Indian Railways TC Jobs 2024 : యువతకు శుభ‌వార్త‌.. రైల్వేలో 11,250 టికెట్ కలెక్టర్ పోస్టులకు నోటిఫికేష‌న్..! అర్హ‌త‌లు..ఎంపిక విధానం ఇలా...!

సాక్షి ఎడ్యుకేషన్ : అదిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అయిన భారతీయ రైల్వే నిరుద్యోగుల‌కు భారీగా ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. భారీగా టికెట్ కలెక్టర్ ఉద్యోగాల‌ భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు సిద్దమైంది.

ఇప్పటికే లక్షలాదిమందికి ప్రత్యక్షంగా ఉద్యోగం, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న రైల్వే తాజాగా మరింతమంది నిరుద్యోగ యువతకు జీవితంలో స్థిరపడే అవకాశం కల్పిస్తోంది. భారీ ఉద్యోగాల భర్తీకి ఇండియన్స్ రైల్వేస్ నోటిఫికేషన్ విడుదలకు సిద్దమైంది. 

➤☛ RRC Northern Railway Apprenticeship Notification 2024 : రైల్వేలో 4,096 ఖాళీలు.. ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా.. !

11,250 టీసీ పోస్టుల భర్తీకి..
తాజాగా రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ (RRB) 11,250 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దమైంది. దీంతో రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న యువతీయువకులతో పాటు నిరుద్యోగులు కూడా ఈ ఉద్యోగాలను సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీసీ పోస్టుల భర్తీకి ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఏదయినా కారణాలతో ఆలస్యమైన వచ్చేనెల సెప్టెంబర్ లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభంకానుంది.
 
టీసీ అర్హతలు ఇవే.. :  

రైల్వే టీసీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల‌ నుంచి 30 ఏళ్లలోపు వుండాలి. అయితే ఎస్సీ , ఎస్టీ ,ఓబీసీ అభ్యర్థులకు వయో సడలింపు వుంటుంది.

విద్యార్హతలు ఇవే..

భారతీయులై ఉంది.. నిర్దేశిత వయసు, విద్యార్హతలు వున్నవారు ఈ రైల్వే టీసీ పోస్టులకు అర్హులు. ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ విద్యార్హతలు కలిగి వుండాలి. విద్యార్హతలను కూడా నోటిఫికేషన్‌లో ఇవ్వ‌నున్న‌ది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు. 

జీతం : 
నెలకు రూ.35,000 వేల జీతం పొందవచ్చు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌లో పూర్తి వివరాలను తెలియనున్నారు. 

పూర్తి వివ‌రాలను..

రైల్వే టీసీ ఉద్యోగాల కోసం అభ్యర్థుల బౌతిక ప్రమాణాలను కూడా పరిశీలిస్తారు. అంటే నిర్దిష్ట ఎత్తుతో పాటు దృష్టి లోపం లేకుండా ఉండాలి. ఇందుకోసం అభ్యర్థులకు మెడికల్ టెస్ట్ కూడా వుంటుంది. ఈ టీసీ ఉద్యోగాల‌కు సంబంధించిన‌ నోటిపికేషన్ పూర్తి వివరాల కోసం రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో indianrailways.gov.in చూడొచ్చు.

#Tags