నింగిలోకి రెండో దిక్సూచి
సి. హరికృష్ణ, సివిల్స్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రయోగం విజయవంతమైంది. భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం -ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) శ్రేణిలో భాగంగాఉపయోగించాల్సిన ఏడు ఉపగ్రహాలలో రెండోదైన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని ఇస్రోపీఎస్‌ఎల్‌వీ-సీ 24 ద్వారా దిగ్విజయంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 4న సాయంత్రం 5.14 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సీ24 నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఇస్రో నిర్వహించిన పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో ఇది 26వది. అంతేకాకుండా 25వ వరుస విజయవంతమైన ప్రయోగం. లిఫ్ట్‌ఆఫ్ జరిగిన 19.26 నిమిషాలకు ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీని 283 కి.మీ. పెరీజీ, 20,630 కి.మీ. అపోజీ పరిధి ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ24 ప్రవేశించింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో మొత్తం రూ.225 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో వాహకనౌక తయారీకి రూ. 125 కోట్లు కాగా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ రూపకల్పనకు రూ.125 కోట్లు వెచ్చించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న పూర్తి స్వదేశీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్) లోని ఏడు ఉపగ్రహాల్లో రెండోది ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ. 2013, జూలై 1న పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ రూపకల్పనలో 140 మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌లో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భారత భూభాగంతోపాటు అదనంగా సరిహద్దు బయట 1,500 కి.మీ. పరిధి వరకు ఈ ఏడు ఉపగ్రహాల సముదాయం నుంచి సంకేతాలు (సిగ్నళ్లు) లభిస్తాయి. ఫలితంగా ఈ విస్తీర్ణంలో సేవలు అందుతాయి. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ తో ఇప్పటికి రెండు ఉపగ్రహాలను ఈ వ్యవస్థలో ఇస్రో ప్రయోగించింది. 2015-16 నాటికి మిగతా 5 ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించనుంది. ఏడుకు అదనంగా భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ - ప్రయోజనాలు:
నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రవాణా రంగంలో వ్యక్తులు తాము చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంతదూరంలో ఉందో నిర్ధారించుకోవడంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించేందుకు ఇది అక్కరకు వస్తుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి కూడా ఉపయోగపడుతుంది. మొదటిసారిగా 1970లో అమెరికా సైనికులకు కావాల్సిన దిశానిర్దేశం కోసం ప్రారంభించిన గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ నేడు సైనిక అవసరాలతోపాటు, అనేక సైనికేతర అవసరాలకు ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారా బ్యాంకింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఇతర దేశాల ఉపగ్రహాలపై ఆధారపడటం కంటే దేశీయ నావిగేషన్ వ్యవస్థ ద్వారా పూర్తి భద్రతతో కూడిన సైనిక రక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది.
గగన్ (GAGAN):
ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ కోసం ఇస్రో, ఎయిర్‌పోర్‌ట్స అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో గగన్ (GPS ఎయిడెడ్ జియో ఆగ్‌మెంటెడ్ నావిగేషన్) అనే వ్యవస్థను ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వెలుపల అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ పౌరవిమానయాన రంగం (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) ఒత్తిడితో భారత్ గగన్‌ను అభివృద్ధి చేసింది. గగన్‌కు సంబంధించిన రెండు పేలోడ్‌లను ఇప్పటికే ఇస్రో జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాలతో ప్రయోగించింది. విమానయానంలో జీపీఎస్ సేవలను గగన్ మరింత అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లో స్పష్టతపెరుగుతుంది.
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీ:
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థలో ఇది రెండోది. దీని బరువు 1,432 కిలోలు జూలై 1, 2013న పీఎస్‌ఎల్‌వీ-సీ22 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ నిర్మాణం ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీను పోలి ఉంటుంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏను ప్రయోగించిన ఏడు నెలల్లోనే ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1బీను అభివృద్ధి చేయడం విశేషం. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1 బీలో రెండు రకాల పేలోడ్‌లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్, రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు జీపీఎస్ సిగ్నళ్లను నావిగేషన్ పేలోడ్ అందిస్తుంది. ఎల్5 బ్యాండ్ (1176.45 మెగాహెర్‌ట్జ), ఎస్-బ్యాండ్ (2492.028 మెగాహెర్‌ట్జ) పరిధిలో నావిగేషన్ పేలోడ్ పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్దిష్టతతో పనిచేసే రుబిడియం అణు గడియారం ఇందులో ఉంటుంది. రేంజింగ్ పేలోడ్‌లో ఒక సీ-బ్యాండ్ ట్రాన్‌సపాండర్ ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్లూ ఐఆర్‌ఎన్‌ఎస్.ఎస్-1బీలో ఉన్నాయి.
పీఎస్‌ఎల్‌వీ-సీ24:
పీఎస్‌ఎల్‌వీ-సీ24 నౌక ఇస్రో ప్రయోగించిన 26వ పీఎస్‌ఎల్‌వీ.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ రూపంలో స్ట్రాప్-ఆన్ మోటార్ల పరిమాణం పెంచుతారు. లిఫ్ట్‌ఆఫ్ సమయంలో పీఎస్‌ఎల్‌వీ-సీ24 బరువు 320 టన్నులు, పొడవు 44.5 మీటర్లు. పీఎస్‌ఎల్‌వీ-ఎక్స్‌ఎల్ రూపంలో పీఎస్‌ఎల్‌వీని ప్రయోగించడం ఇది ఆరోసారి.
వడివడిగా అడుగులు:
ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్‌ఎల్‌వీ కీలకమైంది. పీఎస్‌ఎల్‌వి కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్‌ఎల్‌వీ-3, ఎఎస్‌ఎల్‌వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్‌ఎల్‌వీ నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశలో ఘన ఇంధనాన్ని 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-1 అదే విధంగా మంగళయాన్‌ను కూడా పీఎస్‌ఎల్‌వీ ప్రయోగించింది. ఇప్పటివరకు చేపట్టిన 26 పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 23 కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్‌ఎల్‌వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 25 ప్రయోగాలు (పీఎస్‌ఎల్‌వీ-సీ 24తో కలిపి) వరుసగా విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్‌ఎల్‌వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఫ్రాన్‌సకు చెందిన స్పాట్-7, ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్‌ఎల్‌వీ అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో ఇస్రో వాణిజ్య విభాగం అంత్రిక్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది.
ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలు:
ప్రపంచంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్న నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్. ఇది రెండు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో 24 ఉపగ్రహాలు ఆరు అక్షాల్లో పరిభ్రమిస్తూ మొత్తం భూమిని కవర్ చేస్తూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదే తరహాలో అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ జీఎల్‌ఓఎన్‌ఏఎస్‌ఎస్-గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)లో కూడా 24 ఉపగ్రహాలు ఉంటాయి. యూరప్‌లోనూ గెలీలియో పేరుతో 27 ఉపగ్రహాల సముదాయం ఏర్పాటవుతోంది. చైనాలో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ బీడోయ్ నావిగేషనల్ వ్యవస్థ, జపాన్‌కు చెందినది, క్వాసీ జెనిథ్ శాటిలైట్ సిస్టం.
ఇదివరకటి పి.ఎస్.ఎల్.వి-ఎక్స్‌ఎల్ ప్రయోగాలు
పీఎస్‌ఎల్‌వీ-సీ11/ చంద్రయాన్-1
పీఎస్‌ఎల్‌వీ-సీ17 జీశాట్-12
పీఎస్‌ఎల్‌వీ-సీ19 రీశాట్-1
పీఎస్‌ఎల్‌వీ-సీ22/ ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్-1ఏ
పీఎస్‌ఎల్‌వీ-సీ23/ మంగళయాన్
పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు

పీఎస్‌ఎల్‌వీ | ప్రయోగ తేదీ | ప్రయోగించిన ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-డీ1 | సెప్టెంబర్ 20, 1993 | ఐఆర్‌ఎస్-1 ఈ ప్రయోగం విఫలం |
పీఎస్‌ఎల్‌వీ-డీ2 | అక్టోబర్ 15, 1994 | ఐఆర్‌ఎస్-పీ2 |
పీఎస్‌ఎల్‌వీ-డీ3 | మార్చి 21, 1996 | ఐఆర్‌ఎస్-పీ3 |
పీఎస్‌ఎల్‌వీ-సీ1 | సెప్టెంబర్ 29, 1997 | ఐఆర్‌ఎస్-1డీ |
పీఎస్‌ఎల్‌వీ-సీ2 | మే 26, 1999 | ఐఆర్‌ఎస్-పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్‌ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ) |
పీఎస్‌ఎల్‌వీ-సీ3 | అక్టోబర్ 22, 2001 | టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, టెక్నాలజీ ఎక్స్‌పెరిమెంట్ శాటిలైట్, బర్‌డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం) |
పీఎస్‌ఎల్‌వీ-సీ4 | సెప్టెంబర్ 12, 2002 | కల్పన-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ5 | అక్టోబర్ 17, 2003 | ఐఆర్‌ఎస్-పీ6 (రిసోర్‌సశాట్-1) |
పీఎస్‌ఎల్‌వీ-సీ6 | మే 5, 2005 | కార్టోశాట్-1, హోమ్‌శాట్ |
పీఎస్‌ఎల్‌వీ-సీ7 | జనవరి 10, 2007 | కార్టోశాట్-2, ఎస్‌ఆర్‌ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా) |
పీఎస్‌ఎల్‌వీ-సీ8 | ఏప్రిల్ 23, 2007 | ఎజైల్ (ఇటలీ), అడ్వాన్‌సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం) |
పీఎస్‌ఎల్‌వీ-సీ10 | జనవరి 21, 2008 | టెక్సర్ (ఇజ్రాయెల్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ9 | ఏప్రిల్ 28, 2008 | కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ- సీ11 | అక్టోబర్ 22, 2008 | చంద్రయాన్-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ12 | ఏప్రిల్ 20, 2009 | రీశాట్-2+అనుశాట్ |
పీఎస్‌ఎల్‌వీ-సీ14 | సెప్టెంబర్ 23, 2009 | ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-సీ15 | జూలై 12, 2010 | కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్ |
పీఎస్‌ఎల్‌వీ-సీ16 | ఏప్రిల్ 20, 2011 | రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ17 | జూలై 15, 2011 | జీశాట్12 |
పీఎస్‌ఎల్‌వీ-సీ18 | అక్టోబర్ 12, 2011 | మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ19 | ఏప్రిల్ 26, 2012 | రీశాట్-1 |
పీఎస్‌ఎల్‌వీ-సీ20 | ఫిబ్రవరి 25, 2013 | సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు |
పీఎస్‌ఎల్‌వీ-సీ21 | సెప్టెంబర్ 9, 2012 | స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్) |
పీఎస్‌ఎల్‌వీ-సీ22 | జూలై 1, 2013 | ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఏ |
పీఎస్‌ఎల్‌వీ-సీ23 | నవంబర్ 5, 2013 | మంగళయాన్ |
#Tags