APPSC Group 2 Prelims Exam Results 2024 : ఏక్షణంలోనై గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..! ఏపీపీఎస్సీ వర్గాలు ఏమన్నారంటే..?
మార్చి 30వ తేదీన ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ పరిగి సుధీర్ ఎక్స్ (X) వేదికగా త్వరలోనే గ్రూప్-2 ఫలితాలను విడుదల చేస్తామన్నారు. గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన విషయం తెల్సిందే.
గ్రూప్-2 ప్రిలిమ్స్ 2024 పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోగా 4,04,037 మంది అంటే.. (87.17) శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.
అలాగే Group 2 Prelims Exam 2024 ఎంపిక నిష్పత్తి 1:100 ఉంటుందని ఏపీపీఎస్సీ బోర్డ్ మెంబర్ Parige Sudhir గారు ఎక్స్ వేదికగా గతంలో తెలిపారు.
APPSC Group-2 స్క్రీనింగ్ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను రెండు పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్–1లో సెక్షన్–1: సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రదేశ్‌లోని సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలు); సెక్షన్–2: భారత రాజ్యాంగం సమీక్షల నుంచి 150 ప్రశ్నలు (150 మార్కులు) అడుగుతారు. పేపర్–2లో సెక్షన్–1: భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ; సెక్షన్–2 సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు(150 మార్కులు) అడుగుతారు.