NEET UG 2024 Important Instructions: రేపే నీట్‌ పరీక్ష.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయకండి.. డ్రెస్‌ కోడ్‌ ఫాలో అవ్వాల్సిందే

దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే (NEET UG) - 2024 ప్రవేశ పరీక్ష రేపు(మే 5)న జరగనుంది. అడ్మిట్‌కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్‌కార్డుతోపాటు, ప్రభుత్వం జారీచేసిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును, ఫోటోలను తీసుకొని పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తం 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇంగ్లిష్‌, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్‌ విధానంలో నిర్వహించనున్నారు.  మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులు చివరి నిమిషంలో పాటించాల్సిన టిప్స్‌, మార్గదర్శకాలపై ప్రత్యేక కథనం..


NEET UG 2024.. చివరి నిమిషంలో ఇలా చేయకండి..

  • అభ్యర్థులు చివరి నిమిషంలో ముఖ్యమైన అంశాలు, ఫార్ములాలు, డయాగ్రమ్స్‌ వంటి వాటిపై దృష్టి పెట్టాలి. ఇప్పుడు కొత్త అంశాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. 
  • ఏ ప్రవేశ పరీక్షల్లో అయినా మాక్‌ టెస్ట్‌లు కీలకంగా పనిచేస్తాయి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి? ఎంత సమయం పడుతుంది అన్న విషయాలపై స్పష్టత రావాలంటే మాక్‌ టెస్టులు ఎక్కువగా రాయాల్సి ఉంటుంది.
  • చాలామంది అభ్యర్థులు చివరి నిమిషం వరకు చదువుతూనే ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దు.పరీక్షకు ముందు రోజు రాత్రి తగినంత నిద్ర ఉండేలా చూసుకుంటే ఏకాగ్రత మరింత పెరుగుతుంది. 

NEET UG 2024 ముఖ్యమైన మార్గదర్శకాలు

  1. అభ్యర్థులు పరీక్షకు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ముందు రోజే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉంది? ఎలా చేరుకోవాలి? ఎంత సమయం పడుతుంది వంటి ముఖ్యమైన అంశాలను బేరీజు వేసుకొని ఎగ్జామ్‌ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. 
  2. పరీక్షా కేంద్రానికి అడ్మిట్‌ కార్డుతో పాటు ఆధార్‌ కార్డు లేదా ఓటర్ ID వంటి ప్రభుత్వ గుర్తింపు పొందిన ఐడీ ప్రూఫ్‌ని తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. 

డ్రెస్‌ కోడ్‌ పాటించాల్సిందే..

► అభ్యర్థులు డ్రెస్‌ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్‌లు, షూలు, నగలు, మెటల్‌ వస్తువులను లోపలికి అనుమతించరు. 

► స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్‌ మాత్రమే వేసుకోవాలి. 

► చేతికి వాచ్‌లు,వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్‌లు, బెల్ట్‌లు, టోపీలు వంటివి ధరించరాదు. 


NEET UG 2024.. పరీక్ష హాలులోకి తీసుకెళ్లాల్సినవి

  • నీట్ అడ్మిట్ కార్డ్ 2024
  • వాటర్ బాటిల్
  • పాస్‌పోర్ట్ సైజు ఫోటో
  • పాన్ కార్డ్, ఓటర్ ఐడి, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, రేషన్ కార్డ్ వంటి చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు.
  • చిన్న హ్యాండ్ శానిటైజర్ (50 మి.లీ.)

పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లకూడనివి..

►ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మైక్రోఫోన్‌లు వంటి గాడ్జెట్ పూర్తిగా నిషేధం. 
► మొబైల్‌ ఫోన్లు, బ్లూటూత్‌, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌ వంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలకు తీసుకెళ్లకూడదు

#Tags