Constable Physical Test: ఏప్రిల్ 24 నుంచి కానిస్టేబుల్ ఫిజిక‌ల్ ఎఫిషియెన్సీ టెస్ట్‌.. అడ్మిట్ కార్డ్ కోసం క్లిక్ చేయండి

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) గతేడాది నవంబర్‌లో వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి పోస్టుల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఉద్యోగాల‌కు పదో తరగతే విద్యార్హత. దీంతో ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఎస్‌ఎస్‌సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను నిర్వహించగా ఇటీవల ఫలితాలు వెలువడ్డాయి.
Constable Physical Test

ఈ నేపథ్యంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్‌) తాజాగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్ష తేదీలను ప్రకటించింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్‌టీ/ పీఈటీలను ఏప్రిల్‌ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్‌పీఎఫ్‌ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. అడ్మిట్ కార్డు లేకుండా శారీరక సామర్థ్య పరీక్షలకు అభ్యర్థులను అనుమతించరు. శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. 
నోట్‌: www.crpfonline.com సైట్‌లో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు.

చ‌ద‌వండి: 50,187 కానిస్టేబుల్ పోస్టులు.. ఎంపికైతే రూ.69,100 వ‌ర‌కు జీతం.. అర్హ‌త‌లు ఇవే..

#Tags