NDA and NA Notification: ఎన్‌డీఏ, ఎన్‌ఏ(2)–2024 నోటిఫికేష‌న్‌ విడుద‌ల.. ద‌ర‌ఖాస్తులకు చివ‌రి తేదీ!

ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ పరీక్షకు సంబంధించి నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది యూపీఎస్సీ. అర్హులైన మ‌హిళలు, పురుషులు ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు..

సాక్షి ఎడ్యుకేష‌న్‌:

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. ఏటా రెండుసార్లు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ (ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తుంది. 2024 సంవత్సరానికి సంబంధించి రెండో విడత నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
»    మొత్తం పోస్టుల సంఖ్య: 404
»    అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌కు(ఇండియన్‌ నేవల్‌ అకాడమి) దరఖాస్తుకు ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులే.
»    వయసు: అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు 02.01.2006కి ముందు, 01.01.2009కి తర్వాత పుట్టి ఉండకూడదు.
»    ఎంపిక విధానం: రెండు దశల్లో ఎంపికచేస్తారు. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్‌ –పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    పరీక్ష విధానం: మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి. పేపర్‌–1 మ్యాథమేటిక్స్‌–300 మార్కులు(సమయం రెండున్నర గంటలు), పేపర్‌–2 జనరల్‌ ఎబిలిటీ–600 మార్కులు(సమయం రెండున్నర గంటలు) ఉంటాయి. నెగిటివ్‌ మార్కులుంటాయి. రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌(ఎస్‌ఎస్‌బీ) ఆధ్వర్యంలో ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌లు నిర్వహిస్తారు. దీనికి 900 మార్కులు కేటాయించారు.ఇందులో ఆఫీసర్స్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్, పిక్చర్‌ పర్సెప్షన్‌ అండ్‌ డిస్క్రిప్షన్‌ టెస్ట్‌లు ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్ట్‌లు, గ్రూప్‌ డిస్కషన్‌ తదితర టాస్కులు నిర్వహిస్తారు. రాతపరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో సాధించిన మొత్తం మార్కు­ల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 15.05.2024.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 04.06.2024.
»    దరఖాస్తు సవరణ తేదీలు: 05.06.2024 నుంచి 11.06.2024వరకు 
»    ఆన్‌లైన్‌ రాతపరీక్ష: 01.09.2024.
»    కోర్సులు ప్రారంభం: 02.07.2025.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌.
»    వెబ్‌సైట్‌: https://upsc.gov.in

AP Inter Supplementary Exam 2024: ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి సర్వం సిద్ధం

#Tags