస్తు ఫీజు : 
రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

#Tags