ప్రకటనలు - వాదనలు

‘ప్రకటనలు - వాదనలు’ చాప్టర్‌లోని ప్రశ్నలు ప్రకటనల రూపంలో ఉంటాయి. ప్రకటనల కింద రెండు వాదనలు అవును లేదా కాదు అని ఇస్తారు. ఈ ప్రశ్నలకు జవాబు గుర్తించడానికి సూచనలు..
  • ఈ చాప్టర్‌లోని ప్రశ్నలకు జవాబు గుర్తించేటప్పుడు ఆ జవాబు (వాదనలు) ప్రకటనకు సంబంధించి ఉండాలి. కానీ నిజ జీవితానికి సంబంధించి అన్వయించుకోకూడదు.
  • బలమైన వాదనే సరైన వాదన అవుతుంది. అవును అని ఉన్నా, లేదా కాదు అని ఉన్నా బలమైన వాదనే సరైంది.
  • వాదనల్లో తిరిగి ప్రశ్నించినట్టు ఉంటే ఆ వాదన సరైంది కాదు.
  • వాదనలు నిజాలుగా ఉండాలి. కానీ ఊహలుగా ఉండకూడదు.
ఉదాహరణ:
ప్రకటన: భారతదేశంలో రూపాయికే కిలో బియ్యం ఇవ్వొచ్చా?
వాదన -1: అవును, పేదరిక నిర్మూలనకు కేవలం ఇదొక్కటే మార్గం.
వాదన -2: కాదు, ప్రభుత్వంపై ఇప్పటికే అధిక భారం ఉంది.
సమాధానం: 2 మాత్రమే సరైంది
వివరణ: పేదరిక నిర్మూలనకు ఇదొక్కటే మార్గం అని చెప్పడం మిగతా అంశాలను విస్మరించినట్టే అవుతుంది కాబట్టి వాదన 1 సరైంది కాదు. కానీ వాదన 2 మాత్రమే సరైంది, బలంగా ఉంది.

మాదిరి ప్రశ్నలు

కింద ప్రకటనలు, వాటి కింద రెండు వాదనలు ఉన్నాయి. ఆ వాదనలను జాగ్రత్తగా విశ్లేషించి ఏ వాదన బలమైందో, ఏది బలహీనమైందో/ పేలవమైందో గుర్తించాలి. ఆప్షన్‌ను కింది విధంగా ఎంచుకోవాలి.
1. కేవలం వాదన-1 మాత్రమే బలమైంది అయితే.
2. కేవలం వాదన-2 మాత్రమే బలమైంది అయితే.
3. రెండు వాదనలూ సరైనవి కాకపోతే.
4. రెండు వాదనలూ సరైనవి అయితే.

#Tags