TGPSC Group-2 Exam schedule Released: గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ విడుదల..

TGPSC Group-2 Exam schedule Released

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ(TGPSC) విడుదల చేసింది. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో పరీక్షలను నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రకటనను జారీ చేసింది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి.

Deloitte Employee well Being Programs: ఇప్పుడిదే ట్రెండ్‌.. ఉద్యోగుల ఆనందం కోసం ప్రత్యేకంగా టీమ్‌

కాగా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్ట్‌ 7, 8 తేదీల్లోనే గ్రూప్2 పరీక్షలు జరగాల్సి ఉండగా నిరుద్యోగుల నుంచి వచ్చిన  విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షలను వాయిదా వేసింది. కొత్త తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. తాజాగా గ్రూప్‌-2 పరీక్షల తేదీలను విడుదల చేసింది

తెలంగాణ గ్రూప్‌-2 పరీక్షల షెడ్యూల్‌ ఇదే

  • డిసెంబర్‌ 15న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1
  • డిసెంబర్‌ 15న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-2
  • డిసెంబర్‌ 16న ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-3
  • డిసెంబర్‌ 16న మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్‌-4

#Tags