School Assistant Exam 2024 Syllabus & Exam pattern : తెలంగాణ‌లో 2629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌.. సిల‌బ‌స్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో 11,062 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. అయితే అత్యధికంగా 6,508 ఎస్‌జీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఆ త‌ర్వాత 2629 స్కూల్‌ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలో స్కూల్‌ అసిస్టెంట్ అర్హ‌త‌లు ఏమిటి..? ప‌రీక్షావిధానం ఎలా ఉంటుంది..? స్కూల్‌ అసిస్టెంట్ సిల‌బ‌స్ ఏమిటి..? ఉద్యోగం కొట్టాలంటే.. స‌క్సెస్ ప్లాన్ ఏమిటి..? మొద‌లైన స‌మ‌గ్ర‌ అంశాల‌పై ప్ర‌త్యేక క‌థ‌నం మీకోసం..  

స్కూల్‌ అసిస్టెంట్స్ అర్హ‌త‌లు ఇవే..
స్కూల్‌ అసిస్టెంట్స్‌కు సంబంధిత సబ్జెక్ట్‌లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీగా బీఈడీ ఉత్తీర్ణత ఉండాలి(లేదా) యాభై శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్ట్‌తో నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ పాసవ్వాలి. దీంతోపాటు సంబంధిత సబ్జెక్ట్‌తో టెట్‌ పేపర్‌-2లో అర్హత సాధించాలి. 

☛ TS SGT Exam 2024 Syllabus & Exam pattern : 6,508 ఎస్జీటీలు పోస్టులు.. సిల‌బ‌స్ ఇదే.. ఈ సారి ప‌రీక్షా విధానం కూడా..

స్కూల్‌ అసిస్టెంట్స్ ప‌రీక్షా విధానం :
స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్ట్‌లకు కూడా 160 ప్రశ్నలతో 80 మార్కులకు పరీక్ష జరుగుతుంది. జీకే అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌(20 ప్రశ్నలు-10 మార్కులు); విద్యా దృక్పథాలు (20 ప్రశ్నలు-10 మార్కులు); సంబంధిత సబ్జెక్ట్‌ కంటెంట్‌ (88 ప్రశ్నలు-44 మా­ర్కులు); టీచింగ్‌ మెథడాలజీ (32 ప్రశ్నలు-16 ప్రశ్నలు) విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఈ సారి పరీక్షను ఆన్‌లైన్‌ టెస్ట్‌గా నిర్వహించే వీలుంది. పరీక్షకు లభించే సమయం రెండున్నర గంటలు.

స్కూల్‌ అసిస్టెంట్‌.. ప్రతి సబ్జెక్ట్‌ను ఇలా చ‌ద‌వాలి..

☛ స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న సబ్జెక్ట్‌ పరంగా ప్రత్యేక దృక్పథంతో చదవాలి.
☛ సోషల్‌ స్టడీస్‌ ఎస్‌ఏ పోస్ట్‌లకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు : 
కంటెంట్‌ పరంగా.. భూగోళశాస్త్రం: సౌర కుటుంబం-భూమి; భూ ఉపరితల స్వరూపాలు-వర్గీకరణ; ప్రపంచ ప్రకృతి సిద్ధ మండలాలు; ఖండాలు; భారతదేశ ఉనికి-భౌతిక అమరిక; వాతావరణం; సముద్రాలు; తెలంగాణ భౌగోళిక అంశాల గురించి అవగాహన పొందాలి. చరిత్రకు సంబంధించి మధ్యయుగప్రపంచం; ప్రాచీన భారతీయ నాగరికతలు; ఢిల్లీ సుల్తానులు; మొఘలుల సామ్రాజ్యం; భారతదేశంలో స్వాతంత్య్ర ఉద్యమం; ఆధునిక ప్రపంచం; ఆర్థిక, సామాజిక రంగాల్లో మార్పులపై ప్రత్యేక దృష్టితో చదవాలి. పౌరశాస్త్రంలో భారత రాజ్యాంగం; లౌకికత్వం-భారతదేశం; ప్రపంచ శాంతి-భారతదేశం పాత్ర; ఐక్యరాజ్య సమితి-విధి విధానాలపై అవగాహన పొందాలి. ఎకనామిక్స్‌ నుంచి ద్రవ్యోల్బణం; ఆర్థికాభివృద్ధి; భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు; జాతీయ ఆదాయం; ద్రవ్యం వంటి బేసిక్‌ కాన్సెప్ట్స్‌పై అవగాహన పొందాలి. సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీలో సాంఘిక అధ్యయన బోధనా ఉద్దేశాలు; విలువలు; విద్యా ప్రణాళిక; ఉపాధ్యాయుడు; బోధ నోపకరణాలు; మూల్యాంకనం తదితర పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

మ్యాథమెటిక్స్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు : 
కంటెంట్‌ పరంగా బీజ గణితం, వ్యాపార గణితం, క్షేత్ర గణితం, రేఖా గణితం, త్రికోణమితి, శ్రేఢులు, సమితులు-సంబంధాలు వంటి అంశాలపై పట్టుసాధించాలి. మెథడాలజీలో.. గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు, బోధనా విలువలు, బోధనా ప్రణాళిక, బోధనా పద్ధతులు, మూల్యాంకనం వంటి పాఠ్యాంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. 

బయాలజీ స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు : 
కంటెంట్‌ పరంగా.. జీవ శాస్త్రం-ఆధునిక పద్ధతులు, జీవ ప్రపంచం, సూక్ష్మ జీవుల ప్రపంచం, జంతు ప్రపంచం వంటి అంశాలపై అవగాహన పెంచుకోవాలి. ఈ సబ్జెక్ట్‌లో మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా లక్ష్యాలు, విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక, జీవశాస్త్ర ఉపగమాలు-పద్ధతులు గురించి తెలుసుకోవాలి. 

ఫిజికల్‌ సైన్సెస్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ అభ్యర్థులు : 
మెజర్‌మెంట్స్, యూనిట్స్, డైమెన్షన్స్, సహజ వనరులు, మన విశ్వం, కాంతి సిద్ధాంతం, ఉష్ణం, ధ్వని విభాగాలకు సంబంధించి ఉండే అన్ని అంశాలను అప్లికేషన్‌ విధానంలో నేర్చుకోవాలి. అదే విధంగా అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశాలపై లోతైన అవగాహన పెంచుకోవాలి. ఫిజికల్‌ సైన్సెస్‌లో మెథడాలజీకి సంబంధించి బోధన పరికరాలు, మూల్యాంకన పద్ధతులు, బోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాలపై పట్టు సాధించాలి.

ముఖ్య‌మైన తేదీలు ఇవే..
మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన తేదీలను సర్కారు త్వరలో ప్రకటించనుంది. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ తెలిపారు. 
తెలంగాణ స్కూల్‌ అసిస్టెంట్స్ (SA) సిల‌బ‌స్‌, ప‌రీక్షావిధానం ఇదే..

#Tags