Schools and Colleges Holiday On June 17th : రేపు స్కూల్స్‌, కాలేజీల‌కు సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. ఎందుకంటే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం స్కూల్స్‌, కాలేజీల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇటీవ‌లే జూన్ 17వ తేదీన స్కూల్స్ ప్రారంభ అయిన విష‌యం తెల్సిందే. స‌రిగ్గా నాలుగు రోజుల‌కే మ‌రో రోజు స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వును ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

ఇదే రోజు ప్ర‌భుత్వ‌, కొన్ని ప్రైవేట్ కార్యాల‌యాల‌కు కూడా సెల‌వు ఇచ్చారు.  బక్రీద్ పండ‌గ సంద‌ర్భంగా ప్రభుత్వం ఈ సెల‌వును ఇచ్చింది. బక్రీద్ ఘనంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. అయితే జూన్ 17వ తేదీన సోమ‌వారం.. అలాగే జూన్ 16వ తేదీన ఆదివారం వ‌చ్చింది. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల‌కు సెలవులతో ఎంజాయ్ చేస్తున్నారు. జూన్ 25వ తేదీన ఈద్-ఎ -గదీర్‌కు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్‌లో 12వ నెల అయిన దుల్ హిజ్జా 10వ తేదీన బక్రీద్ జరుపుకుంటారని చెబుతున్నారు.

➤ July 27, 28th Holidays : జూలై 27వ తేదీన‌ సెలవు ప్రకటించిన ప్రభుత్వం.. కార‌ణం ఇదే..

#Tags