Latest News : ఉద్యోగులకు ఊరట..... 317 జీఓతో 150 మందికి లబ్ధి

Latest News : ఉద్యోగులకు ఊరట..... 317 జీఓతో 150 మందికి లబ్ధి

మెదక్‌: ఏళ్ల తరబడి కుటుంబాలకు దూరంగా ఉంటున్నాం.. తమను స్వస్థలాలకు పంపాలని ఏళ్లుగా పోరాటం చేస్తున్న జీఓ 317 బాధితులకు ప్ర భుత్వం ఊరట కల్పించింది. ఇటీవల స్పౌజ్‌, హెల్త్‌, మ్యూచువల్‌ అంగీకారం ఉన్న వారిని బదిలీ చేసేందుకు అంగీకరించి జీఓ సైతం విడుదల చేసింది. అయితే స్థానికత కోల్పోయిన మిగితా ఉద్యోగులను స్వస్థలానికి పంపాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరని పేర్కొంది. దీంతో కొంతమంది ఉద్యోగులకు ఊరట దక్కగా, మరి కొంతమందికి నిరాశే మిగిలింది. జిల్లాలో ఒక్క విద్యాశాఖలోనే నాన్‌లోకల్‌ కేడర్‌కు చెందిన ఉపాధ్యాయులు 800 పైచిలుకు ఉన్నారు. మిగితా శాఖల్లో మరో 200 మంది వరకు ఉన్నారు. వీరంతా జిల్లాల పునర్విభజనలో భాగంగా దామాషా ప్రకారం ఇక్కడికి వచ్చి న వారు. తమ సొంత జిల్లాలకు పంపాలని చాలా కాలంగా పోరాటాం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: PG Spot Admissions : అంబేడ్క‌ర్ వ‌ర్సిటీలో పీజీ స్పాట్ అడ్మిష‌న్లు..

విద్యాశాఖలోనే 800 పైచిలుకు టీచర్లు

విద్యాశాఖలో నాన్‌లోకల్‌కు చెందిన ఉపాధ్యాయులు 800 పైచిలుకు ఉన్నారు. జిల్లాల పునర్విభజన సమయంలో వీరంతా సొంత జిల్లాలకు పంపాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగా ప్రభుత్వ ఆదేశాల మేరకు స్పౌజ్‌, హెల్త్‌, మ్యూచువల్‌గా బదిలీపై వెళ్లే అర్హులు 100 మంది వరకు ఉంటారని, ఇతర శాఖలకు చెందిన ఉద్యోగులు మరో 50 మంది ఉంటారని తెలిసింది. వీరికి మాత్రమే బదిలీ అవకాశం దక్కింది. ప్రధానంగా స్పౌజ్‌ ఉద్యోగులు వారి సహచరి ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఏశాఖలో అనే పూర్తి వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉద్యోగులు మెడికల్‌ పత్రాలతో సహా ఉన్న తాధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఉద్యోగుల పరస్పర అంగీకారం (మ్యూచ్‌వల్‌)తో బదిలీ అయ్యేందుకు వీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన నిబంధనతో జిల్లాలో కేవలం 150 మంది మాత్రమే ఊరట లభించింది. మిగితా 850 మంది నాన్‌లోకల్‌ ఉద్యోగులను సొంత జిల్లాలకు పంపాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి కావాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకున్న తర్వాతే నాన్‌లోకల్‌ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన పక్రియ మొదలవుతుందని జిల్లాకు చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

#Tags