Tallest Buildings in World: ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు ఉన్న‌ నగరం ఏమిటో మీకు తెలుసా..?

మహానగరాలంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి ఆకాశహర్మ్యాలే.. నింగిని తాకేలా ఉండే ఈ భవనాలను చూసి అచ్చెరువొందని వారు ఉండరు. ఇంతకూ మీకీ విషయం తెలుసా? ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనాలు కలిగిన నగరం ఏమిటో? ఏ అమెరికాదో అయి ఉంటుందని అనుకుంటున్నారు కదూ.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఆకాశహర్మ్యాలు కలిగిన నగరం చైనాలోని షెంజెన్‌.

200 మీటర్లు(దాదాపుగా 60 అంతస్తులు) అంతకన్నా ఎక్కువ ఎత్తున్న భవనాలు ఇక్కడ 120 ఉన్నాయట.

ముంబై మాత్రం..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్‌ ఖలీఫా(828 మీటర్లు) ఉన్న దుబాయ్‌ తర్వాతి స్థానంలో నిలిచింది. టాల్‌ బిల్డింగ్స్‌ అండ్‌ అర్బన్‌ హ్యాబిటాట్‌ కౌన్సిల్‌ విడుదల చేసిన జాబితాలో అత్యధికంగా చైనాలోని నగరాలే ఉన్నాయి. 27వ స్థానంలో ముంబై ఉంది. కోల్‌కతా 199వ స్థానంలో(ఒకే భవనం) ఉంది. షెంజెన్‌కి సంబంధించి మరో విశేషం ఏమిటంటే.. ఇక్కడ 159 మీటర్లు అంతకన్నా ఎక్కువ ఎత్తున్న 162 భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇందులో ఓ 40 భవనాలను ఈ ఏడాదే ప్రారంభించనున్నారు. అంటే.. భవిష్యత్తులో ఈ కేటగిరీలో షెంజెన్‌ను కొట్టేవాడు లేడన్నమాట.

#Tags