NEET 2024 SC Hearing Live Updates: నీట్‌ రద్దు పిటిషన్లపై సుప్రీంకోర్టులో నేడు విచారణ

ఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని, రద్దు చేసి తిరిగి నిర్వహించాలని దాఖలైన పదుల సంఖ్యలో పిటిషన్లు నేడు విచారణకు రానున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. 

Diploma Students: డిప్లొమా విద్యార్థులకు 10వేల ఇంజనీరింగ్‌ సీట్లు.. పూర్తయిన కౌన్సెలింగ్‌

ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల వారీగా నీట్‌ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ( ఎన్‌టీఏ) విడుదల చేసిన విషయం తెలిసిందే. పరీక్ష రద్దు కోరుతూ 38 పిటిషన్లు దాఖలు కాగా.. అదేవిధంగా పలు రాష్ట్రాలోని హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లు సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరిన ఎన్టీఏ రెండు పిటిషన్లపైనా సుప్రీం విచారణ జరపనుంది.

#Tags