APPSC Group 2 Prelims 2024 Official Key 2024 PDF : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కీ విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు మాత్రం..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) నిర్వహించిన గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రశాంతంగా ఫిబ్ర‌వ‌రి 25వ తేదీన‌ ముగిసింది. 24 జిల్లాల్లో 1,327 సెంటర్లలో ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,83,525 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. 4,63,517 మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోగా 87.17 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 899 పోస్టుల భర్తీకి ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్‌ పరీక్ష ప్రాథ‌మిక కీ ని ఫిబ్ర‌వ‌రి 26వ తేదీన‌(సోమ‌వారం) విడుద‌ల చేసింది. అలాగే ఈ కీ పై ఏమైన అభ్యంతరాలు ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ నుంచి ఫిబ్ర‌వ‌రి 29వ తేదీలోపు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు తెల‌ప‌వ‌చ్చును. అలాగే ఈ అభ్యంతరాలను కేవ‌లం ఏపీపీఎస్సీ అధికారిక‌ వెబ్‌సైట్ నుంచి మాత్ర‌మే తెల‌ప‌వ‌లెను. వాట్స‌ప్‌, ఎస్ఎంఎస్‌, పోస్ట్‌, ఫోన్ ద్వారా తీసుకోబ‌డ‌దు.

ఫ‌లితాలు మాత్రం..
గ్రూప్‌–2 ప్రిలిమ్స్‌ ఫలితాలను 5 నుంచి 8 వారాల్లో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్‌ కుమా­ర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. జూన్‌ లేదా జూలైలో గ్రూప్‌–2 మెయిన్స్‌ నిర్వహిస్తామని వెల్లడించారు.

APPSC Group 2 Prelims 2024 Official Key 2024 ఇదే..

 Tags

#Tags