JEE Main 2025 Perfect Study Schedule : జేఈఈ మెయిన్స్ 2025 పరీక్షకు సరైన ప్రణాళిక ఇలా చేసుకోండి... టాప్ 10 టిప్స్ మీకోసం

ఒక గ‌మ్యాన్ని చేరుకోవాలంటే అందుకు త‌గ్గ శ్ర‌మ మాత్ర‌మే కాకుండా ఆ శ్ర‌మ‌కు ప్ర‌ణాళిక కూడా తొడ‌వ్వాలి. ఒక స‌రైన ప్ర‌ణాళికను సిద్ధం చేసుకొని ప్రిప‌రేష‌న్ ప్రారంభిస్తే స‌మ‌యానుసారం ప‌రీక్ష‌కు సిద్ధ‌మైన‌ట్టే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: జనవరి 22 నుంచి 31వరకు జేఈఈ మెయిన్ ప‌రీక్ష‌లు జ‌రగ‌నున్నాయి. అయితే, చాలామంది విద్యార్థులు ఉన్న కొంత స‌మ‌యాన్నైనా, ఎక్కువ స‌మ‌యాన్నైనా ఎలా, దేనికి కేటాయించుకోవాలో తెలియ‌క ఇబ్బందులు ఎదుర్కుంటారు. అయితే, వారి కోసం ఈ పది సూచ‌న‌లు ఉన్నాయి. వీటి ఆధారంగా మీరు మీ ప‌రీక్ష‌ల‌కు అభ్య‌స‌న చేయోచ్చు. దీంతో మీ మొద‌ట స‌రైన ప్ర‌ణాళిక‌ను రూపోందించుకోవ‌చ్చు. ఈ కింది సూచ‌న‌ల‌తో మీ స్ట‌డీ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోండి..

Join our Telegram Channel (Click Here)

1) పరిస్థితుల‌ను అంచ‌నా వేయాలి:

ప్ర‌స్తుతం, మీరు ఉన్న పరిస్థితుల‌ను.. అంటే, మీ స‌మ‌యం, బాధ్య‌త‌లు, అల‌వాట్లు వంటి విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని మీ చ‌దువుకు స‌మ‌యాన్ని కేటాయించాలి.

Telangana Voters: తెలంగాణలో ముసాయిదా ఓటరు జాబితా విడుదల‌.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంత‌మంది ఓటర్లు ఉన్నారంటే..

2) స‌బ్జెక్ట్స్‌.. అందులోని టాపిక్స్‌:

మీకు ఈజీగా ఉన్న టాపిక్స్‌, ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు, చాప్ట‌ర్లు, మీరు వెన‌క‌బ‌డి ఉన్న టాపిక్ల‌ను వంటి వాటిని స‌మ‌యానుసారంగా విభ‌జించుకోండి.

3) స‌మ‌య పాల‌న‌:

ప్ర‌తీ స‌బ్జెక్టుకు కొంత స‌మ‌యం కేటాయించాలి. ఉదాహ‌ర‌ణ‌కు: ఒక గంట ఒక స‌బ్జెక్ట్ పెట్టుకుంటే మ‌రో గంట మ‌రో స‌బ్జెక్ట్ లేదా విరామం ఉండాలి.
ఇందులో కూడా మీకు క్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లు, ఈజీగా ఉన్న ప్ర‌శ్న‌ల‌ను స‌మ‌యానుసారంగా విభ‌జించాలి. ఇలా అయితే, అన్ని టాపిక్స్‌ని పూర్తి చేయ‌గ‌ల‌రు.

Follow our YouTube Channel (Click Here)

4) పొమొడొరొ టెక్నిక్‌:

స‌మ‌యాన్ని విభ‌జించుకునే స‌మ‌యంలో పొమొడొరొ టెక్నిక్‌ను ఫాలో అవ్వండి. అంటే, 25 నిమిషాల పాటు చ‌దువుకొని, 5 నిమిషాల విరామం తీసుకోవాలి. ఇలా, నాలుగు సెషన్ల తర్వాత, పూర్తిగా 15-30 నిమిషాలు విరామం తీసుకోండి.

5) నేర్చుకోవడం కూడా:

పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డం లేదా ముఖ్య‌మైన ప్ర‌శ్న‌ల‌ను తీయ‌డం మాత్ర‌మే కాకుండా, స్ట‌డీ మెటీరిల్స్‌ను కూడా జ‌త‌ప‌రిచి, దానిని కూడా ఫాలో అవ్వాలి. గ‌తేడాదికి సంబంధించిన ప్ర‌శ్న ప‌త్రాలు, మెటీరియ‌ల్స్ వంటి వాటితో కూడా ప్రిపేర్ అవ్వాలి.
ప్రిప‌రేష‌న్ స‌మ‌యంలో మాక్ టెస్టులు, స‌మ‌య‌పాల‌న‌, వేగం, ఆలోచ‌నా విధానం వంటివి పెంచ‌డం త‌ప్పిసరి.

TGPSC HWO Results: వార్డెన్ / హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాలు... సర్టిఫికేట్ ధృవీకరణ షెడ్యూల్ విడుదల

6) ప్ర‌తీ రోజు స‌మీక్ష త‌ప్పనిస‌రి:

మీరు చ‌దివిన‌, రాసిన‌, మాక్ టెస్టులు, వేగం ప‌రిశీల‌నకు వారం వారం స‌మీక్ష ఇవ్వాలి. దీంతో మీ వేగం పెంచ‌డం, త‌గ్గించ‌డంపై స్ప‌ష్ట‌త వ‌స్తుంది. ఇది మీకు మ‌రో అడుగులో స‌హాయ‌ప‌డుతుంది.

7) విరామాలు త‌ప్ప‌నిస‌రి:

ప్ర‌తీ సెష‌న్ త‌రువాత విరామం తీసుకోవాలి. మాన‌సికంగా, శారిరకంగా ఎప్పుడూ బ‌లంగా ఉండేలా వ్యాయామాలు, సొంత పనులు, బ‌య‌ట తిర‌గ‌డం, భోజ‌నం చేయ‌డం, ఇత‌రుల‌తో సంభాష‌ణ వంటివి త‌ప్ప‌నిసరి. ఇది మీకు అన్ని విధాలుగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

Follow our Instagram Page (Click Here)

8) అన్ని విధాలుగా న‌డుచుకోవాలి:

ప్ర‌ణాళిక అనేది ఒక ప్రోత్సాహంగా ఉండాలేకాని, అదొక క‌ఠిన‌మైన నియామ‌వాళి కాకూడ‌దు. మీ షెడ్యూల్ మ‌ధ్యలో ఒక్కొసారి అనుకోని ప‌రిస్థితులు రావ‌చ్చు.. ఉదా: పండుగ‌లు, కుటుంబంతో స‌ర‌దాలు వంటివి వ‌చ్చిన‌ప్పుడు వాటిని కూడా స్వీక‌రించి అన్నింటిని స‌ర్దుకోవాలి.

9) ప్రిప‌రేష‌న్ ప‌రిశీల‌న‌:

మీరు ప్రిపేర్ అయిన‌, మాక్ టెస్టులు, అన్నింటిని ప‌రిశీలిస్తూ ఉండాలి.  మీ పురోగతిని పర్యవేక్షించడానికి దానిని మ‌రింత‌ మెరుగుపరచడానికి అవసరమైన ప్రాంతాలను ప్రతిబింబించడానికి ఏదైనా ప్లానర్ లేదా అధ్యయన యాప్‌ని ఉపయోగించండి. దీంతో మీ ప్రిప‌రేష‌న్‌ను మీరే ప‌రిశీలించ‌వ‌చ్చు.

Telangana Caste Census: తెలంగాణలో కుల గణన.. ఎప్ప‌టినుంచంటే..

10) ఆహారం, ఆరోగ్యానికి ప్రాధాన్య‌త‌:

స‌మయానికి చ‌దువు మాత్ర‌మే పూర్తి చేసుకుంటే స‌రిపోదు. అదే స‌మ‌య పాల‌న మీ ఆరోగ్యంపై కూడా చూపించాలి. స‌మ‌యానికి నిద్ర‌, ఆహారం, వ్యాయామం, విరామాలు త‌ప్పకుండా పాటించాలి. ఆరోగం ఉంటేనే ఏదైనా చేయ‌గ‌లిగే శ‌క్తి ఉంటుంది.
ప్ర‌ణాళిక‌ను ప‌రీక్ష‌కు సిద్ధ‌మైయ్యేందుకే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా పాటించాలి. ఇలా అయితే, కేవ‌లం మీరు రాసే ప‌రీక్ష‌లోనే కాదు అన్నింటిలో ముందే ఉంటారు.

Join our WhatsApp Channel (Click Here)

ఈ మార్గాల‌ను ఉపయోగించి మీకు త‌గ్గట్టుగా ప్ర‌ణాళిక‌ను ప్రిపేర్ చేసుకోండి. మీరు క్రమబద్ధంగా, ఏకాగ్రతతో మీ అధ్యయనాలలో రాణించడానికి సిద్ధంగా ఉండేలా చక్కటి అధ్యయన షెడ్యూల్‌ను రూపొందించవచ్చు.

జనవరి 22 నుంచి 31వరకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో కంప్యూటర్‌పై పరీక్షను నిర్వహించనున్నట్టు వివరించింది. ఫిబ్రవరి 12న తుది ఫలితాలు వెల్లడించనుంది. జేఈఈ మెయిన్స్‌ను 13 ప్రాంతీయ భాషల్లో చేపట్టనుంది.

#Tags