అలంకారాలు - మాదిరి ప్రశ్నలు
శబ్ద ప్రధానమైనవి శబ్దాలంకారాలు. శబ్ద వైచిత్రీ రామణీయకత చేత కావ్యానికి సౌందర్యాన్ని చేకూర్చేవి శబ్దాలంకారాలు. సంగీతానుగుణ్యమైన శ్రవణ లాలిత్యంతో పాఠకులకు ఆహ్లాదం కలిగించే శబ్దాలంకారాలు.
ఇవి ఆరు విధాలు..
1) వృత్త్యానుప్రాసం
2) ఛేకానుప్రాసం
3) లాటానుప్రాసం
4) అంత్యానుప్రాసం
5) యమకం
6) ముక్తపదగ్రస్థం
అర్థాలంకారాలు: అర్థ సౌందర్యం చేత కావ్య శోభను ద్విగుణీకృతం చేసేవి అర్థాలంకారాలు. అర్థం లేని శబ్ద సౌందర్యం ఆహ్లాదకరం కాదు. అర్థ ప్రధానమైన అలంకారాలు అర్థాలంకారాలు. ఉపమ, రూపకం ఉత్ప్రేక్ష మొదైలైనవన్నీ అర్థాలంకారాలు.
1) మమ్మటుడు
2) భోజుడు
3) విద్యానాథుడు
4) రుయ్యకుడు
- View Answer
- సమాధానం: 2
2. భరతుడు నాట్య శాస్త్రంలో పేర్కొనని అలంకారం?
1) ఉపమా రూపకం
2) దీపకం
3) యమకం
4) ఉత్ప్రేక్ష
- View Answer
- సమాధానం: 4
3. కింది వాటిలో సరికానిది ఏది?
1) దండి పేర్కొన్న అలంకారాల సంఖ్య-34
2) మమ్మటుడు పేర్కొన అలంకారాల సంఖ్య-56
3) విశ్వనాథుడు పేర్కొన్న అలంకారాల సంఖ్య-66
4) భట్టుమూర్తి పేర్కొన్న అలంకారాల సంఖ్య-87
- View Answer
- సమాధానం: 3
4. చంద్రా లోకంలో 100 అలంకారాలను పేర్కొన్న అలంకారికుడు?
1) భామహుడు
2) జయదేవుడు
3) అప్పయ్య దీక్షితులు
4) భట్టుమూర్తి
- View Answer
- సమాధానం: 2
5. కేవలం అలంకారాల కోసం ‘అలంకార సర్వస్వం’ అనే ప్రామాణిక గ్రంథాన్ని రాసిన అలంకారికుడు?
1) విశ్వనాథుడు
2) దండి
3) రుయ్యకుడు
4) జయదేవుడు
- View Answer
- సమాధానం: 3
6. ‘కువలయానంద’కారుడైన అప్పయ్య దీక్షితులు పేర్కొన్న అలంకారాల సంఖ్య?
1) 66
2) 38
3) 100
4) 124
- View Answer
- సమాధానం: 4
7. బమ్మెర పోతనకు ఇష్టమైన శబ్దాలంకారం?
1) యమకం
2) ఛేకానుప్రాసం
3) వృత్త్యానుప్రాసం
4) లాటానుప్రాసం
- View Answer
- సమాధానం: 3
8.‘హరి హరి సిరియురమున గలహరి’- ఇందులో ఉన్న శబ్దాలంకారం?
1) ఛేకానుప్రాసం
2) వృత్త్యానుప్రాసం
3) లాటానుప్రాసం
4) యమకం
- View Answer
- సమాధానం: 2
9. జతపరచండి.
జాబితా-I
a) ఒకే వర్ణం లేదా రెండు, మూడు వర్ణాలు అనేకసార్లు పునరుక్తాలై ఆహ్లాదం కలిగిస్తే అది
b) అర్థ భేదంతో రెండేసి హల్లుల జంటలు అవ్యవధానంగా ఆవృత్తమై ఆహ్లాదం కలిగిస్తే అది
c) అర్థ భేదం లేకుండా తాత్పర్య భేదంతో కూడిన రెండేసి హల్లుల జంటలు వెంట వెంటనే ప్రయోగిస్తే అది
d) సమానమైన స్వర సహితాలైన హల్లులు అవ్యవహితంగా పునరుక్తాలైతే అది
జాబితా-II
i) ఛేకానుప్రాసం
ii) వృత్త్యానుప్రాసం
iii) యమకం
iv) లాటానుప్రాసం
1) a-ii, b-iii, c-i, d-iv
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-i, b-ii, c-iii, d-iv
4) a-ii, b-i, c-iii, d-iv
- View Answer
- సమాధానం: 2
10. ‘కందర్ప దర్పములగు సుందర దరహాసరుచులు’ ఇందులో ఉన్న అలంకారం?
1) లాటానుప్రాసం
2) వృత్త్యానుప్రాసం
3) ఛేకానుప్రాసం
4) అంత్యానుప్రాసం
- View Answer
- సమాధానం: 3
11. ‘మనసుభద్ర మనసుభద్రమయ్యె’ఇందులో ఉన్న అలంకారం?
1) అంత్యానుప్రాసం
2) యమకం
3) లాటానుప్రాసం
4) ఛేకానుప్రాసం
- View Answer
- సమాధానం: 2
12. ‘కమలాక్షు నర్చించుకరములు కరములు’ ఇందులో ఉన్న అలంకారం?
1) వృత్త్యానుప్రాసం
2) ఛేకానుప్రాసం
3) లాటానుప్రాసం
4) అంత్యానుప్రాసం
- View Answer
- సమాధానం: 3
13. జతపరచండి.
జాబితా-I
a) ఉపమాన ఉపమేయాలకు మనోహరమైన సాదృశ్యాన్ని వర్ణిస్తే అది ఏ అలంకారం
b) ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపిస్తే లేదా ఉపమాన ఉపమేయాలకు ఆ భేదాన్ని వర్ణిస్తే అది ఏ అలంకారం
c) జాతి, గుణ ధర్మసామ్యం చేత ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఏ అలంకారం
d) ఉపమాన ఉపమేయాలందున్న భిన్న ధర్మాలను బింబ ప్రతిబింబ భావంతో చెబితే అది ఏ అలంకారం
జాబితా&II
i) రూపకం
ii) ఉపమాలంకారం
iii) దృష్టాంతాలంకారం
iv) ఉత్ప్రేక్షాలంకారం
1) a-i, b-ii, c-iv, d-iii
2) a-ii, b-i, c-iii, d-iv
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-iii, c-ii, d-iv
- View Answer
- సమాధానం: 3
14. ఒక వాక్యంలో అనేక అర్థాలు వచ్చేలా పదాలను మార్చడాన్ని ఏ అలంకారమంటారు?
1) సమాసోక్తి
2) ఉత్ప్రేక్ష
3) శ్లేష
4) అనన్వయం
- View Answer
- సమాధానం: 3
15. ‘రాజు కువలయానందకరుడు’ వాక్యంలో ఉన్న అలంకారం?
1) రూపకం
2) దీపకం
3) అర్థాంతరన్యాసం
4) శ్లేష
- View Answer
- సమాధానం: 4
16. పద్యంలో మొదటి పాదం చివరి పదాన్ని రెండో పాదంలో మొదటి పదంగా, రెండో పాదంలో చివరి పదాన్ని మూడో పాదంలో మొదటి పదంగా, మూడో పాదంలో చివరి పదాన్ని నాల్గో పాదంలో మొదటి పదంగా ప్రయోగిస్తే అది ఏ అలంకారం?
1) ఛేకానుప్రాసం
2) అంత్యానుప్రాసం
3) ముక్తపదగ్రస్థం
4) యమకం
- View Answer
- సమాధానం: 3
17. సుదతీ నూతన మదనా/మదనాగతురంగపూర్ణ మణిమయ సదనా సదనామయ గజరదనా/రదనాగేంద్ర శుభ కీర్తి రస నరసింహా ఈ పద్యంలో అలంకారం?
1) అంత్యానుప్రాసం
2) అనుప్రాసం
3) యమకం
4) ముక్తపదగ్రస్థం
- View Answer
- సమాధానం: 4
18.సామాన్యాన్ని విశేషం చేతగాని, విశేషాన్ని సామాన్యం చేతగాని సమర్థిస్తే అది ఏ అలంకారం?
1) అర్థాంతరన్యాసం
2) అతిశయోక్తి
3) స్వభావోక్తి
4) విశేషోక్తి
- View Answer
- సమాధానం: 1
19. ‘కలడు మేదిని యందు గలడుదకంబులౌగలడు వాయువునందు గలడు’ ఈ వాక్యాల్లో ఉన్న అలంకారం?
1) లాటానుప్రాసం
2) వృత్త్యానుప్రాసం
3) అంత్యానుప్రాసం
4) ఛేకానుప్రాసం
- View Answer
- సమాధానం: 2
20. ‘హరి భజియించు హస్తములు హస్తములు’ ఈ వాక్యంలో ఉన్న అలంకారం?
1) ఛేకానుప్రాసం
2) లాటానుప్రాసం
3) అంత్యానుప్రాసం
4) అనుప్రాసం
- View Answer
- సమాధానం: 2
21. ‘ఇది ఆకలి రాజ్యం/నిరుపేదల కేకల రాజ్యం/ నీతిలేని పేకల రాజ్యం/దోపిడీ నేతల దౌర్జన్య రాజ్యం’ ఇందులో ఉన్న అలంకారం?
1) యమకం
2) అంత్యానుప్రాసం
3) అనుప్రాసం
4) ఛేకానుప్రాసం
- View Answer
- సమాధానం: 2
22. ‘ఆంజనేయుడు సముద్రాన్ని దాటాడు!
మహాత్ములకు దుస్తరమైంది లేదు గదా!’
పై వాక్యాల్లో ఉన్న అలంకారం?
1) అతిశయోక్తి
2) అనన్వయాలంకారం
3) అర్థాంతరన్యాసం
4) ఉత్ప్రేక్ష
- View Answer
- సమాధానం: 3
23. లోక స్థితిని మించి అతిశయించి వర్ణిస్తే అది ఏ అలంకారం?
1) అతిశయోక్తి
2) స్వభావోక్తి
3) సహజోక్తి
4) అనన్వయాలంకారం
- View Answer
- సమాధానం: 1
24.ప్రస్తుత వర్ణన చేత అప్రస్తుత విషయం స్ఫురిస్తే అది ఏ అలంకారం?
1) అర్థాంతరన్యాసం
2) అతిశయోక్తి
3) సమాసోక్తి
4) విశేషోక్తి
- View Answer
- సమాధానం: 3
25. ‘మాధవీ పున్నాగముల పెండ్లి సేయంగరారో చెలులారా!’ అనే వాక్యంలో అలంకారం?
1) స్వభావోక్తి
2) సమాసోక్తి
3) అతిశయోక్తి
4) రూపకం
- View Answer
- సమాధానం: 2
26. జాతి గుణ క్రియాదుల స్వభావాలను ఉన్నది ఉన్నట్లు సహజసిద్ధంగా మనోహరంగా వర్ణిస్తే అది ఏ అలంకారం?
1) అతిశయోక్తి
2) విశేషోక్తి
3) స్వభావోక్తి
4) అర్థాంతరన్యాసం
- View Answer
- సమాధానం: 3
27. ‘ఆ ఉద్యాన వనంలో లేళ్లు చెవులు రిక్కించి, చంచల నేత్రాలతో గంతులేస్తున్నాయి’ ఇందులో అలంకారం?
1) అతిశయోక్తి
2) స్వభావోక్తి
3) ఉపమా
4) ఉత్ప్రేక్ష
- View Answer
- సమాధానం: 2
28. ఒక విషయాన్ని సాటిలేనిదని వర్ణించడానికి దాన్నే ఉపమానంగా గ్రహించి వర్ణిస్తే అది ఏ అలంకారం?
1) అతిశయోక్తి
2) రూపకం
3) అనన్వయం
4) దీపకం
- View Answer
- సమాధానం: 3
29. ‘మేరు నగమునకు సాటి మేరు నగమే
సముద్రానికి సాటి సముద్రమే’ ఇందులో అలంకారం?
1) అర్థాంతరన్యాసం
2) అనన్వయం
3) అతిశయోక్తి
4) రూపకం
- View Answer
- సమాధానం: 2
30. ‘రాజ బింబస్య రుక్మిణి తేజరిల్లె సానబట్టిన మకరాంకుశస్త్రమనగ’ అనే వాక్యాల్లో అలంకారం?
1) ఉత్ప్రేక్ష
2) రూపకం
3) ఉపమా
4) అర్థాంతరన్యాసం
- View Answer
- సమాధానం: 3
31. జతపరచండి.
జాబితా-I
a) సాదృశ్యం వల్ల ఒక వస్తువును చూసి మరొక వస్తువుగా భ్రమిస్తే అది ఏ అలంకారం
b) కారణం లేకుండా కార్యం జరిగినట్లు వర్ణిస్తే అది ఏ అలంకారం
c) ప్రకృతాలకు అప్రకృతాలకు ధర్మైక్యం చెప్పడం ఏ అలంకారం
d) ఒక వస్తువును అనేక విధాలుగా భావిస్తే అది ఏ అలంకారం
జాబితా-II
i) విభావన
ii) భ్రాంతిమదలంకారం
iii) ఉల్లేఖం
iv) దీపకం
1) a-iii, b-ii, c-iv, d-i
2) a-ii, b-i, c-iii, d-iv
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 3
32. ‘ఆ తోరణం శత్రువులతో రణానికి కారణమైంది’. ఇందులో అలంకారం?
1) వృత్త్యానుప్రాసం
2) యమకం
3) ముక్తపదగ్రస్థం
4) అంత్యానుప్రాసం
- View Answer
- సమాధానం: 2
33. ‘కటకట ధరణీ కటితట పటమనిపించుకొన’
ఈ పాదంలో ఉన్న అలంకారం ఏది?
1) ఛేకానుప్రాసం
2) వృత్త్యానుప్రాసం
3) అనుప్రాసం
4) లాటానుప్రాసం
- View Answer
- సమాధానం: 2
34. ‘అలంకారాలు అంటే కావ్య శరీరానికి అందాన్ని చేకూర్చేవి’ అని చెప్పిన అలంకారికుడు?
1) భామహుడు
2) భరతుడు
3) రాజశేఖరుడు
4) రుయ్యకుడు
- View Answer
- సమాధానం: 3
35.‘తల్లి ప్రేమలాంటి చల్లని నీడనిచ్చే వేప చెట్టు’ ఈ వాక్యంలో ఉన్న అలంకారం?
1) అతిశయోక్తి అలంకారం
2) ఉపమాలంకారం
3) యమకాలంకారం
4) రూపకాలంకారం
- View Answer
- సమాధానం: 2
36. హల్లుల జంట అర్థభేదంతో అవ్యవధానంగా వచ్చే అలంకారం?
1) యమకం
2) వృత్త్యానుప్రాసం
3) ఛేకానుప్రాసం
4) లాటానుప్రాసం
- View Answer
- సమాధానం: 3
37. కవి ఆత్మీయతా ముద్ర కింది వాటిలో దేనిలో ప్రతిఫలిస్తుంది?
1) అలంకారం
2) శైలి
3) పాకం
4) రసం
- View Answer
- సమాధానం: 2
38.వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉన్నట్లు వర్ణిస్తే?
1) స్వభావోక్తి అలంకారం
2) దృష్టాంతాలంకారం
3) అర్థాంతరన్యాసాలంకారం
4) ప్రతీపాలంకారం
- View Answer
- సమాధానం: 2
39. ‘కడవతో వడివడిగా గడపదాటెందొక పడతి’ దీనిలో ఉన్న అలంకారం?
1) వృత్త్యానుప్రాసం
2) యమకం
3) ఉత్ప్రేక్ష
4) లాటానుప్రాసం
- View Answer
- సమాధానం: 1
40. ఇంటి పైకప్పును తుపాను ఎగరగొట్టినట్లుగా, నా మొహాన్ని ఏదో బలంగా తాకింది?
1) రూపకం
2) అర్థాంతరన్యాసం
3) అతిశయోక్తి
4) ఉపమాలంకారం
- View Answer
- సమాధానం: 4
41.దృష్టాంతాలంకార లక్షణం?
1) ఉపమాన ఉపమేయాల మధ్య అభేదం
2) జాతి, గుణ క్రియాదుల వర్ణన
3) విడిచిపెట్టిన పదాన్ని గ్రహించడం
4) వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం
- View Answer
- సమాధానం: 4
42. ‘రఘువరేణ్య క్రోధ రసము లంకకుముట్ట/ గ్రొవ్వారు కాలువ ద్రవ్వెననగ’ ఈ పద్య పాదాల్లో అలంకారం?
1) అర్థాంతరన్యాసం
2) రూపకాలంకారం
3) ఉత్ప్రేక్ష
4) అతిశయోక్తి
- View Answer
- సమాధానం: 3
43. ‘ఓ రాజా! నీవే కీర్తిమంతుడవు- చంద్రుడే కాంతిమంతుడు- ఇందులో అలంకారం?
1) దృష్టాంత
2) దీపకం
3) అనన్వయం
4) అతిశయోక్తి
- View Answer
- సమాధానం: 1
44. ‘అడిగెదనని కడువడిజను, నడిగిన తన మగడునుడవడని నడయుడుగున్’?
1) అనుప్రాసం
2) ఛేకానుప్రాసం
3) యమకం
4) వృత్త్యనుప్రాసం
- View Answer
- సమాధానం: 4
45. ‘మిమ్ములను మాధవుడు రక్షించుగాక! - ఈ వాక్యంలో అలంకారం?
1) శ్లేష
2) రూపకం
3) ఉత్ప్రేక్ష
4) అతిశయోక్తి
- View Answer
- సమాధానం: 1
46.‘మా పట్టణంలోని భవనాలు సూర్య చంద్రులను తాకుతున్నాయి’-పై వాక్యంలోని అలంకారం?
1) స్వభావోక్తి
2) అతిశయోక్తి
3) విరోధా భాసం
4) వక్రోక్తి
- View Answer
- సమాధానం: 2
47. ‘దను జూడ శేషుండు తలుపులు తెఱచిన బలిమందిరంబు వాకిలియొయనగ’ ఇందులో ఉన్న అలంకారం?
1) ఉపమా
2) రూపకం
3) ఉత్ప్రేక్ష
4) స్వభావోక్తి
- View Answer
- సమాధానం: 3
48. ‘విశేషాంశం-సామాన్యాంశం’ అనే రెండింటిలో ప్రవర్తించే అలంకారం?
1) ఉత్ప్రేక్ష
2) అర్థాంతరన్యాసం
3) వ్యాజస్తుతి
4) రూపకం
- View Answer
- సమాధానం: 2