TS LAWCET 2023: లాసెట్ రెండో దశ కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
సాక్షి, హైదరాబాద్: మూడు, అయిదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశానికి డిసెంబర్ 11వ తేదీ నుంచి రెండో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు తెలంగాణ లా, పీజీ లాసెట్ కన్వీనర్ పి.రమేశ్‌బాబు ఒక ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 11 నుంచి 13వ తేదీలోగా లాసెట్ అర్హులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. 14వ తేదీలోగా మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని తెలిపారు. 14 నుంచి 16వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని, 19వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. సీట్లు వచ్చిన విద్యార్థులు డిసెంబర్ 23లోగా సంబంధిత కళాశాలల్లో రిపోర్టు చేయాలని సూచించారు.
#Tags