JNTUK MBA and MCA Courses : జేఎన్‌టీయూకేలో స్పాన్స‌ర్డ్ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తులు..

కాకినాడలోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్శిటీ (జేఎన్‌టీయూకే) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్పాన్సర్డ్‌ విభాగంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. కాకినాడ, నరసరావు పేట క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

➺    అర్హత: కోర్సును అనుసరించి 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వ్‌డ్‌ కేటగిరీల విషయంలో 45 శాతం మార్కు లు ఉండాలి.
➺    ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, ఐసెట్‌–2024 ర్యాంక్, పని అనుభవం, కౌన్సెలింగ్‌ ఆధారంగా అభ్యర్థులకు సీటు కేటాయిస్తారు.
ముఖ్య సమాచారం
➺    దరఖాస్తులకు చివరితేది: 14.08.2024.
➺    దరఖాస్తు పంపాల్సిన చిరునామా: డైరెక్టర్, అడ్మిషన్స్, జేఎన్‌టీయూ కాకినాడ చిరునామకు పంపించాలి.
➺    వెబ్‌సైట్‌: www.jntuk.edu.in

AU Distance Education Admissions : ఆంధ్రా యూనివ‌ర్సిటీలో ఆన్‌లైన్‌ దూర‌విద్య యూజీ, పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తులు..

#Tags