AP Schools Summer Holidays Extended 2024 : ఏపీలో స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు పొడిగింపు.. కార‌ణం ఇదే.! మొత్తం ఎన్ని రోజులంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్కూల్స్‌కి వేస‌వి సెల‌వుల‌ను పొడిగించారు. ఈ మేర‌కు రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీలో స్కూల్స్‌ను జూన్ 12వ తేదీన (బుధ‌వారం) పునఃప్రారంభం కావాల్సి ఉంది.

 
ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ఈ కీల‌క‌ నిర్ణయం తీసుకుంది.  సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జూన్ 13వ తేదీన (గురువారం) పాఠశాలలు తెరుచుకోనున్నాయి.

అలాగు స్కూల్స్‌, కాలేజీల‌కు జూన్ 17వ తేదీన(సోమ‌వారం) సెల‌వు ఉండే అవ‌కాశం ఉంది. అలాగే ఇదే రోజు ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ కార్యాల‌యాల‌కు కూడా సెల‌వు ఇవ్వ‌నున్నారు. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ ప్రభుత్వం సెలవు ఇవ్వ‌నున్నారు. అయితే బక్రీద్ జూన్ 17న జరుపుకుంటారా లేదా జూన్ 18 జరుపుకుంటారా అనేది క్లారిటీ లేదు. దీంతో బక్రీద్ ఎప్పుడు జరుపుకుంటే అప్పుడు సెలవు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. 17న జరుపుకుంటే ఆ రోజు లేదా 18న జరుపుకుంటే ఆ రోజు సెలవు ఇస్తారు. బక్రీద్ ఘనంగా జరుపుకోవడానికి ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. అయితే జూన్ 17వ తేదీన సోమ‌వారం.. అలాగే జూన్ 16వ తేదీన ఆదివారం ఉంది. దీంతో వ‌రుస‌గా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలు, ఆఫీసుల‌కు సెలవులు రానున్నాయి.

2024లో సెల‌వులు వివ‌రాలు ఇవే...

☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్

#Tags