Facilities in Schools: పాఠ‌శాల‌ల్లో మ‌ర‌మ్మ‌త్తుల ప‌నుల‌కు ప్ర‌ణాళిక‌తో పూర్తి చేయాలి..

ఆద‌ర్శ పాఠ‌శాల‌ల్లో మర‌మ్మ‌త్తుల‌కు మిగిలి ఉన్న ప‌నుల‌ను అధికారులు ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం పూర్తి చేయాల‌ని ఆదేశించారు క‌లెక్ట‌ర్ అనురాగ్ జ‌యంతి..

సిరిసిల్ల: అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఎంపికైన స్కూళ్లలో మరమ్మతు పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాలలు, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పనపై ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ ఈఈలతో కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి గురువారం వీడియో కన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

New Courses at ITI: ప్రభుత్వ ఐటీఐలో ఆరు నూతన కోర్సులు

స్కూళ్లలో విద్యుత్‌ సరఫరాలో లోపాలు సరిచేయాలని, ఫ్యాన్లు లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరుగుదొడ్ల వద్ద నీటి సరఫరా సరిగ్గా ఉందా.. లేదా.. చూసుకోవాలని సూచించారు. తాగునీటి ట్యాంకు వద్ద నల్లాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. నీటివసతి, టెంటు, ఎన్నికల సిబ్బందికి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, ఎన్‌.ఖీమ్యానాయక్‌, జెడ్పీ సీఈవో ఉమారాణి, డీపీవో వీరబుచ్చయ్య, డీఈవో రమేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

United Nations General Assembly: పాలస్తీనాకు భారత్‌ మద్దతు.. సభ్యత్వం ఇచ్చిన ఐక్యరాజ్యసమితి!!

#Tags